Remove ads
ఢిల్లీ రాష్ట్రంలోని ఉత్తర ఢిల్లీ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం, From Wikipedia, the free encyclopedia
అలీపూర్, భారతదేశం, ఢిల్లీ రాష్ట్రంలోని ఉత్తర ఢిల్లీ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం, ఉప-విభాగం. దీని చుట్టూ బవానా, నరేలా, బుద్పూర్, బకోలి, ముఖ్మేల్పూర్ ప్రాంతాలు ఉన్నాయి. అలీపూర్ ప్రాంతం నరేలా నియోజకవర్గం పరిధి లోకి వస్తుంది. సమీపంలో జహంగీర్‌పురి మెట్రో స్టేషన్ అనే మెట్రో స్టేషన్ ఉంది.ఈ ప్రాంతం అలీపూర్ ఢిల్లీ-అమృతసర్ జాతీయ రహదారి 1 లో ఉంది. శరద్ చౌహాన్ ప్రస్తుతం నరేలా నియోజకవర్గం శాసనసభ సభ్యుడుగా కొనసాగుచున్నాడు.
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం అలీపూర్ మొత్తం జనాభా 16,623. అఁదులో పురుషులు 58% మంది ఉండగా, స్త్రీలు 42% మంది ఉన్నారు. దీని సగటు అక్షరాస్యత రేటు 68%,ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత రేటు 63% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 37% ఉంది. పట్టణ జనాభాలో 15% మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారు ఉన్నారు. ఢిల్లీలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే భారతదేశం నలుమూలల నుండి అనేక మంది వలసదారులకు అలీపూర్ నివాసంగా ఉంది.ఇది గత దశాబ్దంలో జనాభా పెరుగుదలకు దారితీసింది. ,[1]
అలీపూర్ ప్రాంత పరిధిలో వివిధ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయం, ఇతర సంస్థలతో కూడిన అనేక రకాల విద్యలను కలిగి ఉంది.
స్వామి శారదానంద్ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం
ఎఐఐపిపిహెచ్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం, ఢిల్లీ
స్వామి శ్రద్ధానంద కళాశాల
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.