అదృష్టవంతులు
From Wikipedia, the free encyclopedia
అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదలైన తెలుగు సినిమా.[1] పరిస్ధితుల ప్రభావం వలన దొంగగా మారిన యువకుడు (అక్కినేని నాగేశ్వరరావు) నిజాయితీ పరుడుగా మారినా అతని గత చరిత్ర అతడిని వెంటాడిన వైనం ఈ చిత్రకథ. జగపతి పిక్చర్స్ వారికి పేరు తెచ్చిన చిత్రాలలో ఇది ఒకటి.[2]
అదృష్టవంతులు (1969 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
నిర్మాణం | వి.బి.రాజేంద్రప్రసాద్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత, జగ్గయ్య, పద్మనాభం, రేలంగి, గీతాంజలి, విజయలలిత |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల |
నిర్మాణ సంస్థ | జగపతి పిక్చర్స్ |
భాష | తెలుగు |
చిత్రకథ
జైలు నుండి విడుదలైన రఘు (నాగేశ్వరరావు) బ్రతుకు తెఱువు కోసం ప్రయత్నించి లారీ డ్రైవర్ గా మారతాడు. అతనికి ఉద్యోగం దొరకడానికి సహకరించిన వాడు (పద్మనాభం) క్లీనర్ గా జత అవుతాడు. ఊటీకి లోడ్ తో వెళ్తున్న వారికి మగవేషం వేసుకని తిరుగుతున్న జయ (జయలలిత) తారసపడుతుంది. జయ ఇంటి నుండి పారిపోయి వచ్చినదని తెలుసుకున్న రఘు ఆమెను ఇంటి దగ్గర దించే ప్రయత్నం చేస్తాడు. అక్కడి ఆమె మేనమామ (ప్రభాకరరెడ్డి) ని చూసి, అతని గురించి తెలిసిన రఘు తన ప్రయత్నాని విరమించుకొని తన గతాన్ని చెబుతాడు. బాల్యంలో తల్లి మందులు కోసం దొంగగా మారతాడు రఘు. పోలీసులు కొడుకుని అరెస్ట్ చేయడానికి వస్తే, చూసి తట్టూకోలేని తల్లి మరణిస్తుంది. పోలీసుల నుండి అతడిని తప్పించి ముఠాలో చేరుస్తాడు ఒక దొంగ. ఆ దౌంగల ముఠా నాయకుని (జగ్గయ్య) కి రఘు అంటే గురి. ఒక సారి తల్లి దగ్గరనుండి కొడుకును వేరు చేయవలసి వస్తుంది. అది చేయలేక అరస్టై దారి మార్చుకుంటాడూ. కాని జైల్ సూపరింటెండ్ (గుమ్మడి వెంకటేశ్వరరావు) అతని పరివర్తనను నమ్మడు. రఘు కథ విని జయ కరిగిపోతుంది. ముందు వెనకా ఎవరూ లేనివాళ్లు పెళ్ళి చేసుకుంటారు. వాళ్లకి కూతురు పుడుతుంది. రఘును పాతదారిలో తీసుకురాడానికి దొంగల ముఠా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో రఘు లారీని తగల బెడతారు బ్రతుకు తెఱువు కోల్పోయిన రఘుకు మార్గాలు మూసుకుపోతాయి. కుటుంబాన్ని పోషించడానికి జయ క్లబ్ లో డాన్స్ చేస్తుండగా రఘును తీసుకు వెళ్లి చూపుతాడు దొంగల నాయకుడు. రఘు తన పరిస్ధిత వివరించి జైల్ సూపరింటెండ్ ని కలిసి తన నిజాయితిని తెలిపి, పోలీస్ ఇన్ఫార్మర్ గా దొంగల ముఠాలో చేరి వారిని పోలీసులకు అప్పగిస్తాడు.
పాత్రలు=పాత్రధారులు
- అక్కినేని నాగేశ్వరరావు - రఘు
- జయలలిత - జయ
- కొంగర జగ్గయ్య - దొంగల ముఠా నాయకుడు
- బి.పద్మనాభం - జాకీ
- ప్రభాకర రెడ్డి - రాజు
- ఆనందమోహన్ - రజాక్
- రేలంగి వెంకట్రామయ్య
- గుమ్మడి వెంకటేశ్వరరావు - జైల్ సూపరింటిండెంట్ మూర్తి
- గీతాంజలి
- విజయలలిత
- సూర్యకాంతం - పెసరట్ల పేరమ్మ
- ఛాయాదేవి - పుల్లట్ల పుల్లమ్మ
- భీమరాజు
- సాక్షి రంగారావు
- డబ్బింగ్ జానకి
- మాస్టర్ ఆదినారాయణ - రఘు (బాల్యంలో)
- బేబి రాణి - బేబి
- రామచంద్రరావు
పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్య: ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా వుండేదయ్య | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
కోడికూసే జాముదాకా తోడురారా చందురూడా: కోడెకారు కొత్తకోర్కెలు తరుముతున్నవి అందగాడా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
చింతచెట్టు చిగురుచూడు చిన్నదాని పొగరుచూడు: చింతచిగురు పుల్లగున్నాదోయ్ నాసామిరంగా చిన్నదేమో తీయగున్నాదోయ్ | ఆరుద్ర | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా ఇపుడొద్దన్నావంటే కుర్రవాడా రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా | ఆరుద్ర | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల |
నమ్మరే నేను మారనంటే నమ్మరే | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో | కొనకళ్ళ | కె.వి.మహదేవన్ | సుశీల |
నా మనసే గోదారి నీ వయసే కావేరి | అరుద్ర | కె.వి.మహదేవన్ | ఘంటసాల, సుశీల |
విశేషాలు
- ఈ సినిమాను తమిళభాషలో తిరుడన్ అనే పేరుతో శివాజీ గణేశన్, కె.ఆర్.విజయ, జయలలితల కాంబినేషన్లో ఎ.సి.త్రిలోకచందర్ దర్శకత్వంలో 1962లో నిర్మించారు.
- 1970లో ఈ సినిమాను పి.మల్లికార్జునరావు హిందీ భాషలో రవికాంత్ నగాయిచ్ దర్శకుడిగా జితేంద్ర, ముంతాజ్ జంటగా హిమ్మత్ అనే పేరుతో నిర్మించాడు.
- ఇదే సినిమా 1972లో శ్రీలంకలో సింహళ భాషలో ఎదత్ సూర్య అదత్ సూర్య అనే పేరుతో నిర్మించబడింది.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.