నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం లోని గ్రామం From Wikipedia, the free encyclopedia
అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రం, నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలానికి చెందిన గ్రామం,[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 2013 జూన్ 25న అచ్చంపేట పురపాలకసంఘంగా ఏర్పడింది.[3] ఈ పట్టణం నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణా పరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగి ఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణం అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి. వైద్య పరంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది.
అచ్చంపేట | |
---|---|
రెవెన్యూ గ్రామం | |
Coordinates: 16.3990°N 78.6370°E | |
దేశం | భారతదేశం |
State | తెలంగాణ |
జిల్లా | నాగర్కర్నూల్ |
Elevation | 78.73 మీ (258.30 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 20,721 |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 509375 |
టెలిఫోన్ కోడ్ | 08541 |
ISO 3166 code | IN-TG |
Vehicle registration | TS |
సమీప విమానాశ్రయం | హైదరాబాద్ |
లోక్సభ నియోజకవర్గం | నాగర్కర్నూల్ |
శాసనసభ నియోజకవర్గం | అచ్చంపేట |
ఈ ప్రాంతాన్ని పరిపాలించిన దేవినేని అచ్చమ్మ దొరసాని ఈ పట్టణాన్ని ఏర్పరిచింది కాబట్టి ఆమె పేరుమీదుగా ఇది అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారుల భావన. ఐతే18వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అలంపూరు బిజ్జల పాలక వంశానికి చెందని అచ్చమ్మ స్థాపించిందనీ, ఆమె పేరుమీదుగా అచ్చంపేట అయిందని కొందరు చరిత్రకారులు చెప్తారు. దేవినేని అచ్చమ్మ దొరసాని గ్రామాన్ని నెలకొల్పినట్టు పేర్కొనే శాసనం ఒకటి ఉమామహేశ్వరంలో లభిస్తోంది.[4]
గ్రామంలో 1898లో మునసబు ఆఫీసు, 1939లో తహశ్శీలు ఆఫీసు ఏర్పడ్డాయి. దీనితో 1939లోనే తాలూకా కేంద్రమైంది.[4]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.
2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.