హోషియార్పూర్
మానవ పరిష్కారం / From Wikipedia, the free encyclopedia
హోషియార్పూర్ పంజాబ్ రాష్ట్రం, దోఆబా ప్రాంతంలోని నగరం. ఇదిహోషియార్పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. ఇది మునిసిపల్ కార్పొరేషన్ పాలనలో ఉంది. దీన్ని పద్నాలుగో శతాబ్దం ప్రారంభంలో స్థాపించారు. 1809 లో దీనిని మహారాజా కరణ్వీర్ సింగ్ దళాలు ఆక్రమించాయి. 1849 లో పంజాబ్ రాష్ట్రంలో ఐక్యమైంది.
త్వరిత వాస్తవాలు హోషియార్పూర్, దేశం ...
హోషియార్పూర్ | |
---|---|
Coordinates: 31.53°N 75.92°E / 31.53; 75.92 | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | హోషియార్పూర్ |
Founded by | హర్గోవింద్రాం, రాం చంద్ - మహమ్మద్ బిన్ తుగ్లక్ దీవానులు[1] |
Named for | హోషియార్ ఖాన్ |
Government | |
• Type | మునిసిపాలిటీ |
• Body | హోషియార్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ |
Elevation | 296 మీ (971 అ.) |
Population (2011) | |
• Total | 1,68,443 |
Demonym(s) | హోషియార్పూరియా, హోషియార్పూరీ |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 146001 |
Area code | +91-1882 |
Vehicle registration | PB07 |
Website | http://www.hoshiarpur.nic.in/ |
మూసివేయి
సముద్ర మట్టం నుండి హోషియార్పూర్ సగటు ఎత్తు 296 మీటర్లు . హోషియార్పూర్ జిల్లా పంజాబ్ ఈశాన్య భాగంలో ఉంది. ఇది జలంధర్ రెవెన్యూ విభాగంలో ఉంది. ఇది దోఆబా ప్రాంతంలోని బిస్ట్ దోఆబ్ భాగంలో ఉంది. హోషియార్పూర్ ఈశాన్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా , ఊనా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. నైరుతిలో, షహీద్ భగత్ సింగ్ నగర్, జలంధర్ , కపుర్తాలా జిల్లాలు, వాయవ్యంలో గురుదాస్పూర్ జిల్లా సరిహద్దుగా ఉన్నాయి.