తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి.[3] ఈ ఎన్నికలలో పాల్గొన్నవాటిలో మొదటి శాసనసభలోని అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ప్రధానమైనవి.[4] గతంలో అధికారంలోఉన్న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని ఓడించడానికి నాలుగు ప్రతిపక్ష పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ పార్టీలు కలసి "మహా కూటమి"గా ఏర్పడి పోటీ చేసాయి.[5]
త్వరిత వాస్తవాలు మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలు మెజారిటీ కొరకు 60 సీట్లు అవసరం, పోలింగ్ ...
2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలు
|
|
|
|
ఎన్నిక ఫలితాలు |
|
మూసివేయి