క్వెట్టా గ్లాడియేటర్స్
పాకిస్తాన్ దేశీయ ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ ఫ్రాంచైజీ జట్టు / From Wikipedia, the free encyclopedia
క్వెట్టా గ్లాడియేటర్స్ అనేది పాకిస్తాన్ దేశీయ ప్రొఫెషనల్ ట్వంటీ20 క్రికెట్ ఫ్రాంచైజీ జట్టు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పోటీపడుతోంది. వారు గడ్డాఫీ స్టేడియంలో చాలా హోమ్ మ్యాచ్ లు ఆడతున్నారు. పిఎస్ఎల్ 2019 లో గ్లాడియేటర్స్ గెలిచి ఛాంపియన్గా నిలిచారు. ఈ బృందం నామమాత్రంగా పాకిస్థాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్షియల్ రాజధాని క్వెట్టాలో ఉంది.
త్వరిత వాస్తవాలు స్థాపన లేదా సృజన తేదీ, క్రీడ ...
క్వెట్టా గ్లాడియేటర్స్
స్థాపన లేదా సృజన తేదీ | 2015 ![]() |
---|---|
క్రీడ | క్రికెట్ ![]() |
లీగ్ | Pakistan Super League ![]() |
స్వంత వేదిక | Bugti Stadium ![]() |
అధికారిక వెబ్ సైటు | http://www.quettagladiators.com ![]() |
మూసివేయి
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ద్వారా పిఎస్ఎల్ ఏర్పాటు ఫలితంగా 2015లో ఫ్రాంచైజీ స్థాపించబడింది.[1] బుగ్టి స్టేడియం ఈ జట్టు హోమ్గ్రౌండ్ గా ఉంది. ఈ జట్టుకు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. షేన్ వాట్సన్ ప్రధాన కోచ్,[2] ఆజం ఖాన్ జట్టు మేనేజర్,[3] అబ్దుల్ రజాక్ అసిస్టెంట్ కోచ్ గా ఉన్నారు.[4]
జట్టులో అత్యధిక పరుగుల స్కోరర్ సర్ఫరాజ్ అహ్మద్[5] కాగా, ప్రధాన వికెట్ టేకర్ మహమ్మద్ నవాజ్.[6]