సెలా కనుమ
From Wikipedia, the free encyclopedia
సెలా కనుమ లేదా సెలా పాస్ (సరైన మాట "సె లా". లా అంటే కనుమ అని అర్థం) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తవాంగ్, వెస్ట్ కామెంగ్ జిల్లాల మధ్య ఉన్న కనుమ (కొండల మధ్య ఉండే సన్నటి దారి). ఇది సముద్ర మట్టానికి 4,170 మీ. ఎత్తున ఉంది. తవాంగ్ పట్టణాన్నీ దిరాంగ్, బోమ్దిలా పట్టణాలనూ కలిపే కనుమ ఇది. జాతీయ రహదారి 13 ఈ కనుమ గుండా పోతుంది. ఈ కనుమలో వృక్షసంపద తక్కువగా ఉంటుంది. కనుమలో కొంత భాగం ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. కనుమ కొన వద్ద ఉన్న సెలా సరస్సు టిబెటన్ బౌద్ధమతంలో పవిత్రమైన 101 సరస్సులలో ఒకటి. శీతాకాలంలో సెలా కనుమ వద్ద భారీగా మంచు కురుస్తుంది. కొండచరియలు విరిగి పడడం వలన గానీ, మంచు వలన గానీ తాత్కాలికంగా మూసివేస్తే తప్ప, ఈ కనుమ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది.
త్వరిత వాస్తవాలు సెలా కనుమ, సముద్ర మట్టం నుండి ఎత్తు ...
సెలా కనుమ | |
---|---|
సె లా | |
సముద్ర మట్టం నుండి ఎత్తు | 4,170 metres (13,680 ft) |
ప్రదేశం | అరుణాచల్ ప్రదేశ్, భారత దేశం |
శ్రేణి | హిమాలయాలు |
Coordinates | 27°30′17″N 92°06′17″E |
మూసివేయి