అమేఠీ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

అమేఠీ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అమేఠీ జిల్లా ఒకటి. గౌరీగంజ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. అమేఠీ జిల్లా ఫైజాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 3,070 చ.కి.మీ.

Thumb
గౌరీగంజ్ దృశ్యం
త్వరిత వాస్తవాలు అమేఠీ జిల్లా, దేశం ...
అమేఠీ జిల్లా
Thumb
ఉత్తర ప్రదేశ్ పటంలో అమేఠీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఫైజాబాద్
ముఖ్య పట్టణంగౌరీగంజ్
మండలాలు4
Government
  శాసనసభ నియోజకవర్గాలు5
విస్తీర్ణం
  మొత్తం3,063 కి.మీ2 (1,183 చ. మై)
Websiteఅధికారిక జాలస్థలి
మూసివేయి

1980 నుండి అమేఠీ నియోజజవర్గం నెహ్రూ - గాంధీ కుటుంబ స్థానంగా ఉంటూ వచ్చింది. గత ప్రధానమమంత్రి (భారతదేశ మొదటి ప్రధాని) నెహ్రూ, ఆయన మనుమలు సంజయ్ గాంధి, రాజీవ్ గాంధి, సోనియా గాంధి, రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు పోటీ చేసారు.

చరిత్ర

2010 జూలై 1 న సుల్తాన్‌పూర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి, ఉత్తరప్రదేశ్‌లో 72వ జిల్లాగా అమేఠీ జిల్లాను ఏర్పరచారు. సుల్తాన్‌పూర్ జిల్లాలోని అమేఠీ, గౌరిగంజ్, ముసాఫిర్‌ఖానా, మునుపటి రాయ్‌బరేలి జిల్లా నుండి రెండు తాలూకాలను (సలోన్, తిలోయి) కలిపి ఈ జిల్లా రూపొందించారు. గతంలో జిల్లా పేరు ఛత్రపతి షాహూజీ మహరాజ్ నగర్ జిల్లా అని ఉండేది. తరువాత దానిని తిరిగి అమేఠీ అని మార్చారు.

చరిత్ర

జిల్లా ఆగ్నేయ సరిహద్దులో సుల్తాన్‌పూర్ జిల్లా ఉంది. దీనిని రాజ్‌పూర్ - అమేఠీ అంటారు. రాజ్‌పూర్ అమేఠీ రాజా నివసించిన ప్రాంతం. అమేఠీ రాజా ప్రస్తుతం రామ్‌నగర్ వద్ద నివసుస్తున్నాడు. ఆయన పూర్వీకులు రాజ్‌పూర్ - ఫూల్‌వారి వద్ద నివసించారు. ఇక్కడ బాచ్‌కోటి రాజులు నిర్మించిన కోటలో నివసించారు. ఇక్కడ 100 సంవత్సరాల పూర్వం నిర్మించిన హనుమాన్‌గర్ ఆలయం, మసీదు ఉన్నాయి. రామ్‌నగర్ కోటకు 3 కి.మీ దూరంలో ప్రఖ్యాత కవి సన్యాసి "మాలిక్ ముహమ్మద్ జాయసీ" సమాధి ఉంది.[1]

సరిహద్దులు

జిల్లా 26°9’ ఉత్తర అక్షాంశం, 81°49’ తూర్పు రేఖాంశంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 101 మీ ఎత్తున ఉంది. జిల్లా వైశాల్యం 3063. జిల్లా భూభాగం సాధారణంగా చదరంగా ఉంటుంది. పొరుగున ఉన్న నదీలోయలతో అక్కడక్కడా విభజించబడుతూ ఉంటుంది. జిల్లా మధ్యభాగం నుండి గోమతీ నది ప్రవహిస్తుంది. ఉత్తరాన ఫైజాబాద్, దక్షిణాన ప్రతాప్‌గఢ్, పశ్చిమాన బారాబంకీ, రాయ్‌బరేలి జిల్లాలు అమేఠీ జిల్లాకు సరిహద్దులుగా ఉన్నాయి.

