From Wikipedia, the free encyclopedia
అల్కా లాంబా (జననం 1975 సెప్టెంబరు 21) భారతీయ రాజకీయవేత్త. దాదాపు 20 సంవత్సరాలకు పైగా వివిధ హోదాల్లో భారత జాతీయ కాంగ్రెస్‌కు సేవలందించిన తర్వాత,[1] ఆమె 2014 డిసెంబరు 26న ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది.[2] ఫిబ్రవరి 2015లో, ఆమె చాందినీ చౌక్ నుండి ఢిల్లీ శాసనసభకు ఎన్నికయ్యింది. కానీ, తన పట్ల అగౌరవాన్ని ఎత్తి చూపుతూ సెప్టెంబరు 2019లో ఆమె ఆ పార్టీని కూడా వీడింది. 2019 సెప్టెంబరు 6న, ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చింది.[3] అయితే, పార్టీ మార్పు కారణంగా ఆమెను స్పీకర్ ఢిల్లీ శాసనసభకు అనర్హురాలుగా ప్రకటించాడు.[4]
అల్కా లాంబా | |
---|---|
ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ | |
In office 2015 ఫిబ్రవరి 7 – 2019 సెప్టెంబరు 19 | |
అంతకు ముందు వారు | పర్లాద్ సింగ్ సాహ్నీ |
తరువాత వారు | పర్లాద్ సింగ్ సాహ్నీ |
నియోజకవర్గం | చాందినీ చౌక్ |
నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు | |
In office 1997–1999 | |
అంతకు ముందు వారు | సలీమ్ అహ్మద్ |
తరువాత వారు | మీనాక్షి నటరాజన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | న్యూ ఢిల్లీ, భారతదేశం | 1975 సెప్టెంబరు 21
రాజకీయ పార్టీ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (2019 సెప్టెంబరు 6 నుండి ఇప్పటి వరకు) |
ఇతర రాజకీయ పదవులు | ఆమ్ ఆద్మీ పార్టీ (2014–2019) |
వృత్తి | రాజకీయ నాయకురాలు |
ఆమె విద్యార్థి నాయకురాలిగా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె గతంలో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) జాతీయ అధ్యక్షురాలిగా, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(AICC) కార్యదర్శిగా విధులు నిర్వర్తించింది. ఆమె గో ఇండియా ఫౌండేషన్ అనే ప్రభుత్వేతర సంస్థ(NGO) చైర్పర్సన్ కూడా.[5][6]
ఆమె న్యూ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీ సివిలియన్ ఇంజనీర్ అయిన అమర్ నాథ్ లాంబా, రాజ్ కుమారి దంపతులకు జన్మించింది. ఆమె ఆరుగురు తోబుట్టువులలో ఒకరు.[7]
ఆమె పాఠశాల విద్యను ఢిల్లీలోని ప్రభుత్వ బాలికల సీనియర్ సెకండరీ స్కూల్ నెం.1లో పూర్తి చేసింది. తర్వాత ఆమె 1996లో ఢిల్లీలోని దయాల్ సింగ్ కళాశాల నుండి బీఎస్సీ డిగ్రీని పొందింది. ఆ తరువాత, ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ విశ్వవిద్యాలయం నుండి కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీని కూడా అభ్యసించింది.[8]
ఆమె లోకేష్ కపూర్‌ని పెళ్లాడింది. ప్రస్తుతం వారు విడాకులు తీసుకున్నారు. వీరికి హృతిక్ లాంబా అనే కుమారుడు ఉన్నాడు.[9]
అల్కా లాంబా నిర్వహిస్తున్న గో ఇండియా ఫౌండేషన్ అనే ప్రభుత్వేతర సంస్థ 2010లో రక్తదాన ప్రచారంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కరోజులో 65000 మందికి పైగా రక్తదానం చేయడం విశేషం.[10] ఈ ప్రచారాన్ని సల్మాన్ ఖాన్ చేసాడు.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.