మైక్రోఫార్మాట్‌ (μF) అనేది ఒక అంశం గురించిన స్థిరమైన, వివరణాత్మకమైన మెటాడేటాను అందించడానికి రూపొందించిన HTML క్లాస్‌ల సమితి. ఇది నిర్దిష్ట రకమైన డేటాను (కాంటాక్టు సమాచారం, భౌగోళిక కోఆర్డినేట్‌లు, ఈవెంట్‌లు, బ్లాగ్ పోస్ట్‌లు, ఉత్పత్తులు, వంటకాలు వంటివి) అందిస్తాయి. [1] అవి నిర్దుష్ట రకమైన డేటాను సూచించే క్లాస్‌లను తయారు చేసి, వాటికి సంబంధించిన సమాచారాన్ని విశ్వసనీయంగా ప్రాసెస్ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌కు వీలు కలుగుతుంది. మైక్రోఫార్మాట్‌లు 2005లో ఉద్భవించాయి. వీటిని ప్రధానంగా సెర్చి ఇంజిన్లు, వెబ్ సిండికేషన్, RSS వంటి అగ్రిగేటర్ల కోసం రూపొందించారు. [2]

త్వరిత వాస్తవాలు పొడిపదాలు, స్థితి ...
మైక్రోఫార్మాట్లు
Thumb
పొడిపదాలుμF
స్థితిప్రచురితమైంది
మొదలైన తేదీ2005
తాజా కూర్పుMicroformats2
మే 2010; 14 సంవత్సరాల క్రితం (2010-05)
సంబంధిత ప్రమాణాలురిసోర్స్ డిస్క్రిప్షన్, RDF స్కీమా, వెబ్ ఆంటాలజీ లాంగ్వేజ్ (OWL)
డొమెయిన్సెమాంటిక్ వెబ్
మూసివేయి

వెబ్ మొదలైనప్పటి నుండి వెబ్ పేజీలలో ఉండే కంటెంటును కొంత మేరకు "ఆటోమేటెడ్ ప్రాసెసింగ్" చేయగలిగినప్పటికీ, వెబ్‌లో సమాచారాన్ని ప్రదర్శించడానికి ఉపయోగించే మార్కప్ అంశాల్లో ఉన్న సమాచారం ఏమిటో వివరించనందున దాన్ని ఆటోమాటిగ్గా ప్రాసెసింగ్ చెయ్యడం కష్టంగా ఉండేది. [3] మైక్రోఫార్మాట్‌ల ద్వారా సెమాంటిక్స్‌ను చేరిస్తే ద్వారా ఈ అంతరాన్ని తగ్గించవచ్చు. తద్వారా నేచురల్ లాంగ్వేజి ప్రాసెసింగ్ లేదా స్క్రీన్ స్క్రాపింగ్ వంటి ఇతర, మరింత సంక్లిష్టమైన, ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ పద్ధతులను వాడాల్సిన అవసరం ఉండదు. మైక్రోఫార్మాట్‌లను ఉపయోగించడం వలన డేటా ఐటెమ్‌లను ఇండెక్స్ చేయడానికి, శోధించడానికి, సేవ్ చేయడానికి లేదా క్రాస్-రిఫరెన్స్ చేయడానికి వీలు కలుగుతుంది. తద్వారా సమాచారాన్ని మళ్లీమళ్లీ ఉపయోగించుకోవచ్చు లేదా వివిధ సమాచారాలను కలపవచ్చు. [3]

2013 నాటికి, ఈవెంట్ వివరాలు, సంప్రదింపు సమాచారం, సామాజిక సంబంధాలు, తదితర సమాచారాన్ని ఎన్‌కోడింగు చేయడానికీ, వెలికితీతకూ మైక్రోఫార్మాట్‌ల వలన వీలుకలిగింది.