భౌగోళికం

అమేఠీ జిల్లా సాధారణంగా చదరంగా ఉంటుంది. జిల్లా అంతటా గోమతీ నది ప్రవహిస్తుంది. ఇది వ్యవసాయ భూమిగా వర్గీకరింవబడింది.

మరింత సమాచారం విషయం, వివరణ ...
విషయం వివరణ
వాతావరణం తడి- పొడి మిశ్రితం
గరిష్ఠ ఉష్ణోగ్రత 28 ;° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 23 ;° సెల్షియస్
వేసవి మార్చి - మే
వేసవి ఉష్ణోగ్రత 36° సెల్షియస్- 44° సెల్షియస్
వర్షాకాలం జూన్ - సెప్టెంబరు
శీతాకాలం నవంబరు - ఫిబ్రవరి
శీతాకాలం ఉష్ణోగ్రత 22 ° సెల్షియస్- 8 ° సెల్షియస్
వార్షిక కనిష్ఠ ఉష్ణోగ్రత 2° సెల్షియస్-3 ° సెల్షియస్
మూసివేయి

గణాంకాలు

2013లో గణాంకాల ప్రకారం అమేఠీ జిల్లా జనసంఖ్య 1,500,000.[2]

ప్రయాణ సౌకర్యాలు

అమేఠీ జిల్లా ఉత్తర ప్రదేశ్, భారతీయ ప్రధాననగరాలతో రహదారి, రైలు మార్గాలతో చక్కగా అనుసంధానించబడింది. జిల్లా నుండి ప్రధానంగా ఢిల్లీ, లక్నో, కాన్పూర్, డెహ్రాడూన్, హరిద్వార్, అలహాబాద్, వారణాసి, కోలకతా, పూరీ, భోపాల్, ముంబై, బెంగుళూర్ వంటి నగరాలకు రైలు వసతి ఉంది. అమేఠీ నుండి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన బస్సులు ప్రధాన నగరాలకు నడుస్తున్నాయి.[3]

విద్య

జిల్లాలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి.

  • రాజర్షి రణంజయ్ సిన్హ్ గ్రూప్,
  • ప్రధాన విద్యా సంస్థలు:-
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్
  • మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ రాజర్షి రణంజయ్ సిన్హ్ ఇన్స్టిట్యూట్
  • ఫార్మసి రాజర్షి రణంజయ్ సిన్హ్ కాలేజ్,
  • రాజర్షి రణ్ంజయ్ రణంజయ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్.
  • ప్రాథమిక పాఠశాలలు 1,431
  • గవర్నమెంటు ఉప్పర్ ప్రైమరీ స్కూల్స్ 433
  • గవర్నమెంటు ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్స్ 33
  • మదరసాలు 42
  • ఇంటర్ మీడియట్ స్కూల్స్ 15
  • గవర్నమెంటు ఇంటర్ కాలేజ్ 1

ఆర్ధికం

జిల్లాలో హిందూస్థాన్ ఎయిరోనాటిక్ లిమిటెడ్ అవియోనిక్స్ విభాగం ఉంది. ఈ సంస్థ భారతీయ సైనిక విమానాల తయారీ బాధ్యత వహిస్తుంది. జిల్లాలో " ఇండో గల్ఫ్ ఫర్టిలైజర్ " శాఖ ఒకటి ఉంది.

సమస్యలు

2014లో పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికలలో అమేఠీ నియోజకవర్గానికి విశేష ప్రచారం లభించింది. అలాగే నియోజక వర్గం అభివృద్ధి పనుల గురించి విశేషంగా ప్రచారంలోకి వచ్చింది. [4] రహదార్ల పరిస్థితి.[5] నిరుద్యోగం, మైళికవసతుల లోపం.[6]

విభాగాలు

  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి: గౌరిగంజ్, అమేథి ముసఫిర్ఖాన, సలోన్, తిలోయి.
  • జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి
  • జిల్లాలో 17 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి
  • జిల్లాలో 401 లోక్‌పాల్ ప్రాంతాలు ఉన్నాయి[7]
  • జిల్లాలో పెద్ద నగరం అమేఠీ
  • జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: గౌరిగంజ్, అమేథి, జగదీష్‌పూర్, సలోన్
  • జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గం అమేఠీ[7]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.