![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/23/Hamaya.jpg/640px-Hamaya.jpg&w=640&q=50)
హమాయ
From Wikipedia, the free encyclopedia
బామయ అనే బాణం అదృష్టాన్ని చేకూర్చే, లేదా పవిత్ర సాధనంగాషింటో పుణ్యక్షేత్రాలు, బౌద్ధ దేవాలయాల వద్ద జపనీస్ నూతన సంవత్సరం రోజు ఇస్తారు. ఇది కొన్నిసార్లు హమా-యుమి అనే విల్లుతో పాటు జత కూడి ఉంటుంది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bc/Hama-ya%2CHama-yumi%2Ckatori-city%2CJapan.jpg/640px-Hama-ya%2CHama-yumi%2Ckatori-city%2CJapan.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/23/Hamaya.jpg/640px-Hamaya.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/dd/100_views_edo_074.jpg/640px-100_views_edo_074.jpg)
అంతే కాకుండా కొత్త ఇల్లు కట్టడం పూర్తయిన సందర్భంగా జరిగే ఉత్సవంలో(టాపింగ్ సెర్మని ) చెడు దృష్టి కి శాపంగా రాక్షస ద్వారానికి అభిముఖంగా భవనంపైన విల్లులు, బాణాలు ఏర్పాటు చేస్తారు. అంతే కాక, నవజాత శిశువులకు మొదటి పుట్టినరోజు నాడు బంధువులు, పరిచయస్తులు ఫుమా-యా లేదా ఫుమా-బో అనే విల్లులు, బాణాలు ఇవ్వడం కూడా ఆచారం.
నూతన సంవత్సరం రోజున విలువిద్యా నైపుణ్యాలను పరీక్షించడానికి నిర్వహించే "జలై" అనే కార్యక్రమంలో ఉపయోగించే విల్లు, బాణాల స్పూర్తి తో ఇది ఉద్భవించిందని చెబుతారు. "హమా" అనే పదం వాస్తవానికి కార్యక్రమంలో గురి పెట్టే లక్ష్యాన్ని సూచిస్తుంది. ఈ లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగించే బాణాలను "హమా బాణాలు" అని, విల్లుల్ని "హమా విల్లులు" అని పిలుస్తారు. "హమా" అంటే "దెయ్యం" అని అర్థం. కొత్త సంవత్సరంలో మగ పిల్లలున్న కుటుంబాలకు విల్లు, బాణాలతో కూడిన బొమ్మలను బహూకరించే ఆచారం పుట్టింది. తరువాత, వీటిని హాట్సుమోడ్స్ పుణ్య క్షేత్రం వద్ద, ఆ సంవత్సరానికి అదృష్టాన్ని కలిగించే అదృష్ట ఆకర్షణి గా ఇవ్వటం మొదలైంది.