హోమో
From Wikipedia, the free encyclopedia
హోమో (లాటిన్లో హోమో అంటే మనిషి అని అర్థం) జీనస్, అంతరించిపోయిన ఆస్ట్రలోపిథెకస్ జీనస్ నుండి ఆవిర్భవించింది. ప్రస్తుత్ం ఉనికిలో ఉన్నహోమో సేపియన్స్ (ఆధునిక మానవులు) ఈ జీనస్ లోని జాతి. ఇది కాక, అనేక అంతరించిపోయిన జాతులు కూడా ఈ జీనస్లో ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక మానవుల పూర్వీకులు, లేదా వారికి దగ్గరి బంధువులు. హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తాలెన్సిస్ ఈ అంతరించిపోయిన జాతుల్లో ముఖ్యమైనవి. 20 లక్షల సంవత్సరాలకు కొద్దిగా ముందు, హోమో హ్యాబిలిస్ కనిపించడంతో ఈ జీనస్ ఉద్భవించింది.[1] పరాంత్రోపస్ జీనస్తో కలిసి హోమో జీనస్ బహుశా ఆస్ట్రలోపిథెకస్ జాతికి చెందిన ఎ. ఆఫ్రికానస్కు సోదరి అయి ఉంటుంది. ఆస్ట్రలోపిథెకస్ గతంలో పాన్ వంశం (చింపాంజీలు) నుండి విడిపోయింది.[2]
హోమో | |
---|---|
Scientific classification | |
Domain: | Eukaryota |
Kingdom: | జంతువు |
Phylum: | కార్డేటా |
Class: | క్షీరదాలు |
Order: | Primates |
Suborder: | Haplorhini |
Infraorder: | Simiiformes |
Family: | Hominidae |
Subfamily: | Homininae |
Tribe: | Hominini |
Genus: | Homo లిన్నేయస్, 1758 |
Type species | |
హోమో సేపియన్స్ లిన్నేయస్, 1758 | |
జాతి | |
For other species or subspecies suggested, see below. | |
Synonyms | |
Synonyms
|
హోమో ఎరెక్టస్ సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం కనిపించింది. అనేక తొలి కాలపు వలసలలో, ఇది ఆఫ్రికా (ఇక్కడ దీనిని హోమో ఎర్గాస్టర్ అని పిలుస్తారు) యురేషియా లంతటా వ్యాపించింది. ఆహార సేకరణ సమాజంలో నివసిస్తూ, నిప్పును ఉపయోగించిన తొలి మానవ జాతి ఇది. పరిస్థితులకు అనుకూలంగా తమను తాము మార్చుకుంటూ, విజయవంతంగా జీవించిన హోమో ఎరెక్టస్ జాతి, ఒక మిలియన్ సంవత్సరాలకు పైగా జీవించింది. పరిణామ క్రమంలో 500,000 సంవత్సరాల క్రితం కొత్త జాతుల లోకి మార్పు చెందుతూ కొత్త జాతులలోకి మళ్ళించబడింది.[3]
హోమో సేపియన్స్ (శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవులు) 300,000 నుండి 200,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ఉద్భవించాయి.[4] సుమారుగా అదే సమయంలో ఐరోపా, పశ్చిమ ఆసియాల్లో హోమో నియాండర్తాలెన్సిస్ ఉద్భవించింది. హెచ్. సేపియన్లు ఆఫ్రికా నుండి అనేక తరంగాలలో బయటకు విస్తరించారు. బహుశా 250,000 సంవత్సరాల క్రితం, ఖచ్చితంగా 130,000 సంవత్సరాల క్రితం మొదలై, 70-50 వేల సంవత్సరాల క్రితం జరిగినన దక్షిణాన మానవ వ్యాప్తితో,[5][6][7][8] 50,000 సంవత్సరాల క్రితం నాటి యురేషియా, ఓషియానియా లను శాశ్వత వలసలను స్థాపించే వరకూ సాగింది. ఆఫ్రికా, యురేషియాల్లో వారు పురాతన మానవులను కలుసుకున్నారు. వారితో సంపర్కం పెట్టుకుని సంకర సంతానాన్ని పొందారు.[9][10] కొన్ని పురాతన (సేపియన్స్ కానివారు) మానవ జాతులు సుమారు 40,000 సంవత్సరాల క్రితం (నియాండర్తల్ విలుప్తి) వరకు మనుగడలో ఉన్నాయని భావిస్తున్నారు. 12,000 సంవత్సరాల క్రితం వరకూ (రెడ్ డీర్ కేవ్ ప్రజలు) కొన్ని సంకర జాతులు మనుగడ సాగించాయని భావిస్తున్నారు.