From Wikipedia, the free encyclopedia
అమీబియాసిస్ వ్యాధి ఎంటమీబా హిస్టోలిటికా అనే ప్రోటోజోవా పరాన్న జీవి వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలో ప్రవేశిస్తుంది. పేగులో కోశీయ దశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడి చేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరీ అనికూడా పిలుస్తారు. సరైన ఔషధంతో అమీబియాసిస్ ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం, వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరచుకోవడం, కూరగాయలను, పండ్లను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చేయవచ్చు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అమీబియాసిస్ | |
---|---|
ప్రత్యేకత | Infectious diseases |
ఈ వ్యాధిని మొదటిసారిగా ఫెడర్ ఎ. లోష్ 1875 లో ఉత్తర రష్యాలో కనుగొన్నాడు.[1] 1933 లో షికాగో ప్రపంచ సంతలో తాగునీరు కలుషితం కావడం వల్ల చాలామంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. వెయ్యి మందికి పైగా ఈ వ్యాధి సోకగా 98 మంది మరణించారు.[2][3]
ఇది సోకిన వారిలో 90 శాతం వరకు ఎటువంటి లక్షణాలు బయటికి కనిపించవు. కానీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 వేల నుంచి లక్షమంది వరకు ఈ వ్యాధి సోకి మరణిస్తున్నారని ఒక అంచనా. ఈ వ్యాధికి చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. లక్షణాలు బయట పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల దాకా పట్టవచ్చు. సాధారణంగా 2 నుంచి 4 వారాలు పడుతుంది. విరేచనాలు, ఒక్కోసారి రక్తంతో కూడుకున్నది, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి దీని ప్రధాన లక్షణాలు.
ఈ వ్యాధి నివారణకు ఇంటి చిట్కాలు కొన్ని పాటించాలి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.