అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.[1][2] శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటును తగ్గించడం లక్ష్యంగా 2017లో ప్రారంభించబడిన ఈ పథకం ద్వారా 2022 జనవరి 17 నాటికి కెసీఆర్ కిట్స్ పథకం ద్వారా లబ్ధి పొందిన గృహిణుల సంఖ్య 10 లక్షలు దాటింది.

త్వరిత వాస్తవాలు అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం, పథకం రకం ...
అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం
Thumb
పథకం రకంతల్లి, బిడ్డ సంరక్షణ
రాష్ట్రంతెలంగాణ
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరరావు
ప్రారంభం2 జూన్ 2017 (2017-06-02)
తెలంగాణ
బడ్జెట్రూ. 500 కోట్లు (సంవత్సరానికి)
స్థితిఅమలులోవున్నది
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
మూసివేయి

2016 సంవత్సరానికి ముంది 1000కి 28 మరణాలు,[3] 1 లక్ష[4] ప్రసవాలకు 65 మరణాలు ఉన్నాయి. ఆధార్ ఆధారిత మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రతి దశలోనూ గర్భస్థ మహిళలను ట్రాక్ చేయడానికి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు విధులు నిర్వర్తిస్తుంటారు.

ప్రారంభం

2017, జూన్ 2న హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిచబడింది.[5]

బడ్జెట్ వివరాలు

అమ్మఒడి

కేసీఆర్ కిట్ విజయవంతం కావడంతో 2018, జనవరి 18న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సేవ కోసం ప్రత్యేకంగా 102 కాల్ నంబర్ ఉపయోగించబడుతుంది. గర్భిణిలు ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్ళడంకోసం, ప్రసవానంతరం ఇంటికి చేరడంకోసం ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పేరుతో ప్రత్యేక వాహన సదుపాయాన్ని ఏర్పాటుచేసింది. 102 నంబరుకు ఫోన్‌ చేస్తే ప్రత్యేక సదుపాయాలు ఉన్న వాహనం గర్భిణీ ఇంటిముందుకు వస్తుంది.

2017-18లో మొదట 200 వాహనాలతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. గర్భం దాల్చిన 3 నెలల నుంచి ప్రసవం అయ్యే వరకు చెకప్‌లకు తీసుకెళ్ళడం, తిరిగి తీసుకురావటం, డెలివరీ అయ్యాక తల్లీబిడ్డను ఇంటికి చేరవేయడం, చిన్నారులను టీకాలు వేయడానికి తీసుకురావడం వంటి కార్యక్రమాలు 102 వాహనం ద్వారా నిర్వహిస్తారు. ఈ పథకానికి రూ. 561 కోట్లు కేటాయించారు.[8] 2023 నాటికి 300 వాహనాలు ఉండగా, రోజుకు సగటున 3,792 మంది చొప్పున 2023 జూన్ నాటికి 58,53,618 మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. పాత వాహనాల స్థానంలో 228 అమ్మ ఒడి వాహనాలను ప్రవేశపెట్టారు.[9]

కె.సి.ఆర్‌. కిట్‌

సురక్షితమైన ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులలో చేరేవారికి ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లు అందిస్తుంది. గర్భం దాల్చిన నాటినుంచి ప్రసవం జరిగి శిశువుకు 10 నెలల వయసు వచ్చేంతవరకూ నాలుగు విడతలలో అనగా గర్భం దాల్చిన ఐదు నెలలలోపు డాక్టరు పరీక్ష అనంతరం రూ. 3000, ప్రసవ సమయంలో ఆడ శిశువుకు రూ. 5000, లేదా మగ శిశువుకు రూ. 4000, శిశువుకు వ్యాధినిరోధక టీకాలు 14 వారాల వయసులో రూ. 3000, 10 నెలల వయసులో రు. 2000 చొప్పుననాలుగు విడతలలో రూ. 12,000 రూపాయలను అందిచడంతోపాటు, ఆడిపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా రాష్ట్రంలోని గర్భిణీ స్త్రీల వ్యక్తిగత ఆధార్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ రూపంలో డబ్బు పంపబడుతుంది.[10] ప్రసవం తర్వాత రెండు వేల రూపాయల విలువచేసే 16 రకాల వస్తువులు (బిడ్డకు అవసరమైన సబ్బులు, నూనె, పౌడర్‌, దోమతెర, చిన్నబెడ్‌, రెండు బేబీ డ్రెస్‌లు, తల్లికి రెండు చీరలు, టవళ్ళు) ఉండే కేసీఆర్‌ కిట్‌ను కూడా ఇస్తుంది.

