బ్లాక్ (ఆవర్తన పట్టిక)
From Wikipedia, the free encyclopedia
ఆవర్తన పట్టికలో బ్లాక్ అనేది పరమాణు కక్ష్యల వాలెన్స్ ఎలక్ట్రాన్లను బట్టి సమూహపరచిన మూలకాల సమితి. [1] ఈ పదాన్ని మొదట చార్లెస్ జానెట్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. [2] ప్రతి బ్లాక్‌కు దాని లక్షణమైన కక్ష్య పేరిట s-బ్లాక్, p-బ్లాక్, d-బ్లాక్, f-బ్లాక్ అనే పేర్లు పెట్టారు.
బ్లాక్ పేర్లు (s, p, d, f) స్పెక్ట్రోస్కోపిక్ సంజ్ఞామానం లోని ఎలక్ట్రాన్ అజిముతల్ క్వాంటం సంఖ్య విలువను బట్టి తీసుకున్నారు : షార్ప్ (0), ప్రిన్సిపల్(1), డిఫ్యూస్ (2), ఫండమెంటల్(3). ఆ తరువాత వచ్చే బ్లాకుల లోని మూలకలాను ఇంకా కనుక్కోనప్పటికీ, ఆయా బ్లాకులకు పేర్లు g, h, అని అక్షర క్రమంలో పెట్టారు.