From Wikipedia, the free encyclopedia
అద్దిస్ అబాబా ఇథియోపియా దేశ రాజధాని. దీన్ని ఫిన్ఫిన్నె అని కూడా పిలుస్తారు.[2] 2007 జనగణన లెక్కల ప్రకారం, నగర జనాభా 27,39,551.[3]
అడీస్ అబాబా
አዲስ አበባ | |
---|---|
Nickname(s): సిటీ ఆఫ్ హ్యూమన్స్, అదీసబా, షెగెర్, ఫిన్ఫిన్నె, అదు, అదు జెనెట్ | |
దేశము | Ethiopia |
Chartered City | అడీస్ అబాబా |
Chartered | 1886 |
Government | |
• మేయరు | కుమా దేమేక్ష |
విస్తీర్ణం | |
• రాజధాని | 527 కి.మీ2 (203 చ. మై) |
• Land | 527 కి.మీ2 (203 చ. మై) |
[1] | |
Elevation | 2,355 మీ (7,726 అ.) |
జనాభా (2008) | |
• రాజధాని | 33,84,569 |
• జనసాంద్రత | 5,165.1/కి.మీ2 (13,378/చ. మై.) |
• Urban | 33,84,569 |
• Metro | 45,67,857 |
Time zone | UTC+3 (తూర్పు ఆఫ్రికా కాలము) |
ప్రాంతపు కోడ్ | (+251) 11 |
Website | http://www.addisababacity.gov.et/ |
ఈ నగరం ఒరోమొయా రాష్ట్రానికి కూడా రాజధాని.[4] ఆఫ్రికా యూనియన్ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉంది. దానికి ముందర ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఆప్రికన్ యూనిటీ కేంద్ర కార్యాలయం కూడా ఇక్కడే ఉండేది. ఐరాస వారి ఆఫ్రికా ఆర్థిక కమిషను ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. అనేక ఇతర అంతర్జాతీయ, ఖండాతర్గత కార్యాలయాలు కూడా అద్దిస్ అబాబాలో ఉన్నాయి. దీని వల్ల అద్దిస్ అబాబాను ఆఫ్రికా రాజకీయ రాజధానిగా భావిస్తారు.[5] తూర్పు ఆఫ్రికా చీలిక నుండి పశ్చిమాన కొద్ది కిలోమీటర్ల దూరం లోనే నగరం ఉంది. ఈ చీలిక ఇథియోపియాను రెండుగా చీలుస్తోంది.[6]
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అద్దిస్ అబాబాలో నివాసముంటున్నారు. అద్దిస్ అబాబా విశ్వవిద్యాలయం ఇక్కడ ఉంది.
అద్దిస్ అబాబాలో వైవిధ్యమైన ఆర్థిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం 1,19,197 మంది వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు. 113,977 మంది తయారీ, పరిశ్రమల రంగంలో, 80,391 మంది గృహ కార్యాలలో, 71,186 మంది పౌర పాలనలో, 50,538 iమంది రవాణా కమ్యూనికేషన్ల రంగంలో, 42,514 విద్యా, వైద్య రంగాల్లో, 32,685 iమంది హోటళ్ళ రంగంలోను, 16,602 మంది వ్యవసాయం లోనూ నిమగ్నమై ఉన్నారు. కొందరు పశువుల పెంపకం, తోటల పెంపకం లోనూ కూడా ఉన్నారు. 677 హెక్టార్లలో సాగుబడి ఉంది. ఏటా 12,998 టన్నుల దిగుబడి ఉంది. It is a relatively clean and safe city, with the most common crimes being pickpocketing, scams and minor burglary.[7] ఇటీవలి కాలంలో నగరంలో నిర్మాణ కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. వివిధ విలాస సౌకర్యాలు కూడా నగరంలో విరివిగా అందుబాటులో ఉన్నాయి. అద్దిస్ అబాబాను ఆఫ్రికా స్పా రాజధానిగా భావిస్తారు.[8]
ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం అద్దిస్ అబాబాలోనే ఉంది.[9]
2007 జనగణన లెక్కల ప్రకారం, నగర జనాభా 27,39,551. దేశ రాజధాని కావడం చేత ఇక్కడ వివిధ జాతుల తెగల ప్రజలు నివసిస్తూంటారు. వీరిలో అధికులు అంహారా (47.0%), ఒరోమో (19.5%), గురగే (16.3%), టిగ్రయాన్ (6.18%), సియైట్ (2.94%), గామో (1.68%) జాతులకు చెందిన ప్రజలు. ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాషలు అమ్హారీ (71.0%), అఫాన్ అరోమో (10.7%), గురగే (8.37%), టిగ్రిన్యా (3.60%), సియైట్ (1.82%) గామో (1.03%). ఇథియోపియన్ ఆర్థడాక్స్ మతావలంబికులు 74.7% ఉండగా 16.2% మంది ముస్లిములు, 7.77% ప్రొటెస్టంట్లు, 0.48% కాథలిక్కులూ ఉన్నారు.[11]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.