ఆంధ్రభారతి
From Wikipedia, the free encyclopedia
అంతర్జాలంలో శోధనాయంత్రంగల తెలుగు నిఘంటువులలో ప్రముఖమైనవాటిలో ఆంధ్రభారతి డాట్ కామ్ [1] ఒకటి.
ఈ వెబ్‌సైట్‌ను వాడపల్లి శేషతల్పశాయి, కాలెపు నాగభూషణరావు నిర్వహిస్తున్నారు. దీనిలో 16 తెలుగు భాష నిఘంటువులు నిక్షిప్తం చేశారు. మొత్తం 71 నిఘంటువులు స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నానికి తానా సంస్థ సహకారాన్ని అందిస్తుంది.[2][3]
నిక్షిప్తమైన నిఘంటువులు

- శబ్దరత్నాకరము (బహుజనపల్లి)
- బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
- శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
- శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి)
- బ్రౌన్ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు
- శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు
- ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు)
- ఉర్దూ-తెలుగు నిఘంటువు (పతంగే)
- తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)
- సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి)
- మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)
- మాండలిక పదకోశం (తె.అ.)
- ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.)
- శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ)
- కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం)
- తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్)
వనరులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.