అమీర్‌పేట్, హైదరాబాద్

From Wikipedia, the free encyclopedia

అమీర్‌పేట్, హైదరాబాద్map

అమీర్‌పేట్, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా,అమీర్‌పేట మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.[1]

  ?అమీర్‌పేట్
హైదరాబాద్  తెలంగాణ  భారతదేశం
అమీర్‌పేట మెట్రో స్టేషను
అమీర్‌పేట మెట్రో స్టేషను
అమీర్‌పేట మెట్రో స్టేషను
అక్షాంశరేఖాంశాలు: 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) హైదరాబాద్ జిల్లా
లోక్‌సభ నియోజకవర్గం సికింద్రాబాద్
శాసనసభ నియోజకవర్గం సనత్‌నగర్
కోడులు
పిన్‌కోడ్

• 500016

ఇది హైదరాబాద్ నగరంలోని ఉత్తర పశ్చిమ భాగంలోని ఒక రద్దీ వాణిజ్య ప్రాంతం. కంప్యూటరు శిక్షణా సంస్థలకు ముఖ్య కేంద్రం.90వ దశాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతం ఎక్కువగా ఖాళీ ప్లాట్లతో బొంబాయి రహదారి యన్.హెచ్.9 ట్రాఫిక్ తో ఉండేది. నగరంలో ముఖ్య ప్రాంతాలలో జరిగిన నిర్మాణ చర్యల కారణంగా హైదరాబాద్ ఉత్తర శివారు విస్తరణ జరిగింది. దాంతో 1990 లో వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడకు మారాయి. నేడు ఈ ప్రాంతం అధికంగా పాదాచారులతతో, వాహన ట్రాఫిక్తో పాటు అనేక వ్యాపార సంస్థలతో నిండిన సందడి ప్రాంతం. ఈ ప్రాంతంలో రద్దీ గంటల సమయంలో తరచుగా ట్రాఫిక్ జామ్ సంభవిస్తుంటాయి. పాదచారుల వంతెన, శాశ్వతంగా ఏర్పాటు చేసిన రోడ్ డివైడర్ల కారణంగా ట్రాఫిక్ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది.అమీర్‌పేట కూడలి గ్రీన్ ల్యాండ్, బేగంపేటలను అనుసంధానిస్తూ జాతీయ రహదారి యన్.హెచ్.9 ఉంటుంది. అమీర్‌పేట యన్.హెచ్.9 జాతీయ రహదారిలో పంజాగుట్ట, సంజీవరెడ్డినగర్ ప్రాంతాల మధ్య ఉంటుంది.

ఇక్కడ అమీర్‌పేట మెట్రో స్టేషను ఉంది.

గ్యాలరీ

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.