అమ్మకపు పన్ను
From Wikipedia, the free encyclopedia
వస్తువుల అమ్మకాలపై విధించే పన్ను అమ్మకపు పన్ను (Sales Tax). రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదాయవనరులలో ఈ పన్ను ఒకటి. ఈ పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. 1939లో మద్రాసు రాష్ట్రం మొదటిసారిగా సాధారణ అమ్మకపు పన్నును విధించింది. మద్యపాన నిషేధం వల్ల వచ్చే నష్టాన్ని భరించేందుకు ఈ పన్నును ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించింది. నేడు అమ్మకపు పన్నును విధించని రాష్ట్రం లేదు. హైదరాబాదు ప్రాంతంలో తొలిసారిగా 1950లో అమ్మకపు పన్నును విధించడం జర్గింది.

భారత రాజ్యాంగం ప్రకారము వార్తా పత్రికలు మినహ మిగితా అన్ని వస్తువుల అమ్మకం, కొనుగోళ్ళపై అమ్మకపు పన్నును విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అమ్మకపు పన్నును విధించే పద్ధతులు ప్రధానంగా రెండు రకాలు. మొదటి పద్ధతి ప్రకారం వస్తువు ఉత్పత్తి అయిన దశ నుంచి వినియోగదారుడికి చేరే వరకు ఒకే సారి పన్ను విధిస్తారు. రెండో పద్ధతి ప్రకారము ఉత్పత్తి దశ నుంచి టోకు వర్తకుడికి చేరిన తర్వాత ఒకసారి, టోకు వర్తకుడి నుంచి చిన్న వర్తకులకు చేరే వరకు ఉన్న దశలలోనూ, చివరగ వీయోగదారుడికి అమ్మే వర్తకుడిపై ఈ విధంగా అన్ని దశలలో అమ్మకపు పన్ను విధించబడుతుంది. ఈ పద్ధతినే కొద్ది మార్పుతో ప్రస్తుతం మన రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను లేదా వాట్ (vAlue Added Tax- VAT) గా పిలుస్తున్నారు.
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.