అక్కినేని అన్నపూర్ణ

From Wikipedia, the free encyclopedia

అక్కినేని అన్నపూర్ణ

అక్కినేని అన్నపూర్ణ ( 1933 ఆగస్టు 14, -2011 డిసెంబర్ 28) తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. నటుడైన అక్కినేని నాగార్జునకు తల్లి.

త్వరిత వాస్తవాలు అక్కినేని అన్నపూర్ణ, జననం ...
అక్కినేని అన్నపూర్ణ
Thumb
అక్కినేని అన్నపూర్ణ
జననంఅక్కినేని అన్నపూర్ణ
ఆగస్టు 14, 1933
దెందులూరు, పశ్చిమ గోదావరి జిల్లా
మరణండిసెంబర్ 28, 2011
హైదరాబాద్, తెలంగాణ
ప్రసిద్ధిఅక్కినేని నాగేశ్వరరావు గారి భార్య
మతంహిందూ
భార్య / భర్తఅక్కినేని నాగేశ్వరరావు
పిల్లలుఅక్కినేని నాగార్జున, వెంకట్
తండ్రికొల్లిపర వెంకటనారాయణ
తల్లినాగ భూషణమ్మ
మూసివేయి

జీవిత విశేషాలు

అన్నపూర్ణ 1933లో ఆగస్టు 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొర్లిపర వెంకటనారాయణ, నాగభూషణమ్మ దంపతులకు జన్మించింది. అక్కినేనితో కలిసి కీలుగుర్రం సినిమాలో హీరోయిన్ గా నటించింది. 1949 ఫిబ్రవరి 18న అక్కినేని నాగేశ్వరరావుతో వివాహం జరిగింది.[1] ప్రేమానురాగాలు పంచే ఆదర్శవంతుడైన భర్త. షూటింగ్ నుంచి వచ్చాక సాధారణ గృహస్థుగా మారిపోయే అతను అన్నపూర్ణతో ఎన్నో విషయాలు చర్చించేవారు. ఆమె చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించేవారు. ఆమె కోసం, పిల్లల కోసం, వారితో ఆనందంగా గడపడం కోసం విధిగా ఏడాదికి ఒక నెల రోజులు పూర్తిగా కేటాయించేవారు అక్కినేని. ఆమె పేరిట అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి అక్కడ షూటింగ్‌లు చేసుకోవడానికి ఫ్లోర్‌లు నిర్మించడమే కాకుండా, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లనూ నెలకొల్పాడు. అదే పేరుతో బేనర్‌ను ఏర్పాటుచేసి ఎన్నో చిత్రాలు నిర్మించాడు అక్కినేని. వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు. వృద్ధాప్యం కారణంగా అన్నపూర్ణ ఆరోగ్యం దెబ్బతిన్నాక నాగేశ్వరరావు సినిమాలు తగ్గించుకున్నాడు. అన్నపూర్ణతో గడిపేందుకు ఎక్కువ కాలం వెచ్చించేవాడు. సకుటుంబ సపరివార సమేతం (2000) సినిమా తర్వాత ఆమెను చూసుకోవడం కోసం అతను ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. సహధర్మచారిణి తనను విడిచి వెళ్లిపోయాక అన్నపూర్ణ స్టూడియోస్‌లో కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అక్కినేని. స్టూడియోకు వచ్చిన వాళ్లందరినీ విగ్రహం రూపంలో అన్నపూర్ణ పలకరిస్తున్నట్లే ఉంటుంది.

అక్కినేని దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలోఒక కుమార్తె మరణించింది. కుమారుల్లో నాగార్జున సినిమా హీరో కాగా, వెంకట్ సినీ నిర్మాత.

మరణం

అన్నపూర్ణ 2011లో డిసెంబర్ 28న మృతి చెందారు.

మూలాలు

ఇతర లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.