From Wikipedia, the free encyclopedia
అర్ధ శతాబ్దం, ప్రేమ కోసం జరిగే పోరాటంతో పాటు రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన తెలుగు సినిమా.[1][2] ఈ సినిమా ట్రైలర్ ను 2021 జూన్ 2 న హీరో నాని విడుదల చేశాడు.[3] ఈ సినిమాలోని "ఏ కన్నులు చూడనీ" పాటను ఫిబ్రవరి 12న, "మెరిసేలే మెరిసేలే మిలమిల" పాటను 2021 జూన్ 5 న విడుదల చేశారు.[4] సినిమా 2021 జూన్ 11 న ఆహాపై విడుదలయ్యింది.[5]
అర్ధ శతాబ్దం | |
---|---|
దర్శకత్వం | రవీంద్ర పుల్లే |
రచన | రవీంద్ర పుల్లే |
నిర్మాత | చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ |
తారాగణం | కార్తీక్ రత్నం నవీన్ చంద్ర సాయి కుమార్ కృష్ణ ప్రియ సుహాస్ పవిత్ర లోకేష్ |
ఛాయాగ్రహణం | వెంకట్ ఆర్. శాఖమూరి, అష్కర్, ఇ.జె వేణు |
కూర్పు | జె. ప్రతాప్ కుమార్ |
సంగీతం | నోఫెల్ రాజ |
నిర్మాణ సంస్థలు | రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ |
విడుదల తేదీ | 2021 జూన్ 11 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కృష్ణ (కార్తీక్ రత్నం) చదువు పూర్తి చేసి, ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తుంటాడు.ఎప్పటికైనా దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ రామన్న(సాయికుమార్) కూతురు చిన్నప్పటి నుంచి తనతో పాటు చదువుకున్న పుష్ప(కృష్ణ ప్రియ)ను ప్రేమిస్తుంటాడు. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. అదే టైంలో 15 రోజుల్లో తనకి దుబాయ్ వెళ్లే అవకాశం వస్తుంది. దాంతో తను వెళ్లే లోపు తన ప్రేమని చెప్పాలనుకుంటాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని ఊర్లో గొడవలకు దారి తీస్తుంది. ఆ తప్పు వలన వారికే తెలియకుండా ఊరిలో కుల గొడవలు చెలరేగి ఒకరిని ఒకరు చంపేసుకుంటుంటారు. అసలు కృష్ణ చేసిన పని ఏంటి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏమిటి ? అనేదే మిగతా సినిమా కథ.[6][7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.