అగ్గిపుల్ల

From Wikipedia, the free encyclopedia

అగ్గిపుల్ల

అగ్గిపుల్ల (ఆంగ్లం Match) సాధారణంగా మనం ఇంటిలో ఏదైనా వెలిగించడానికి వాడతాము. దీనితో అగ్నిని తయారుచేస్తారు. ఇవి అగ్గిపెట్టెల రూపంలో దుకాణాలలో అమ్ముతారు. ఒక అగ్గిపెట్టెలో చాలా అగ్గిపుల్లలుంటాయి.యివి అన్నీ ఒకే పరిమానం కలిగి ఉంటాయి. దీనికి రెండు పక్కల ఘర్షణ తలాలు ఉంటాయి. అగ్గిపుల్ల సాధారణంగా కర్రపుల్లకు ఒక చివర భాస్వరమునకు సంబంధించిన పదార్థం అతికించి ఉంటుంది. ఈ చివరను అగ్గిపెట్టె పక్కనున్న తలంపై రాపిడి కలిగించినప్పుడు ఘర్షణవల్ల అగ్గి పుట్టి కర్రపుల్ల అంటుకుంటుంది. అగ్గిపెట్టె లను దాచడం ఒకరకమైన హాబీ.

అగ్గిపెట్టె
వెలుగుతున్న అగ్గిపుల్ల.

వీని దురుపయోగం వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం మూలంగా వీటిని నిషిద్ధ పదార్ధాలుగా నిర్ణయించారు. అందువల్ల పిల్లలను వీటినుండి దూరంగా ఉంచాలి.

పూర్వం నుండి అగ్గి పుల్లలు పల్చని చెక్కతో తయారవుతున్నా ఇప్పుడిప్పుడే మైనం తోనూ, ప్లాస్టిక్ తోనూ తయారు చేస్తున్నారు. మొదట్లో రెండు అంగుళాల పొడవుతో వచ్చే పుల్లలనుండి ఇప్పుడు ఐదంగుళాల పొడవు వరకూ తయారు చేస్తున్నారు.

చరిత్ర

భారతదేశంలో అగ్గిపుల్లలు తయారు చేయు మొదటి కర్మాగారము భారతీయుల ఆధ్వర్యంలో అహ్మదాబాదు నగరంలో స్థాపించారు.[1]

ఇతరాలు

  • దీపావళి పండుగలో ఒక ప్రత్యేకమైన అగ్గిపుల్లలు వాడతారు.
  • సిగరెట్ కాల్చేవారు అగ్గిపెట్టెను విధిగా తమ వద్ద ఉంచుకొంటారు.
  • అగ్గిపుల్లలతో పిల్లలు రకరకాల బొమ్మలు తయారు చేస్తారు.
  • ఫైవ్ స్టార్ హోటళ్ళలో పొడవైన అగ్గిపుల్లలు వాడటం ఒక ఫ్యాషన్.

202.63.100.28 05:56, 2014 ఏప్రిల్ 8 (UTC) సక్సెస్ న్యూస్ తెలుగు మాసపత్రిక

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.