మైక్రోఫార్మాట్స్2 అనేది మైక్రోఫార్మాట్‌ల కొత్త రూపం. దీన్ని సంక్షిప్తంగా mf2గా అని అంటారు. RDFa ను, మైక్రోడేటానూ ఉపయోగించిన మునుపటి పద్ధతుల కంటే Mf2 వలన HTML (హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్) సింటాక్సును, పదజాలాలనూ వివరించడానికి మరింత సులభమైన పద్ధతి అందుబాటు లోకి వచ్చింది. [4]

సాంకేతిక అవలోకనం

XHTML, HTML ప్రమాణాల వలన మార్కప్ అంశాల లక్షణాలలో సెమాంటిక్స్‌ను పొందుపరచడానికీ, ఎన్‌కోడింగ్ చేయడానికీ వీలు కలుగుతుంది. కింది లక్షణాలను ఉపయోగించి మెటాడేటాను చూపించడం ద్వారా మైక్రోఫార్మాట్‌లు ఈ ప్రమాణాల ప్రయోజనాన్ని పొందుతాయి:

class
క్లాస్ పేరు
rel
సంబంధం, యాంకర్-ఎలిమెంట్‌లోని లక్ష్యపు చిరునామా వివరణ (... )
rev
రివర్స్ రిలేషన్, రిఫరెన్స్డ్ డాక్యుమెంటు వివరణ (ఒక సందర్భంలో వాడతారు. లేదంటే మైక్రోఫార్మాట్‌లలో దీన్ని పట్టించుకోరు [5] )

ఉదాహరణకు, "The birds roosted at 52.48, -1.89 " అనే పాఠ్యంలో ఒక జత సంఖ్యలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని బట్టి అవి, భౌగోళిక నిర్దేశాంకాలని అర్థం చేసుకోవచ్చు. నిర్దుష్ట క్లాస్ పేర్లతో (ఈ సందర్భంలో వీటిని జియో మైక్రోఫార్మాట్ స్పెసిఫికేషన్‌లోని geo, latitude, longitude లు) స్పాన్‌లలో (లేదా ఇతర HTML అంశాలు) వీటిని ఇలా చూపవచ్చు:

The birds roosted at

52.48,
-1.89

సాఫ్ట్‌వేర్ ఏజెంట్లు పై విలువలు వేటిని సూచిస్తాయో ఖచ్చితంగా గుర్తించగలవు. ఇండెక్సింగ్, మ్యాప్‌లో దాన్ని గుర్తించడం, దానిని GPS పరికరానికి ఎగుమతి చేయడం వంటి అనేక రకాల పనులను అవి చేయగలవు.

ఉదాహరణలు

ఈ ఉదాహరణలో, వ్యక్తుల కాంటాక్టు సమాచారాన్ని క్రింది విధంగా ప్రదర్శిస్తాయి:

Joe Doe

The Example Company

604-555-1234

http://example.com/

hCard మైక్రోఫార్మాట్ మార్కప్‌తో సూచిస్తే పై ఉదాహరణ కింది విధంగా ఉంటుంది:

Joe Doe

The Example Company

604-555-1234

http://example.com/

ఇక్కడ, ఫార్మాట్ చేయబడిన పేరు (fn), సంస్థ (org), టెలిఫోన్ నంబర్ (tel), వెబ్ చిరునామా (url) లను వాటికి సంబంధించిన క్లాస్ పేర్లను ఉపయోగించి గుర్తించారు. మొత్తం విషయాన్ని class="vcard" లో చేర్చారు. అంటే, ఇతర క్లాస్‌లు ఒక hCardను ఏర్పరుస్తాయనీ, ("HTML vCard "కి సంక్షిప్తంగా) అవి కేవలం యాదృచ్చికంగా పెట్టిన పేర్లు కాదనీ దీనికి అర్థం. ఇతర, hCard క్లాస్‌లు కూడా ఉన్నాయి. బ్రౌజర్ ప్లగ్-ఇన్‌ల వంటి సాఫ్ట్‌వేర్లు పై సమాచారాన్ని సంగ్రహించి, చిరునామా పుస్తకం వంటి ఇతర అప్లికేషన్‌లకు బదిలీ చేయగలవు.

