అనంతనాగ్

అనంతనాగ్ జిల్లా పరిపాలనా కేంద్ర స్థానం. From Wikipedia, the free encyclopedia

అనంతనాగ్

అనంతనాగ్,జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాకు ఇది పరిపాలనా ప్రధాన కార్యాలయం. దీనిని స్థానికంగా ఇస్లామాబాద్ అని కూడా పిలుస్తారు.ఇది జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుండి 53 కి.మీ.(33 మైళ్ళు) దూరంలో ఉంది. శ్రీనగర్, జమ్మూల తరువాత జమ్మూ కాశ్మీర్‌లో ఇది మూడవ అతిపెద్ద నగరం.పట్టణ సముదాయ జనాభా మొత్తం 2,00,000 కంటే ఎక్కువగా ఉండగా, పురపాలక సంఘం జనాభా పరిమితి మొత్తం 100,000 కంటే ఎక్కువగా ఉంది.[1]

త్వరిత వాస్తవాలు అనంతనాగ్ ఇస్లాంబాద్, దేశం ...
అనంతనాగ్
ఇస్లాంబాద్
Thumb
అనంతనాగ్ నగరం పనోరమా చిత్రం.
Thumb
అనంతనాగ్
భారతదేశంలో జమ్మూ కాశ్మీరు
Thumb
అనంతనాగ్
అనంతనాగ్ (India)
Coordinates: 33.73°N 75.15°E / 33.73; 75.15
దేశంభారతదేశం
జిల్లాఅనంతనాగ్
స్థాపన5 బిసిఇ
విస్తీర్ణం
  Total2,917 కి.మీ2 (1,126 చ. మై)
Elevation
1,601 మీ (5,253 అ.)
జనాభా
 (2011)
  Total1,59,838[1]
భాషలు
Time zoneUTC+5:30
పిన్‌కోడ్
192101
ప్రాంతీయ ఫోన్‌కోడ్01932
Vehicle registrationJK 03
లింగ నిష్పత్తిప్రతి 1000 పురుషులుకు 927 మంది స్త్రీలు
మూసివేయి

పేరు వెనుక చరిత్ర

అనంతనాగ్ అనే పేరు అనంత అనే పదం సంస్కృత నుండి ఉద్భవించింది.అనంతనాగ్ అంటే "అనంతం" కాశ్మీరీ పదం నాగా, "నీటి వసంతం"అనే అర్థాన్ని సూచిస్తుంది.అనంత్-నాగ్ అంటే "అనేక బుగ్గలు"అని అర్ధం,ఎందుకంటే పట్టణంలో చాలా బుగ్గలు ఉన్నాయి. మార్క్ అరేల్ స్టెయిన్ ప్రకారం,హిందూ వేదాంతశాస్త్రంలో "దైవ సర్పం" గా పరిగణించే పట్టణంలో వసంత వద్ద ఉన్న శేషనాగ్ పేరు నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. శేషనాగ్‌ను అనంతనాగ్ అని కూడా పిలుస్తారు. [2]

ఇస్లామాబాద్ పేరు మొఘల్ ప్రధాన పరిపాలకుడు ఇస్లాం ఖాన్ పేరు నుండి ఉద్భవించిందని నమ్ముతారు.

ఈ రెండు పేర్లుతో కలసిఉన్న పేరు పట్టణానికి ఉపయోగించారు. అనంతనాగ్‌ను హిందువులు, సిక్కులు ఇష్టపడతారు.ఇస్లామాబాద్ ముస్లింలు ఇష్టపడతారు. వాల్టర్ రోపర్ లారెన్స్ 1895 లో ప్రచురించబడిన కాశ్మీర్ లోయ అనే తన రచనలో "అనంతనాగ్ జిల్లా" గురించి ప్రస్తావించాడు.[3] కాశ్మీర్ తిరుగుబాటు ప్రారంభంతో భారత భద్రతా దళాలు ఈప్రాంతంలో మోహరించినప్పటికీ,స్థానికులు ఇస్లామాబాద్ అనే పేరును ఉపయోగిస్తారు.[4]

భౌగోళికం

అనంతనాగ్ 33.73°N 75.15°E / 33.73; 75.15 వద్ద ఉంది [5] ఇది సముద్రమట్టానికి 5300 అడుగులు,(600 మీ) ఎత్తులో, జాతీయ రహదారి 44లో శ్రీనగర్ నుండి 53 కి.మీ (33 మైళ్లు) దూరంలో ఉంది.(అన్ని జాతీయ రహదారుల పునర్నిర్మాణానికి ముందు పాత పేరు ఎన్ఎచ్ 1ఎ).

జనాభా

2001 నుండి 2011 వరకు,నగర జనాభా 63,437[6] నుండి 10,9,433కు పెరిగింది.[1] నగర ప్రాంతం (అనంతనాగ్ పట్టణ సముదాయం) 2011 నాటికి 15,9,838కు పెరిగింది. అనంతనాగ్ నగరజనాభాలో పురుషులు 51.6% మంది ఉండగా, మహిళలు 48.4% మంది ఉన్నారు.జాతీయ సగటు 940 తో పోలిస్తే లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది పురుషులకు 937మంది మహిళలు ఉన్నారు.జాతీయ సగటు 918తో పోలిస్తే 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గలవారి లింగనిష్పత్తి 874 వద్ద ఉంది.అనంతనాగ్ నగర సగటు అక్షరాస్యత 62.2%గాఉంది.ఇది జాతీయ సగటు అక్షరాస్యత 64.3% కన్నా తక్కువ. పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీ అక్షరాస్యత 61%గా ఉంది. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అనంతనాగ్ నగరంలో 18,056 మంది ఉన్నారు.ఇది 2011లో జనాభాలో 16.6%గా ఉంది.

సరాసరి వాతావరణ పట్టిక

మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - అనంతనాగ్ (1971–1986), నెల ...
శీతోష్ణస్థితి డేటా - అనంతనాగ్ (1971–1986)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 7.3
(45.1)
8.4
(47.1)
14.0
(57.2)
20.5
(68.9)
24.5
(76.1)
29.6
(85.3)
30.2
(86.4)
29.8
(85.6)
27.3
(81.1)
22.2
(72.0)
15.1
(59.2)
8.2
(46.8)
19.8
(67.6)
సగటు అల్ప °C (°F) −2.1
(28.4)
−0.9
(30.4)
3.4
(38.1)
7.9
(46.2)
10.9
(51.6)
14.8
(58.6)
18.3
(64.9)
17.2
(63.0)
12.1
(53.8)
5.8
(42.4)
−0.1
(31.8)
−1.4
(29.5)
7.2
(44.9)
సగటు అవపాతం mm (inches) 47
(1.9)
69
(2.7)
122
(4.8)
88
(3.5)
67
(2.6)
36
(1.4)
61
(2.4)
77
(3.0)
31
(1.2)
33
(1.3)
32
(1.3)
54
(2.1)
717
(28.2)
సగటు అవపాతపు రోజులు (≥ 1.0 mm) 7.0 8.3 11.1 8.2 8.2 5.9 7.7 6.6 3.5 3.1 3.0 5.9 78.5
Source: HKO[7]
మూసివేయి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.