10లక్షల కిట్స్ అందజేత

2022 జనవరి 17 నాటికి కెసీఆర్ కిట్స్ పథకం ద్వారా లబ్ధి పొందిన గృహిణుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆర్థికసాయం అందించడంతోపాటు సామాజికంగా అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు పెరిగడంతోపాటు మాతా శిశు మరణాలకు అడ్డుకట్టపడింది. ప్రైవేట్‌కు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకోవడంతో ఒక్కొక్కరికి సగటున రూ. 40 వేల దాకా ఆదా అవుతోంది. ఈ పథకం ద్వారా ప్రతిఏటా 2 లక్షలమందికి సాయం అందిస్తుండగా, ఈ ఐదేళ్ళకాలంలో 1,700 కోట్ల రూపాయల కిట్లు అందజేయబడ్డాయి. గర్భిణుల కుటుంబాలకు దాదాపు రూ. 4,500 కోట్లు ఆదా అయింది. ఇప్పటివరకు కిట్ల రూపంలో ప్రభుత్వం తరఫున రూ. 263 కోట్లు విలువైన వస్తువులను అందించడం జరిగింది.[11]

మరింత సమాచారం ఆర్థిక సంవత్సరం, పంపిణీ చేసిన కేసీఆర్ కిట్లు ...
ఆర్థిక సంవత్సరం పంపిణీ చేసిన కేసీఆర్ కిట్లు
2017-18 2,02,142
2018-19 2,43,095
2019-20 2,23,720
2020-21 2,14,603
2021-22

(జనవరి 17 నాటికి)

1,96,519
మొత్తం 10,80,079
మూసివేయి

వాహనాల ప్రారంభం

అత్యవసర సేవలు అందించేందుకు రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటుచేసిన 466 (108 అంబులెన్సులు 204, అమ్మఒడి వాహనాలు 228, ఇతర వాహనాలు 34) అధునాతన వాహనాలను హైదరాబాదు నెక్లెస్ రోడ్డులోని ప్లాజాలో 2023 ఆగస్టు 1న జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావులతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[12][13]

గతంలో ఉన్న 426 అంబులెన్స్‌లలో 175 అంబులెన్సుల స్థానంలో కొత్తవి రిప్లేస్‌ చేయగా, అదనంగా మరో 29 అంబులెన్సులను ఏర్పాటుచేసశారు. కొత్తగా వచ్చిన 204 వాహనాలను కలిపితే రాష్ట్రంలో 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెరిగాయి.

గర్భిణుల కోసం 300 అమ్మఒడి (102) వాహనాలు ఉండగా, వాటిలో 228 వాహనాల స్థానంలో 228 కొత్త వాహనాలను రీప్లేస్‌ చేశారు. చూడటానికి ఆహ్లాదంగా ఉండే రంగుల్లో, అమ్మఒడి కార్యక్రమ లోగో, శిశువు ఫొటోలతో 102 వాహనాలు కొత్తలుక్‌ తో ఉన్నాయి. ఈ వాహనాల వెనుకభాగంలో అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో అనే ట్యాగ్‌లైన్‌తోపాటు, సీఎం కేసీఆర్‌ ఓ బాలింతకు కేసీఆర్‌ కిట్‌ అందిస్తున్న ఫొటో ముద్రించబడింది.[14]

విమర్శలు

2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తమ ప్రభుత్వం అమలుచేసిన కెసిఆర్ కిట్ పథకాన్ని ఒకానొక విజయంగా చెప్పుకుంటూండగా, ప్రతిపక్షాలు కెసిఆర్ కిట్ కేవలం ఒకానొక సంక్షేమ పథకం అనీ, సాధారణంగా ప్రతీ ప్రభుత్వాలు ఈ సంక్షేమ పథకాలు అమలుచేస్తాయని దీన్నొక గొప్పగా చూపించుకోవడం తగదని విమర్శించాయి.[15]

మానోపాడు మండలంలోని ప్రభుత్వాసుపత్రిలో మోసపూరిత ప్రసవాలు జరిగినట్లు ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన విచారణలో తేలింది.[16] ప్రభుత్వం కేటాయించిన నిధుల కోసం ప్రయివేటు ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాలను, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలుగా నమోదు చేశారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.