ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ (ఎయిమ్స్, బీబీనగర్), తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ కేంద్రంగా ఉన్న ఒక ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి.ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లలో ఇది ఒకటి.

త్వరిత వాస్తవాలు నినాదం, రకం ...
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, బీబీనగర్
ఎయిమ్స్, బీబీనగర్
Thumb
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (బీబీనగర్)
నినాదంసరసమైన / నమ్మదగిన తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రజలకు అందించడం
రకంభారత ప్రభుత్వం
స్థాపితం2019
డైరక్టరుశర్మన్ సింగ్ (in charge)
విద్యార్థులు50
స్థానంబీబీనగర్, తెలంగాణ, భారతదేశం
కాంపస్గ్రామీణ ప్రాంతం
భాషతెలుగు
మూసివేయి

చరిత్ర

2003 లో భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ అసమానతుల్యతలను సరిదిద్దే ఉద్దేశంతో అధికారికంగా 2006 మార్చిలో ప్రారంభించిన ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్ష యోజన (పిఎంఎస్ఎస్వై) పథకంలో భాగంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ను ఏర్పాటు చేశారు.ఎయిమ్స్ ఏర్పాటు ద్వారా ఎయిమ్స్ డిల్లీ లాంటి సంస్థలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎగువ స్థాయి కల్పించడం ద్వారా సరసమైన / నమ్మదగిన తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రజలకు అందించడం ఎయిమ్స్ ముఖ్య ఉద్ధేశ్వం.[1] ఆంధ్రప్రదేశ్ నుండి 2014 జూన్ లో తెలంగాణ విభజించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు వీలుకల్పిస్తూ చేసిన చట్టం ప్రకారం, కేంద్రప్రభుత్వం 2018లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను మంగళగిరిలో ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 లో తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రస్తావించనప్పటికీ, తెలంగాణలో కూడా ఇటువంటి సంస్థను పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం 2014 లో తెలంగాణ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

2014 జూన్ నాటికి నిజాం యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అనుభంధ సంస్థగా ఉండి, ఇంకా పనిచేయని బీబీనగర్ క్యాంపస్‌ను ఆఫర్ చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు అందచేసింది.[2] దానిమీదట ఎయిమ్స్, బీబీనగర్ క్యాంపస్‌ను ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేస్తూ 2015 జనవరిలో నిర్ణయం ప్రకటించింది.2016 సెప్టెంబరులో ఇంకొక విరుద్ధమైన ప్రకటన చేశారు. భూమి లభ్యత భువనగిరిలో ఎక్కువగా ఉన్నందున బీబీనగర్ బదులుగా భువనగిరి వద్ద ఎయిమ్స్ ఏర్పాటు చేయబడుతుందని పేర్కొంది.

2017 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-2018 బడ్జెట్ సందర్భంగా మాట్లాడుతూ 2017 ఫిబ్రవరిలో జార్ఖండ్, గుజరాత్ రెండు రాష్ట్రాలలో కూడా ఎయిమ్స్ లను ప్రకటించాడు,[3] కానీ తెలంగాణలోని సంస్థ గురించి ప్రస్తావించలేదు.తిరిగి ఒక వారం తరువాత, జైట్లీ దీనిని సరిదిద్దుకుని, తెలంగాణలో కూడా ఎయిమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు పార్లమెంటులో అధికారికంగా ప్రకటించబడింది.2018 ఏప్రియల్ లో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు సూత్రప్రాయంగా అంగీకరించింది.[4] ఎయిమ్స్ కోసం సాధ్యమయ్యే నాలుగు ప్రదేశాలలో మూడింటిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.రాష్ట్ర ప్రభుత్వం బీబీనగర్ క్యాంపస్‌ను కేంధ్రం దృష్టికి ప్రతిపాదించింది.స్థలం తనిఖీ సందర్శన తరువాత జూలైలో బీబీనగర్ స్థలం ఆమోదించి,[5] అదనంగా 49 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని,[6] కొన్ని మౌలిక సదుపాయాల మెరుగుదలలు చేయాలన్న పరిస్థితులలో, చివరగా 1,028 కోట్లు అంచనా వ్యయంతో దీని ఏర్పాటుకు 2018, డిసెంబరు 17 న కేంద్ర మంత్రివర్గం అధికారిక ఆమోదం లభించింది.ఈ సంస్థ తరువాత పి.ఎమ్.ఎస్.ఎస్.ఐ. "దశ- VII"గా సూచించబడింది.[7]

తెలంగాణ ప్రభుత్వం నుండి 2019 ఫిబ్రవరిలో ఎయిమ్స్ ఏర్పాటుకోసం భూమిని కేంద్రప్రభుత్వం అధికారికంగా స్వాదీనం చేసుకుంది.[8] కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. మేలో బీబీనగర్ క్యాంపస్ నుండి ఆగస్టులో తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ సంస్థ 2019 ఎమ్‌బిబిఎస్ విద్యార్థుల మొదటి బ్యాచ్‌తో ప్రారంభమైంది, ఇది 2019 ఆగస్టులో ప్రారంభమైన ఆరు ఎయిమ్స్‌లో ఇది ఒకటి.ఎయిమ్స్ భోపాల్‌ను వీటికి మార్గదర్శక సంస్థగా పేర్కొన్నారు.ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ శర్మన్ సింగ్ ఎయిమ్స్ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2019 డిసెంబరులో మార్గదర్శక సంస్థ జవహర్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMIR) గా మార్చబడింది.[9]

క్యాంపస్, ఆసుపత్రి

నిజాం యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కు అనుభంధ సంస్థగా ఉన్న బీబీనగర్ క్యాంపస్‌ను ఎయిమ్స్ స్వాధీనం చేసుకుని, 2019 డిశెంబరులో స్వాదీనం చేసుకుని అవసరమైన అదనపు నిర్మాణాలపని కొనసాగిస్తుంది.అయినప్పటికీ 2019 డిసెంబరులో అవుట్ పేషెంట్ సేవలు (OP), 2020 మార్చిలో ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభమవుతాయని భావించారు.మెంటర్‌షిప్ మార్పు కారణంగా, అవుట్ పేషెంట్ సేవలు (OP) 2020 ఫిబ్రవరి వాయిదా పడి ఆ తేదీ కూడా తప్పిపోయింది. ఈ ఆసుపత్రి 2023 ఫిబ్రవరిలోగా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని భావిస్తున్నారు.[10]

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.