![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/Sarah_Bernhardt_by_Sarony_cph.3a38656.jpg/640px-Sarah_Bernhardt_by_Sarony_cph.3a38656.jpg&w=640&q=50)
సారా బర్న్హార్డ్ట్
ఫ్రెంచ్ రంగస్థల నటి, తొలినాటి సినీనటి / From Wikipedia, the free encyclopedia
సారా బెర్న్హార్డ్ట్ (1844 అక్టోబరు 22 - 1923 మార్చి 26) ఫ్రెంచ్ నాటకరంగ నటి. 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం ప్రారంభంలో అలెగ్జాండర్ డుమాస్ ఫిల్స్ రచించిన లా డామ్ ఆక్స్ కామెలియాస్ నాటకంతోసహా విక్టర్ హ్యూగో రచించిన రూయ్ బ్లాస్, విక్టోరియన్ సర్డౌ రచించిన ఫెడోరా, లా టోస్కా, ఎడ్మండ్ రోస్టాండ్ రచించిన ఎల్'ఐగ్లోన్ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని ఫ్రెంచ్ నాటకాలలో నటించింది. షేక్స్పియర్ రాసిన హామ్లెట్ తోసహా ఇతర నాటకాలలో పురుష పాత్రలను కూడా పోషించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక నాటక ప్రదర్శనలు చేసింది. సౌండ్ రికార్డింగ్లు చేసిన, సినిమాలలో నటించిన మొదటి ప్రముఖ నటీమణులలో ఒకరు.
త్వరిత వాస్తవాలు సారా బర్న్హార్డ్ట్, జననం ...
మూసివేయి