భారత పార్లమెంటు పై దాడి చేసి ఉరిశిక్షకు గురైన తీవ్రవాది From Wikipedia, the free encyclopedia
2001 డిసెంబరు 13న పార్లమెంట్ భవన సముదాయము లోకి ఐదుగురు తీవ్రవాదులు ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు. పార్లమెంటు భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు తీవ్రవాదుల్నీ హతమార్చారు. [1] ఈ దాడిలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి అజ్జల్ గురు. ఇతడు జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థకు చెందినవాడు. అతన్ని ఢిల్లీ పోలీసులు జమ్మూకాశ్మీర్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణానంతరం 2006 సెప్టెంబరు 26న అఫ్జల్‌ను ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశింది.
మొహమ్మద్ అఫ్జల్ గురు | |
---|---|
జననం. | 1969 near Sopore, Baramulla district, Jammu and Kashmir, India |
మరణం | 2013 ఫిబ్రవరి 09 (Age 43) Tihar Jail, Delhi, India |
కారణము | Executed by hanging |
స్థావరం | Tihar jail |
ప్రసిద్ధి | his conviction and execution in the 2001 Indian Parliament attack and his appeal in his capital punishment case. |
కార్యకలాపాలు | 2001 attack on the Parliament of India |
నేరాలు | Murder Conspiracy Waging war against India Possession of explosives |
జరిమానా | Death sentence |
నేరస్థాపన స్థితి | Executed by hanging at 8:00 am (IST ) on 9 February 2013[1] |
జీవిత భాగస్వామి | Tabasum Guru[2] |
తల్లిదండ్రులు | Habibullah (father)[2][3] and Ayesha Begum (mother)[2] |
2006 అక్టోబరు 3న అఫ్జల్ గురు సతీమణి తబాసుమ్ గురు రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు క్షమాభిక్ష పిటీషన్ పెట్టుకునారు. కానీ ఆ పిటిషన్ సుదీర్ఘ కాలం పెండింగులో వుండి పోయింది. దేశంలో ఈ విషయమై అనేక ఆందోళనలు, నిరసనల మద్య చివరకు 2013 ఫిబ్రవరి 3న భారత రాష్ట్రపతి అఫ్జల్ గురు మెర్సీ పిటీషన్‌ను తిరస్కరించారు. 2013 ఫిబ్రవరి 9న తీహార్ జైలులో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేసి జైలులోనే అంత్యక్రియలు పూర్తి చేశారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.