నిర్దుష్ట మైక్రోఫార్మాట్లు

నిర్దుష్ట రకాల సమాచారపు సెమాంటిక్ మార్కప్‌ను ప్రారంభించడానికి అనేక మైక్రోఫార్మాట్లను అభివృద్ధి చేసారు. అయితే, hCard, hCalendar లు మాత్రమే ఆమోదం పొందాయి. మిగిలినవి ఇంకా డ్రాఫ్ట్‌లుగానే ఉన్నాయి:

• hAtom (దీని స్థానంలో ఇప్పుడు h-ఎంట్రీ, h-ఫీడ్ లు వచ్చాయి) - ప్రామాణిక HTML నుండి Atom ఫీడ్‌లను గుర్తించడం కోసం
• hCalendar - ఈవెంట్‌ల కోసం
• hCard - సంప్రదింపు సమాచారం కోసం; ఇందులో కిందివి ఉంటాయి:
• hMedia – ఆడియో/వీడియో కంటెంట్ కోసం [6] [7]
• hAudio - ఆడియో కంటెంట్ కోసం
• hNews – వార్తల కంటెంట్ కోసం
• hProduct - ఉత్పత్తుల కోసం
• hRecipe - వంటకాలు, ఆహార పదార్థాల కోసం.
• hReview – సమీక్షల కోసం
• rel- డైరెక్టరీ – డైరెక్టరీ సృష్టికి, చేర్పుల కోసం [8]
• rel-enclosure – వెబ్ పేజీలకు మల్టీమీడియా జోడింపుల కోసం [9]
• రీ-లైసెన్స్ – కాపీరైట్ లైసెన్సు వివరణ [10]
• rel- nofollow, థర్డ్-పార్టీ కంటెంట్ స్పామ్‌ను నిరుత్సాహపరిచే ప్రయత్నం (ఉదా . బ్లాగ్‌లలో స్పామ్)
• rel- tag – వికేంద్రీకృత ట్యాగింగ్ కోసం (ఫోక్సోనమీ) [11]
• XHTML ఫ్రెండ్స్ నెట్‌వర్క్ (XFN) - సామాజిక సంబంధాల కోసం
• XOXO - జాబితాలు, రూపురేఖల కోసం

ఉపయోగాలు

HTML కోడ్‌లో మైక్రోఫార్మాట్‌లను ఉపయోగించడం వలన సాఫ్టువేర్ అప్లికేషన్‌లు ఉపయోగించగల అదనపు ఫార్మాటింగ్, సెమాంటిక్ డేటా అందుబాటు లోకి వస్తుంది. ఉదాహరణకు, వెబ్ క్రాలర్‌ల వంటి అప్లికేషన్‌లు ఆన్‌లైన్ వనరుల గురించి డేటాను సేకరించగలుగుతాయి. ఇ-మెయిల్ క్లయింట్‌లు లేదా షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్ వంటి డెస్క్‌టాప్ అప్లికేషన్‌లు ఆయా వివరాలను కంపైల్ చేయగలుగుతాయి. మైక్రోఫార్మాట్‌ల వలన వెబ్ పేజీల్లోని భౌగోళిక నిర్దేశాంకాలను Google మ్యాప్స్‌ వంటి అప్లికేషన్ల లోకి ఎగుమతి చేయడం కూడా సులభమౌతుంది.

