From Wikipedia, the free encyclopedia
అబ్దుల్ హఫీజ్ కర్దార్ (1925 జనవరి 17 - 1996 ఏప్రిల్ 21) పాకిస్తాన్ క్రికెటరు, రాజకీయవేత్త, దౌత్యవేత్త. అతను పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మొదటి కెప్టెన్. అతను భారతదేశం, పాకిస్తాన్ జట్లు రెండింటి తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన ముగ్గురు ఆటగాళ్ళలో ఒకడు.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అబ్దుల్ హఫీజ్ కర్దార్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | [1] లాహోర్, బ్రిటిషు భారతదేశం | 1925 జనవరి 17 |||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1996 ఏప్రిల్ 21 71)[1] ఇస్లామాబాదు, పాకిస్తాన్ | (వయసు|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Slow left arm orthodox | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టులు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 29/7) | 1946 జూన్ 22 ఇండియా - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1958 మార్చి 26 పాకిస్తాన్ - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1943–1945 | Northern India | |||||||||||||||||||||||||||||||||||||||
1944 | Muslims | |||||||||||||||||||||||||||||||||||||||
1947–1949 | Oxford University | |||||||||||||||||||||||||||||||||||||||
1948–1950 | వార్విక్షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||
1953–1954 | Combined సర్వీసెస్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2008 డిసెంబరు 3 |
అతను పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యునిగా కూడా పనిచేశాడు. భుట్టో ప్రభుత్వంలో పంజాబ్ రాష్ట్ర ఆహార మంత్రిగా చేసాడు.
అతను వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ చైర్మన్ సిరిల్ హస్టిలో కుమార్తె హెలెన్ రోజ్మేరీ హస్టిలో అనే ఆంగ్ల మహిళను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత పాకిస్థానీ క్రికెటర్ జుల్ఫికర్ అహ్మద్ సోదరి షాజాదిని కూడా పెళ్ళి చేసుకున్నాడు.[3] అతనికి ఒక కొడుకు ఉన్నాడు - ఆర్థికవేత్త షాహిద్ హఫీజ్ కర్దార్.
అతను 1952 నుండి 1958 వరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడిన మొదటి 23 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. తరువాత దేశంలో ప్రముఖ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నాడు. అతన్ని పాకిస్తాన్ క్రికెట్‌కు పితామహుడిగా పరిగణిస్తారు. 1958లో పాకిస్తాన్ ప్రభుత్వం నుండి ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అవార్డును అందుకున్నాడు.[4][5]
కర్దార్ 1925లో పంజాబ్‌లోని లాహోర్‌లోని ఒక ప్రసిద్ధ కర్దార్ అరైన్ కుటుంబంలో జన్మించాడు.[6] ఇస్లామియా కాలేజీ, లాహోర్, యూనివర్సిటీ కాలేజ్, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నాడు. అతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఉత్తర భారతదేశం, ముస్లింలతో సహా పలు రకాల జట్లకు దేశీయ క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లలో భారత్ జట్టు తరఫున, స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్ జట్టు తరఫునా ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో అతను ఒకడు. 1952-53లో భారత పర్యటనలో తన మొదటి అధికారిక టెస్ట్ సిరీస్ ఆడిన జట్టుకు కర్దార్ నాయకత్వం వహించాడు. లాలా అమర్నాథ్ భారత జట్టుపై ఆడుతూ, పాకిస్తాన్ జట్టు ఢిల్లీ, బొంబాయిలలో ఓడిపోయింది. భారత జట్టు సిరీస్ గెలుచుకుంది. పాకిస్తాన్ జట్టు లక్నోలో జరిగిన రెండవ టెస్టులో విజయాన్ని సాధించింది.
అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలర్, ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 6,832 పరుగులు చేసాడు, 344 వికెట్లు తీసుకున్నాడు. అతని బ్యాటింగ్ సగటు 29.83, బౌలింగ్ సగటు 24.55. పాకిస్తాన్‌కు టెస్ట్ హోదా ఇవ్వడానికి ముందు సంవత్సరాలలో కర్దార్ 1948 నుండి 1952 వరకు పాకిస్తాన్ జట్టు కోసం ఆడాడు. కర్దార్ వార్విక్షైర్, పాకిస్తాన్ సర్వీసెస్ తరపున కూడా ఆడాడు.[7]
కర్దార్ ఆనాటి అన్ని టెస్ట్ ఆడే దేశాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రతి ఒక్కరిపై తన జట్టును విజయపథంలో నడిపించాడు. 1954లో ఓవల్‌లో ఇంగ్లండ్ పర్యటనలో సాధించిన సిరీస్-స్థాయి విజయం ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది. 1957లో కరాచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మొట్టమొదటి, ఏకైక టెస్ట్‌లో పాకిస్తాన్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 1954-55లో తన మొదటి పాకిస్తాన్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు ఆడిన మొత్తం ఐదు టెస్టులూ డ్రాగా ముగిసినప్పుడు ఆటగాళ్ల వైఖరిపై విమర్శలు వచ్చాయి. రాజకీయ ఉద్రిక్తతలు, స్వాతంత్ర్యం యొక్క రక్తపాత వారసత్వం కారణంగా భారత పాకిస్తాన్ ఆటగాళ్లు ఎవరికి వాళ్ళే ఓడిపోతామనే భయంతో, పోటీ క్రికెట్ ఆడలేఖపోయారు. అతని హయాంలో మొత్తం 23 టెస్టుల్లో పాకిస్థాన్ ఆరు గెలిచి, ఆరు ఓడిపోయి పదకొండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. అతని అధికార పదవుల్లో ఉండగా అతను, నియంతృత్వ ధోరణిలో ఉండేవాడూ. త్వరగా కోపం తెచ్చుకునేవాడు, ముఖ్యంగా విమర్శలపై. కానీ అతను దూరదృష్టి గలవాడు. తటస్థ అంపైర్లుండాలని వాదించేవాడు.[7] కర్దార్ 1958లో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[7]
కర్దార్ మహమ్మద్ అలీ జిన్నాకు బలమైన మద్దతుదారు. భారతదేశంలో ముస్లిం వైభవం పట్ల కట్టుబడి ఉన్నాడు. అబ్దుల్ హఫీజ్ కర్దార్ రాజకీయాల్లోకి వెళ్లి 1972 నుండి 1977 వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా పనిచేశాడు అతని పదవీకాలం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో ఆసియా, ఆఫ్రికన్ క్రికెట్ దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచడంలో ప్రముఖమైనది. 1977లో ఆటగాళ్లతో ఇబ్బందికరమైన వేతన వివాదం కారణంగా కర్దార్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అతను అనేక ధార్మిక, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పనిచేశాడు. 1996లో అతని స్వస్థలమైన లాహోర్‌లో మరణించడానికి ముందు, చివరి సంవత్సరాల్లో స్విట్జర్లాండ్‌లో పాకిస్తాన్ రాయబారిగా పనిచేసాడు. అతను 1970లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) టిక్కెట్‌పై పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీకి ఎన్నికై, ప్రావిన్షియల్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు.
2019 లో, అతని 94వ పుట్టినరోజు నాడు గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.[2]
2012లో, అతను దేశ క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గానూ, పాకిస్తాన్ దేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన సితార-ఎ-ఇమ్తియాజ్‌ను అందుకున్నాడు.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.