శివమొగ్గ

From Wikipedia, the free encyclopedia

శివమొగ్గmap

శివమొగ్గ లేదా షిమోగా (కన్నడం:ಶಿವಮೊಗ್ಗ), కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ జిల్లా లోని నగరం.ఇది అదే జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది తుంగ నది ఒడ్డున ఉంది. "శివ ముఖ" (శివుని ముఖం) అనే పదం నుండి "శివమొగ్గ" పదం వచ్చిందంటారు. "సిహి మోగె" (తీపి కుండ) నుండి కూడా ఈ పేరు వచ్చిందంటారు. 16వ శతాబ్దంలో "కేలడి" నాయకుల పాలనా కాలంలో ఈ పట్టణం ప్రాముఖ్యతను సంతరించుకొంది. శివప్ప నాయకుని కాలం ఈ నగరం చరిత్రలో సువర్ణఘట్టం. తరువాత మైసూరు రాజ్యంలో భాగంగా ఉంది. 2006 నవంబరు 1 న అధికారికంగా ఈ నగరం, జిల్లా పేరును "షిమోగా"నుండి "శివమొగ్గ"గా మార్చారు.

త్వరిత వాస్తవాలు Shimoga, Country ...
Shimoga
City
Thumb
ThumbThumb
Thumb
Images, from top down, left right
Indian lion in the Tyavarekoppa Tiger and Lion Reserve
Statue of Keladi Shivappa Nayaka
Sculpture of Mahishasura Mardhini
Shivappa Nayaka palace
Thumb
Shimoga
Shimoga
Thumb
Shimoga
Shimoga
Coordinates: 13°56′N 75°34′E
Country India
StateKarnataka
DistrictShimoga
RegionMalenadu
Government
  TypeCity Corporation
  BodyShivamogga Mahanagara Palike
విస్తీర్ణం
  City70.01 కి.మీ2 (27.03 చ. మై)
  Rural
1,037.29 కి.మీ2 (400.50 చ. మై)
Elevation
569 మీ (1,867 అ.)
జనాభా
 (2011)[1]
  City3,22,650
  Rank10th (Karnataka)
  Rural
1,84,674
Languages
  OfficialKannada
Time zoneUTC+5:30 (IST)
PIN
577201 - 577205
Telephone code91-(0)8182-XXXXXX
ISO 3166 codeIN-KA
Vehicle registrationKA-14
ClimateAw
మూసివేయి

జిల్లా సరిహద్దులు

Thumb
thumbతుంగ, భద్ర నదులు కలిసే స్థానాన్ని "కూడలి" అంటారు. అక్కడ ఉన్న చిన్న మందిరం.

ఈ జిల్లాకు తూర్పున దావణగెరి జిల్లా, ఆగ్నేయాన చిక్‌మగళూరు జిల్లా, నైరుతిన ఉడిపి జిల్లా, వాయువ్యాన ఉత్తర కన్నడ జిల్లా, ఈశాన్యాన హవేరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

రైలు రవాణా

ఈ జిల్లాలో ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు భద్రావతి, హర్నహళ్ళి, కుంసి, ఆనందపురం, సాగర్ ల మీదుగా తల్గుప్ప వరకు ఒక రైలు మార్గం ఉంది.

రోడ్డు రవాణా

ఈ జిల్లాలో ప్రధాన పట్టణాలను కలుపుతూ ముఖ్య రహదారులున్నాయి.13వ నెంబరు జాతీయ రహదారి, 206వ నెంబరు జాతీయ రహదారులు ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 6632 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండగా అందులో 222 కిలోమీటర్లు జాతీయ రహదారులు. 402 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు కూడా ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి.

వాయు రవాణా

ప్రస్తుతానికి వాయు రవాణా ఈ జిల్లాలో లేనప్పటికీ శివమొగ్గ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో సొగానె వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.

పరిశ్రమలు

  • దేశంలోని ముఖ్య ఇనుము-ఉక్కు పరిశ్రమలలో ఒకటైన విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు పరిశ్రమ ఈ జిల్లాలో ఈశాన్యాన భద్రావతి వద్ద ఉంది. ఈ పారిశ్రామిక పట్టణంనకు మంచి రైలు, రోడ్డు సౌకర్యం ఉంది. ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకాలపై ఏర్పడిన ఈ కర్మాగారపు ప్రారంభనామం మైసూర్ ఇనుము-ఉక్కు పరిశ్రమ. ప్రస్తుతం ఈ పరిశ్రమ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో పనిచేస్తుంది.
  • భద్రావతిలోనే మరో ముఖ్యమైన పరిశ్రమ భద్రావతి పేపర్ మిల్స్ లిమిటెడ్. ISO 14001 ధృవపత్రం పొందిన ఈ కంపెనీ అన్నిరకాల పేపరును ఉత్పత్తి చేయుటలో ప్రసిద్ధి.
  • ఇవే కాకుండా పలు వ్యవసాయ ఆధారిత, ఇంజనీరింగ్ ఉత్పత్తుల, ఆటోమోబైల్, ఆహార, పానీయాలకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లు ఈ జిల్లాలో కలవు.

ముఖ్య పట్టణాలు

  • శివమొగ్గ
  • సోరబ్
  • శికారిపుర
  • హోసనగర
  • అంజనపుర
  • తీర్థహళ్ళి
  • భద్రావతి
  • తుంగ

అవీ ఇవీ

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.