హ్యారీ పాటర్
ఫాంటసీ సాహిత్యం సిరీస్ / From Wikipedia, the free encyclopedia
హ్యారీ పాటర్ పుస్తకాలు ఇంగ్లండుకు చెందిన రచయత్రి జె.కె. రౌలింగ్ రచించిన ఫాంటసీ సాహిత్యపు పుస్తకాల వరుస. 1997 లో మొదటి పుస్తకము హ్యారీ పాటర్ అండ్ ఫిలాసఫర్స్ స్టోన్ (Harry Potter and the Philosopher's Stone) విడుదల నుండి, ఆ పుస్తకాల పాప్యులారిటీ ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యంగా పెరిగి పోయింది. హ్యారీ పాటర్ సినీమాలు, వీడియో గేమ్స్ ఇతర వస్తువులకు శ్రీకారము చుట్టడము జరిగింది. ఈ వరుసలో మొత్తం ఏడు పుస్తకాలున్నాయి, ఫిబ్రవరి 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కన్నా ఎక్కువ కాపీలు అమ్ముడయ్యాయి,చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన పుస్తక శ్రేణిగా నిలిచాయి. ఈ పుస్తకాలు ఎనభై భాషలలోకి అనువదించబడ్డాయి.[1]
హ్యారీ పాటర్ (Harry Potter) | |
![]() | |
జె.కె.రౌలింగ్ రచించిన హ్యారీ పాటర్ పుస్తకాల పరంపరలో మొదటి దైన Harry Potter and the Philosopher's Stone ముఖచిత్రం(British/Canadian/Australian/Irish/ Japanese/Taiwanese/African version). | |
కృతికర్త: | జే. కే. రౌలింగ్ |
---|---|
బొమ్మలు: | థామస్ టాయ్లర్, క్లిఫ్ రైట్, గైల్స్ గ్రీన్ఫీల్డ్, జేసన్ కాక్క్రాఫ్ట్ |
దేశం: | యునైటెడ్ కింగ్డమ్ |
భాష: | ఇంగ్లీషు |
విభాగం (కళా ప్రక్రియ): | కాల్పనిక సాహిత్యం |
ప్రచురణ: | Bloomsbury, et. al. |
విడుదల: | 26 జూన్ 1997 |
కథలో చాలా భాగము హాగ్వార్ట్స్ మంత్ర తంత్ర జాల పాఠశాలలో నడుస్తంది. బాలుడైన హ్యారీ పాటర్ కు క్షుద్రవిద్యలు నేర్చిన మంత్రగాడు వోల్డమోర్ట్ తో జరిగిన పోరాటము ఈ కథలో ముఖ్యాంశము. ఏడవ పుస్తకం హ్యారీ పాటర్ ఆండ్ డెత్లీ హాలోస్ (Harry Potter and the Deathly Hallows) 21 జూలై 2007 న విడుదలై సంచలనం సృష్తించింది. విడుదలైన రోజే కాపీలన్నీ అమ్ముడైపోయి రికార్డులకెక్కింది.[2]
అన్ని పుస్తకాలను చిత్రాలుగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాలకు ప్రధానంగా డేవిడ్ హేమాన్ నిర్మించాడు. డేనియల్ రాడ్క్లిఫ్ (హ్యారీ పాటర్), రూపెర్ట్ గ్రింట్ (రాన్ వెస్లీ), ఎమ్మా వాట్సన్ (హెర్మియోన్ గ్రాంజెర్)లు మూడు ప్రముఖ పాత్రలలో నటించారు. ఈ సిరీస్లో నలుగురు దర్శకులు పనిచేశారు: క్రిస్ కొలంబస్, అల్ఫోన్సో క్యూరాన్, మైక్ న్యూవెల్, డేవిడ్ యేట్స్. ఏడవ ఆఖరి నవల అయిన హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ (Harry Potter and the Deathly Hallows) రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం నవంబర్ 2010 లో విడుదలైంది, రెండవది జూలై 2011 లో విడుదలైంది. [3] [4]
ఈ నవలల సాఫల్యం వలన, రౌలింగ్ సాహిత్య చరిత్రలోనే అతి ధనవంతురాలైనది.[5] పుస్తకాలు, చలన చిత్రాల విజయంతో హ్యారీ పాటర్ ఫ్రాంచైజీని అనేక ఉత్పన్న రచనలతో విస్తరించారు, 2009 లో చికాగోలో ఒక ప్రయాణ ప్రదర్శన ప్రదర్శించబడింది, లండన్లో ఒక స్టూడియో పర్యటన 2012 లో ప్రారంభమైంది, ఒక డిజిటల్ వేదికపై జే. కే. రౌలింగ్ సిరీస్ను క్రొత్త తలఁపులు,సమాచారంతో తాజాపరుస్తుంది[6], ఫన్టాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్ (Fantastic Beasts and Where to Find Them, 2016), ఫన్టాస్టిక్ బీస్ట్స్: ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ (Fantastic Beasts: The Crimes of Grindelwald, 2018) అనే రెండు క్రొత్త చలనచిత్రాలు ఈ ఫ్రాంచైజీలో (ఇదే ఫాంటసీ ప్రపంచంలో) విడుదలయ్యాయి.