స్విట్జర్లండ్ ప్రెసిడెంటు
From Wikipedia, the free encyclopedia
స్విస్ కాన్ఫెడరేషన్ ప్రెసిడెంటు, స్విట్జర్లాండ్ యొక్క ఏడుగురు సభ్యుల ఫెడరల్ కౌన్సిల్‌కు ప్రెసిడెంటు. దేశ కార్యనిర్వాహక శాఖకు అధిపతి. కాన్ఫెడరేషన్ ప్రెసిడెంటు అని, జనాంతికంగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంటు అని కూడా పిలుస్తారు. ఫెడరల్ అసెంబ్లీ ప్రెసిడెంటును ఒక సంవత్సర కాలానికి ఎన్నుకుంటుంది. ప్రెసిడెంటు ఫెడరల్ కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ప్రత్యేక ప్రాతినిధ్య విధులను నిర్వహిస్తారు.
స్విస్ సమాఖ్య ప్రెసిడెంటు
| |
---|---|
అధికారిక నివాసం | ఫెడరల్ ప్యాలెస్ |
కాలవ్యవధి | 1 సంవత్సరం. వెంటనే మళ్ళీ ఎన్నిక కావడానికి అనర్హులు |
ప్రారంభ హోల్డర్ | జోనాస్ ఫర్రర్ |
నిర్మాణం | 1848 నవంబరు 21 |
ఉప | ఫెడరల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంటు |
జీతం | CHF 445,163, p.a. (Approx $448,000) as of 1 జనవరి 2017[update][[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]][1] |
కాన్ఫెడరేషన్ ప్రెసిడెంటు సరిసమానుల్లో మొదటివ్యక్తి. ప్రెసిడెంటుకి మిగతా ఆరుగురు కౌన్సిలర్ల కంటే ఎక్కువ అధికారాలేమీ ఉండవు. తనకు కేటాయించిన విభాగానికి అధిపతిగానే కొనసాగుతారు. సాంప్రదాయికంగా ఈ బాధ్యతకు కౌన్సిల్ సభ్యుల్లో సీనియారిటీ ప్రకారం ఎన్నికౌతూంటారు. ఈ ఏటి ఫెడరల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంటే తరువాత సంవత్సరానికి అధ్యక్ష పదవిని చేపడతారు. దేశాధినేత అంటే సమాఖ్య ప్రెసిడెంటు కాదు, మొత్తం ఫెడరల్ కౌన్సిలంతా సామూహికంగా దేశాధిపతి.
ఫెడరల్ ప్రభుత్వానికి, ఫెడరల్ పరిపాలనకూ సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను రాజ్యాంగం నిర్వచించింది. [2] ఇందులోని ఒక అధికరణం ప్రత్యేకంగా అధ్యక్ష పదవికి సంబంధించి ఉంది.