భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థికవేత్త From Wikipedia, the free encyclopedia
అమర్త్య కుమార్ సేన్ (జ. 1933 నవంబరు 3, శాంతినికేతన్, భారతదేశం) భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. 1998లో కరువు, మానవ అభివృద్ధి సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం, పేదరికానికి కారణములు, ఉదారవాద రాజకీయాలలో చేసిన విశేష కృషికి 1998లో నోబెల్ బహుమతి లభించింది. సంక్షేమ రంగంలో విశేష కృషి సల్పినందుకు 1999లో భారతరత్న పురస్కారంతో ఆయనను భారత ప్రభుత్వం సత్కరించింది.
![]() | |
---|---|
![]() | |
జననం | శాంతినికేతన్, భారతదేశము | నవంబరు 3, 1933
నివాసం | USA |
జాతీయత | భారత దేశము |
రంగములు | అర్థశాస్త్రము |
వృత్తిసంస్థలు | హార్వర్డ్ యూనివర్శిటీ(2004 - ) ట్రినిటీ కాలేజి, కేంబ్రిడ్జి(1998-2004) ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయము (1977-88) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (1971-77) ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(1963-71) ట్రినిటీ కళాశాల, కేంబ్రిడ్జి(1957-63) జాదవ్ పూర్ యూనివర్శిటీ(1956-58) |
చదువుకున్న సంస్థలు | ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి (పి.హెచ్.డి) (బి. ఎ) ప్రెసిడెన్సీ కాలీజీ, కోల్‌కత (బి. ఎ) |
ప్రసిద్ధి | సంక్షేమ ఆర్థికశాస్త్రం మానవాభివృద్ధి సిద్ధాంతం |
ముఖ్యమైన పురస్కారాలు | ![]() ![]() |
1933 నవంబరు 3న బెంగాల్‌లోని శాంతినికేతన్ లో జన్మించిన అమర్త్య సేన్ 1941లో ఉన్నత పాఠశాల విద్య ఢాకాలో పూర్తిచేసుకొన్నాడు. 1947లో దేశవిభజన తర్వాత భారతదేశానికి తిరిగివచ్చి విశ్వభారతి, ప్రెసిడెన్సీ కళాశాలలలో అభ్యసించాడు. కేంబ్రిడ్జిలోని ట్రినిటి కళాశాల నుండి 1956లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నాడు. 1959లో పి.హెచ్.డి పట్టా పుచ్చుకున్నాడు.
సేన్ మాతామహుడు క్షితిమోహన్ సేన్ మధ్యయుగ చరిత్రలో పండితుడు. అతను రవీంద్రనాథ్ టాగూర్ కు సన్నిహితుడు. సేన్ తల్లి అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రము బోధించేవాడు. సేన్ మొదటి భార్య నవనీతదేవ్ సేన్, అరాధించబడిన రచయత, పండితురాలు. ఆమెతో సేన్ కూ ఇద్దరు పిల్లలున్నారు. అంతర సేన్, నందనా సేన్. ప్రస్తుతం అంతరా సేన్ పత్రికా విలేఖరి. తన భర్త ప్రతీక్ కంజీలాల్ తో కలిపి లిటిల్ మ్యాగజీన్ను ప్రచురిస్తున్నారు. నందనా సేన్ బాలీవుడ్ నటీమణి. అమార్త్య నవనీతలు 1971లో లండన్కు వెళ్ళగానే భేదాలు వచ్చి విడాకులు పుచ్చుకున్నారు.
సేన్ రెండవ భార్య ఇవా కలోర్ని. వీరి కాపురము 1973 నుండి 1985లో ఆమె జీర్ణ సంబంధమైన క్యాన్సర్ తో చనిపోయేంత వరకు నడిచింది. సేన్ ప్రస్తుత భార్య ఎమ్మా జార్జీనా రోత్ షీల్డ్, ఒక ఆర్థిక చరిత్రకారురాలు. ఈమెతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంద్రాణీ, కబీర్. ఇంద్రాణీ న్యూయార్క్లో విలేఖరి. కబీర్ బోస్టన్ లో మ్యూజిక్ టీచరు.
1960లో నవనీత దేవి అనే బెంగాలీ కవయిత్రిని వివాహం చేసుకున్నాడు. వారికి అంతర, నందన అనే పిల్లలు కూడా కలిగినారు. 1971లో వారు లండన్ వెళ్ళిన తర్వాత వివాహబంధం తెగిపోయింది. నవనీతకు విడాకులిచ్చి ఎవా కొలోర్నీ అనే పాశ్చాత్య మహిళను 1973లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇంద్రాణి, కబీర్ అనే ఇద్దరు పిల్లలు. 1985లో క్యాన్సర్ వ్యాధితో రెండో భార్య చనిపోయింది. అతని ప్రస్తుత భార్య కేంబ్రిడ్జి కింగ్స్ కళాశాలలో పనిచేస్తున్న ఎమ్మా జార్జినా రాత్స్‌చైల్డ్.
పి.హెచ్.డి పూర్తికాగానే కోల్‌కత విశ్వవిద్యాలయంలోనూ, ఢిల్లీలోనిజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలోనూ, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ అర్థశాస్త్ర ఉపన్యాసకుడిగా పనిచేశాడు.
సంక్షేమం వైపు, పేదరికం, నిరుద్యోగం వైపు అమర్త్యా సేన్ కృషి అమోఘమైనది. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు కనీస అవసరాలు ఎలాగో ప్రజాస్వామిక హక్కులు కూడా అంతే ముఖ్యమని ఉద్ఘాటించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ రక్షణ బడ్జెట్ ను తగ్గించాలని హితవు పల్కినాడు. పేదరిక స్థాయిని నిర్థారించడానికి అమర్త్యా సేన్ సోషల్ ఛాయిస్ అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టాడు. పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోవడంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే ప్రధాన కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించాడు. ప్రాథమిక విద్య, ఆరోగ్యం ఏ దేశ అభివృద్ధిలోనైనా కీలక పాత్ర వహిస్తాయని ఉద్ఘాటించాడు. నీతిశాస్త్రం, తత్వశాస్త్రాల వెలుగులో అభివృద్ధి అర్థశాస్త్రానికి కొత్త రూపం చేర్చాడు. 1943 బెంగాల్ కరువు సంభవించినప్పుడు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన విచారణ సంఘం సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుండి ధాన్యం దిగుబడి కాకపోవడం వంటి కారణాలను చూపించగా, అమర్త్యసేన్ దానికి పూర్తిగా విరుద్ధమైన కారణాలను అర్థశాస్త్ర పరంగా విశ్లేషించి సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్త రూపం ఇచ్చాడు.
అమర్త్యసేన్ రచనల్లో కొన్ని:
1. The argumentative indian : writings on Indian history,culture and identity
2. Development as freedom
3. Identity and violence: the illusion of destiny (issues of our time)
4. Inequality re-examined
5. On Ethics and economics
6. Poverty and Famines: an essay on entitlement and deprivation
7. Rationality and freedom
8. Commodities and capabilities
9. Hinduism (మాతామహులు క్షితి మోహన్ సేన్ తో కలిసి)
Seamless Wikipedia browsing. On steroids.