From Wikipedia, the free encyclopedia
అనూరాధా నక్షత్రము అధిపతి శని. ఇది దేవగణ నక్షత్రము. అధిదేవత సూర్యుడు. జంతువు జింక. రాశ్యధిపతి కుజుడు. ఈ నక్షత్రములో జన్మించిన వారు జలక్రీడలందు ఆసక్తులై ఉంటారు. నైతిక ధర్మము, పెద్దలు, వృద్ధుల పట్ల గౌరవము కలిగి ఉంటారు. అవసరాలకు తగినంత మాత్రమే ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జీవితములో స్థిరపడడానికి సమయము పడుతుంది. విద్యలలో రాణించడానికి కొంత సమయము కావాలి. ఆరంభములో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా తరువాత కాలములో నిరాటంకముగా విద్యలను అభ్యసిస్తారు. ఉద్యోగజీవితములో మొదట ఒడిదుడుకులను ఎదుర్కొన్నా తరువాత నిలదొక్కుకుని ముందుకు విజయవంతముగా సాగి పోతారు. ప్రేమవివాహాలు చేసుకుంటారు. గుర్తింపు పత్రాలు లేకున్నా కొన్ని విద్యలలో పురోగతి సాధిస్తారు. విద్యలపట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులు అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పముగా అయినా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కొరకు కొన్ని పదవులు చేపడతారు. కీలక సమయంలో బంధువర్గము నుండి నమ్మకద్రోహము ఎదురౌతుంది. తండ్రి పద్ధతులు నచ్చవు. తల్లి మీద విశేషమైన అనురాగము ఉంటుంది. సహోదర సహోదరీ వర్గము బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. యంత్రాలు, భూములు, గృహాలు, వాహనాలకు సంబంధించిన విదేశీయానము, దూరప్రాంత ఉద్యోగము, దూరప్రాంత విద్యా విధానము మీద ఆసక్తులై ఉంటారు. సలహాలు చెప్పి, మార్గాలు చూపి అనేక మంది పురోగతికి తోడ్పడతారు. ఆత్మీయులు ఎంత మంది ఉన్నా ఏకాంతముగా ఉన్న అనుభూతి కలిగి ఉంటారు. సాహిత్య, కళారంగాలను వైరాగ్యము మిశ్రమము చేసి ప్రయోగాలు చేస్తారు. వైద్య విద్యలలో రాణిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. ఎవరిపట్ల శాశ్వత అనుబంధము ఉన్నట్లు భావించరు. ఒకసారి లాభము సంపాదించిన రంగములో తిరిగి ప్రవేశించరు. నిలకడగా, నికరముగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వృద్ధాప్యము అన్ని విధాలుగా బాగుంటుంది.
భారత కాలమానం ప్రకారం నక్షత్రములలో 'అనూరాధ నక్షత్రము' ఒకటి. నక్షత్రములలో ఇది 17వ నక్షత్రం.
నక్షత్రం | అధిపతి | గణం | జాతి | జంతువు | వృక్షం | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
అనూరాధ | శని | దేవ | పురుష | జింక | పొగడ | మధ్య | సూర్యుడు | వృశ్చికము |
తార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | శరీరశ్రమ |
సంపత్తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | ధన లాభం |
విపత్తార | అశ్విని, మఖ, మూల | కార్యహాని |
సంపత్తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | క్షేమం |
ప్రత్యక్ తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | ప్రయత్న భంగం |
సాధన తార | రోహిణి, హస్త, శ్రవణం | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | మృగశిర, చిత్త, ధనిష్ఠ | బంధనం |
మిత్ర తార | ఆరుద్ర, స్వాతి, శతభిష | సుఖం |
అతిమిత్ర తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | సుఖం, లాభం |
జజి వేద హారీ@జిమెయిల్.కామ్
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.