Remove ads
తమిళనాడు లో ఉన్న పుణ్యక్షేత్రం From Wikipedia, the free encyclopedia
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక.[1] అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అరుణాచలేశ్వర స్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 12°13′53.76″N 79°4′1.92″E |
పేరు | |
ప్రధాన పేరు : | అరుణాచలేశ్వర స్వామి దేవస్థానం |
సంస్కృతం: | అరుణాచలేశ్వరుడు |
తమిళం: | అరుల్మిగు అన్నామలైయర్ తిరుకోయిల్ |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | తిరువణ్ణామలై |
స్థానికం: | అరుణాచలం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | అరుణాచలేశ్వర స్వామి (పంచభూత లింగాలలో అగ్నిలింగం) (స్థానికం-అన్నామలైయర్) (శివుడు) |
ప్రధాన దేవత: | అపిత కుచళాంబికా అమ్మవారు (స్థానికంగా - ఉన్నామలై అమ్మన్) (ఉమాదేవి అయిన పార్వతి) |
పుష్కరిణి: | అగ్ని తీర్థం, బ్రహ్మ తీర్థం |
ముఖ్య_ఉత్సవాలు: | కార్తీక దీపం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రావిడ నిర్మాణశైలి |
ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది
గిరి ప్రదక్షణం చేసేటప్పుడు తిస్కోవాల్సిన జాగ్రత్తలు
అరుణాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు. ఇవి మొత్తం 89 నామాలు.
శ్రోణాద్రీశుడు | నిరంజనుడు | విమలుడు |
అరుణాద్రీశుడు | జగన్నాధుడు | నాగభూషణుడు |
దేవాధీశుడు | మహాదేవుడు | అరుణుడు |
జనప్రియుడు | త్రినేత్రుడు | బహురూపుడు |
ప్రసన్న రక్షకుడు | త్రిపురాంతకుడు | విరూపాక్షుడు |
ధీరుడు | భక్తాపరాధ సోడూడు | అక్షరాకృతి |
శివుడు | యోగీశుడు | అనాది |
సేవకవర్ధకుడు | భోగ నాయకుడు | అంతరహితుడు |
అక్షిప్రేయామృతేశానుడు | బాలమూర్తి | శివకాముడు |
స్త్రీపుంభావప్రదాయకుడు | క్షమామూర్తి | స్వయంప్రభువు |
భక్త విఘ్నప్తి సంధాత | ధర్మ రక్షకుడు | సచ్చిదానంద రూపుడు |
దీన బంధ విమోచకుడు | వృషధ్వజుడు | సర్వాత్మ |
ముఖ రాంఘ్రింపతి | హరుడు | జీవధారకుడు |
శ్రీమంతుడు | గిరీశ్వరుడు | స్త్రీసంగవామసుభగుడు |
మృడుడు | భర్గుడు | విధి |
ఆషుతోషుడు | చంద్రశేఖరావతంసకుడు | విహిత సుందరుడు |
మృగమదేశ్వరుడు | స్మరాంతకుడు | జ్ఞానప్రదుడు |
భక్తప్రేక్షణ కృత్ | అంధకరిపుడు | ముక్తి ధాత |
సాక్షి | సిద్ధరాజు | భక్తవాంఛితదాయకుడు |
భక్తదోష నివర్తకుడు | దిగంబరుడు | ఆశ్చర్యవైభవుడు |
జ్ఞానసంబంధనాధుడు | ఆరామప్రియుడు | కామీ |
శ్రీ హాలాహల సుందరుడు | ఈశానుడు | నిరవద్యుడు |
ఆహవైశ్వర్య దాత | భస్మ రుద్రాక్ష లాంచనుడు | నిధిప్రదుడు |
స్మర్త్యసర్వా ఘనాశకుడు | శ్రీపతి | శూలి |
వ్యత్యాస్తన్రు త్యద్ధ్వజధృక్ | శంకరుడు | పశుపతి |
సకాంతి | స్రష్ట | శంభుడు |
నటనేశ్వరుడు | సర్వవిఘ్నేశ్వరుడు | స్వాయంభువుడు |
సామప్రియుడు | అనఘుడు | గిరీశుడు |
కలిధ్వంసి | గంగాధరుడు | మృడుడు |
వేదమూర్తి | క్రతుధ్వంసి | |
రమణాశ్రమం అరుణాచలేశ్వరాలాయనికి 2 కి.మీ. దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ స్థానికులకంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి . నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి (ఆవు) సమాధి, కాకి సమాధి, శునకం సమాధిని కూడా చూడవచ్చు . ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలాయంలో రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది. ఇక్కడా ఉండటానికి వసతి గదులు ఉన్నాయి. వీటిని ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.