అశ్వమేధ యాగం వేద కాలంనుండి వస్తున్న రాజ సంప్రదాయాలలో అతి ముఖ్యమైంది. ఈ యాగం వివరముగా యజుర్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదములో గుర్రపు బలి గురించి RV 1.162-163 శ్లోకాలలో కొంత ప్రస్తావన ఉన్నాయి. యజుర్వేదములో చెప్పినంత వివరముగా చెప్పబడిలేదు. గాయత్రీ పరివార్ 1991 నాటి నుండి జంతు బలి లేకుండా, అశ్వ మేధ యజ్ణాన్ని ఆధునిక శైలిలో నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
వేద కాలం నాటి యాగం
అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై ఆధిపత్యాన్ని తెలుపడం, తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృఢంగా ఉండే 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్ర జలంతో శుద్ధి చేసాక, ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ, ఒక కుక్కను చంపి సంకేతంగా శిక్షను తెలియచేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని ఒక సంవత్సరకాలం (కొంతమంది అర్థ సంవత్సర కాలమని చెపుతారు) యధేచ్చగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ, సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు. అశ్వం శత్రు రాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతీ ఆపద, ఇబ్బందులనుండి కాపాడడానికి తోడుగా రాజ కుమారులు కాని సేనాధిపతులు గాని ఉంటారు. నిర్వాహకుని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ఞ యాగాదులు జరుపుతారు.
గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. మరి మూడు గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడి వేసి కట్టి ఋగ్వేదాన్ని RV1.6.1,2 (YV VSM 23.5,6) పఠిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి, మహారాణీ, తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనమాచరిస్తారు. మహారాణీ ముందు కాళ్ళను, పరిచారికలు కడుపు భాగాన్ని, వెనుక కాళ్ళను అభ్యంగనమాచరిస్తారు. అశ్వం తల, మెడ, తోకలను బంగారు ఆభరణములతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నైవేద్యాన్ని సమర్పిస్తాడు.
ఆ తర్వాత గుర్రాన్ని, ఒక కొమ్ములులేని మగ మేకను, ఒక గోమృగాన్ని (అడవి బర్రె)ని అగ్ని గుండానికి దగ్గరగా బలి పీఠానికి కట్టి వేస్తారు. ఇంకా 17 జంతువులను గుర్రానికి కడతారు. ఇంకా చాలా పెంపుడు, అడవి జంతువులను (ఒక వ్యాఖ్యాత ప్రకారం మొత్తం 609 జంతువులు) వేర్వేరు బలి పీఠాలకు కట్టి వేస్తారు (YV VSM 24 consists of an exact enumeration).
అప్పుడు ఆ గుర్రాన్ని బలి చేస్తారు (YV VSM 23.15, tr. Griffith)
- Steed, from thy body, of thyself, sacrifice and accept thyself.
- Thy greatness can be gained by none but thee.
ముగ్గురు రాణులు ఒక వంద బంగారు, వెండి, రాగి సూదులతో గుర్రపు శరీరం పై కోయవలసిన భాగాలపై గురుతులుగా గీతలు గీస్తారు. గుర్రాన్ని కోసి మంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాలు వేర్వేరు దేవుళ్ళకు నైవేద్యంగా స్వాహా అంటూ అగ్ని గుండంలో వేస్తారు. ఆ తర్వాత అశ్వ స్తుతితో (RV 1.162, YV VSM 24.24–45), యాగం ముగుస్తుంది.
- May this Steed bring us all-sustaining riches, wealth in good kine, good horses, manly offspring
- Freedom from sin may Aditi vouchsafe us: the Steed with our oblations gain us lordship!
The priests performing the sacrifice were recompensed with a part of the booty won during the wandering of the horse. According to a commentator, the spoils from the east was given to the Hotar, while the Adhvaryu a maiden (a daughter of the sacrificer) and the sacrificer's fourth wife.
The Shatapatha Brahmana emphasizes the royal nature of the Ashvamedha:
- Verily, the Asvamedha means royal sway: it is after royal sway that these strive who guard the horse. (ŚBM 13.1.6.3 trans. Eggeling 1900)
It repeatedly states that "the Asvamedha is everything" (ŚBM 13.4.2.22 trans. Eggeling 1900)
చారిత్రక నిర్వహణ
లిఖిత చరిత్రలో అశ్వమేధ యాగ నిర్వహణ చివరి మౌర్య చక్రవర్తిని చంపి శుంగవంశాన్ని స్థాపించిన పుష్యమిత్ర శుంగుడు (c. 185-149 BCE), రెండవ చంద్రగుప్తుని తండ్రి సముద్ర గుప్తుడు (c. 335-375 CE) ని హయాంలో జరిగింది. అశ్వమేధ యాగానికి గుర్తుగా ప్రత్యేక నాణాలను పోత పోయించాడు. నిర్వహణ విజయవంతమైన తర్వాత ఈతనికి మహారాజాధిరాజ బిరుదు లభించింది.
ఆ తర్వాతి నిర్వహణలు చాలా తక్కువ. 12 వ శతాబ్దంలో కన్నౌజ్ రాజా అశ్వమేధాన్ని తల పెట్టిన, దానిని పృథ్వీరాజ్ చౌహాన్ భంగె చేసి ఆ తర్వాత కన్నౌజ్ రాజు కూతురుని పెళ్ళియాడాడు. చరిత్రలో తెలిసిన చివరి నిర్వహణ జైపూర్ రాజైన ఆంబర్ కు చెందిన జయ సింగ్ II 1716 లో జరిపిన యాగం [1]
ఇతిహాసాలలో నిర్వహణ
- కర్దమ ప్రజాపతి కుమారుడు ఇలుడు, అశ్వమేధం నిర్వహించి, పురుషత్వాన్ని తిరిగి పొందాడు.
- శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు పట్టాభిషిక్తుడై అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు.
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.