Firefox లో ఉండే ఆపరేటర్, Internet Explorer లో ఉండే Oomph వంటి అనేక బ్రౌజర్ పొడిగింపులకు HTML పేజీలో ఉండే మైక్రోఫార్మాట్‌లను గుర్తించే సామర్థ్యం ఉంది. hCard లేదా hCalendar లతో వ్యవహరించేటపుడు, అటువంటి బ్రౌజర్ పొడిగింపులు మైక్రోఫార్మాట్‌లను కాంటాక్ట్ మేనేజ్‌మెంట్, Microsoft Outlook వంటి క్యాలెండర్ యుటిలిటీలకు అనుకూలమైన ఫార్మాట్‌లలోకి ఎగుమతి చేయగలుగుతాయి. భౌగోళిక నిర్దేశాంకాలతో వ్యవహరించేటప్పుడు, భౌగోళిక స్థానాన్ని Google మ్యాప్స్ వంటి అప్లికేషన్‌లకు పంపగలుగుతాయి. యాహూ! క్వేరీ లాంగ్వేజీ వెబ్ పేజీల నుండి మైక్రోఫార్మాట్‌లను సంగ్రహిస్తుంది. [12] 2009 మే 12 న Google వారు hCard, hReview, hProduct మైక్రోఫార్మాట్‌లను పార్సు చేస్తున్నట్లు, శోధన ఫలితాల పేజీలను నింపేందుకు వాటిని ఉపయోగిస్తున్నట్లూ ప్రకటించింది. [13] ఈవెంట్‌ల కోసం hCalendar ని, కుకరీ వంటకాల కోసం hRecipeని ఉపయోగించేలా 2010లో వారు దాన్ని మరింత మెరుగుపరచారు. [14] అదేవిధంగా, Bing, Yahoo! లు కూడా మైక్రోఫార్మాట్‌లను వాడుతున్నాయి. [15] [16] 2010 చివరి నాటికి, ఇవి ప్రపంచంలోని మొదటి మూడు అగ్ర శోధన ఇంజిన్‌లు. [17]

2006లో మైక్రోసాఫ్ట్, ఇతర సాఫ్ట్‌వేర్ కంపెనీల వలె రాబోయే ప్రాజెక్ట్‌లలో [18] మైక్రోఫార్మాట్‌లను చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పింది.

అలెక్స్ ఫాబోర్గ్ వెబ్ బ్రౌజర్‌లో మరింత క్లిష్టతరమైన HTMLని తయారు చేయకుండా ఉంచడం కోసం మైక్రోఫార్మాట్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లను వాడాలనే వాదలనను ఇలా సంగ్రహ పరచాడు: [19]

• వినియోగదారుకు ఏయే అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయో, వినియోగదారు ప్రాధాన్యతలు ఏమిటో వెబ్ బ్రౌజర్‌కు మాత్రమే తెలుసు
• వెబ్‌సైట్ డెవలపర్‌లు "ప్రదర్శన" లేదా "చర్య" సమస్యలను పట్టించుకోకుండా, మార్కప్‌ను మాత్రమే చేయవలసి వస్తే, అది కొత్తవారి ప్రవేశానికి ఉన్న పెద్ద అడ్డంకిని తగ్గిస్తుంది.
• మైక్రోఫార్మాట్‌లకు మద్దతు ఇవ్వని వెబ్ బ్రౌజర్‌లతో పాత అనుకూలతను (బ్యాక్‌వర్డ్ కంపాటిబిలిటీ) కలిగి ఉంటుంది
• వెబ్ నుండి వినియోగదారు కంప్యూటరు లోకి ప్రవేశించే ఒకే పాయింటు వెబ్ బ్రౌజరు. దీనివలన భద్రతా సమస్యలు తగ్గుతాయి.

మైక్రోఫార్మాట్లు 2

FOOEast, 2010-05-02 సమయంలో మైక్రోఫార్మాట్స్2 ను ప్రతిపాదించి, చర్చించారు. [20] మైక్రోఫార్మాట్స్2 రచయితలు మైక్రోఫార్మాట్‌లను ప్రచురించడాన్ని, డెవలపర్‌లు వాటిని వినియోగించుకోవడాన్నీ సులభతరం చేయడానికి ఉద్దేశించారు. అదే సమయంలో దానికి బ్యాక్‌వర్డ్ కంపాటిబిలిటీ కూడా ఉంటుంది [21]

మైక్రోఫార్మాట్స్ 2, పైన చూపిన ఉదాహరణలను ఇలా గుర్తిస్తుంది:

The birds roosted at

52.48,
-1.89

అలాగే:

Joe Doe

The Example Company

604-555-1234

http://example.com/

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.