శ్రీ సరస్వతీ క్షేత్రము (హిందీ: श्री सरस्वती क्षेत्रमु) తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట డివిజన్ కు చెందిన చిన్న కోడూర్ సమీప ంలోని "అనంతసాగర్" వద్ద గల హిందూ దేవాలయం.[1]

త్వరిత వాస్తవాలు శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్, భౌగోళికాంశాలు: ...
శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్
Thumb
Thumb
శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్
శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్
తెలంగాణలో స్థానం
భౌగోళికాంశాలు:18°12′21″N 78°59′17″E
పేరు
స్థానిక పేరు:శ్రీ సరస్వతీ క్షేత్రము,అనంతసాగర్, మెదక్ జిల్లా
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సిద్దిపేట జిల్లా
ప్రదేశం:అనంతసాగర్, సిద్దిపేట డివిజన్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:సరస్వతి
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
మే 2,1980
నిర్మాత:శ్రీ అష్టకాల నరసింహ రామ శర్మ (అష్టావధాని)
మూసివేయి

ఇచటి ప్రధాన దైవము సరస్వతి. ఈ ఆలయ శంకుష్టాపన[మే 2]] 1980 నl రౌద్రినామ సంవత్సరం వైశాఖ మాసంలో ప్రముఖ అష్టావధాని అయిన అష్టకాల నరసింహరామశర్మ, 31 జనవరి 1990 మాఘశుద్ధ పంచమి రోజున ప్రతిష్ట జరుపబడింది. ఈ దేవాలయం సిద్దిపేట నుండి కరీంనగర్ మధ్యలో కొలువై ఉంది. ఇది హైదరాబాదు నుండి 125 కి.మీ దూరంలోనూ, మెదక్ నుండి 63 కి.మీ దూరం లోనూ ఉంది.

Thumb
ఆలయ ముఖ దృశ్యం

ఆలయ చరిత్ర

ఈ దేవాలయం అష్టావధాని అష్టకళ నరసింహ రామ శర్మ చే నిర్మింపబడింది.అతను ఉపాధ్యాయినిగా పనిచేసారు.అతను ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించారు,అతను వాస్తుశాస్త్ర, జ్యోతిష నిపుణులు అయినందున అతని జీతభత్యములతో కూడా ఈ ఆలయం నిర్మాణంనకు ఖర్పు చేశారు. భారత దేశంలో సరస్వతి ఆలయాలు అరుదుగా ఉంటాయి. మొదటి సరస్వతి దేవాలయం భారత దేశంలోని వైష్ణవి దేవాలయం. ఇది జమ్మూ, కాశ్మీరు రాష్ట్రంలో ఉంది. రెండవ ఆలయం బాసరలో ఉంది. ఈ దేవాలయం మూడవ దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం అనంతసాగర్ గ్రామంలో శివారు కొండలపై ఉంది. ఈ దేవాలయం సరస్వతి విగ్రహం సరస్వతి దేవి నిలుచున్న భంగిమలో గల ప్రసిద్ధ దేవాలయం.

పండుగలు

సరస్వతి పూజ వైదిక కాలెండరు ప్రకారం మాఘ మాసంలో ఐదవ రోజున జరుపుతారు. (ఈ రోజును వసంత పంచమి అని కూడా అంటారు.)

భారత దేశంలో అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా దక్షిణాదిన సరస్వతీ పూజలను నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరుపుతారు. సరస్వతి దేవిని శక్తి యొక్క రూపంగా నవరాత్రి ఉత్సవాలలో 9 వ రోజున జరుపుతారు. నవరాత్రిలో ఆఖరి మూడురోజులు దేవతకు అంకితం చేస్తారు. నవరాత్రులలో పదవ రోజు మహార్నవమి. ఈ రోజును శరత్ నవరాత్రి అంటారు. ఈ రోజున పుస్తకాలు, సంగీత వాద్యాలు సరస్వతి దేవి ముందు ఉంచి సరస్వతి దేవిని కొలుస్తారు. ఈ నవరాత్రి ఉత్సవం పదవరోజు జరిగే విజయదశమి రోజుతో ముగుస్తుంది.

సరస్వతి దేవాలయాలు

సరస్వతి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలోకొన్ని,

  • సరళ దేవాలయం, జంఖడ్, కటక్ జిల్లా, ఒడిషా
  • సరస్వతి దేవాలయం, బాసర, తెలంగాణ
  • వర్గల్ సరస్వతి దేవి ఆలయం.
  • శృంగేరి సరస్వతి దేవాలయం, చిక్‌మగళూర్ జిల్లా, కర్ణాటక.
  • పుష్కర్, ఆజ్మీర్ జిల్లా, రాజస్థాన్.
  • తిరువారూర్, తిరువారూర్ జిల్లా, కేరళ,
  • సరస్వతి అమ్మన్, తిరునెల్వెల్లి, తమిళనాడు.
  • శారదా పీఠం, జమ్మూ, కాశ్మీర్.
  • భద్రకాళి దేవాలయం, నేపాల్,

ఇవి కూడా చూడండి

  • ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ , పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ. శ్రీ సరస్వతి క్షేత్రము తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట డివిజన్ కు చెందిన చిన్న కోడూర్ సమీప ంలోని "అనంతసాగర్" వద్ద గల హిందూ దేవాలయం. ఇచటి ప్రధాన దైవము సరస్వతి. దీనిని మే 2 1980 న రౌద్రినామ సంవత్సరం వైశాఖ మాసంలో ప్రముఖ అష్టావధాని అయిన అష్టకాల నరసింహరామశర్మనిర్మించారు. ఈ దేవాలయం సిద్దిపేట నుండి కరీం నగర్ మధ్యలో కొలువై ఉంది. ఇది హైదరాబాదు నుండి 125 కి.మీ దూరంలోనూ, మెదక్ నుండి 63 కి.మీ దూరం లోనూ ఉంది.సకల భారత దేశమునందు సరస్వతి దేవాలయాలు చాల తక్కువ అంటే ఇప్పటికి కాశ్మిర్ రాష్ట్రములో కాట్రా అనుచోటికి 14 కి. మీ. ఉన్న వైష్టవి దేవి గుహాలయముమొధతిథి. రెండవది తెలంగాణ లో ఆదిలాబాద్ జిల్లా  లో భారస క్షత్రం. మూడవది అయిన దేవాలయం తెలంగాణాలో సిద్ధిపేట జిల్లా లో అనంతసాగర్ గ్రామం. శివార్లో నిర్మాణమైనది ఇచ్చట శ్రీ సరస్వతి మూర్తి నిలుచునియున్నవినాపుస్తక జపమాలదారిని. ఈ మూర్తిగల  దేవాలయము దేశములోనే మొదటిదగుట మన తెలంగాణవాలూ అదృష్టం. శ్వేతాచలం ఈస్థలం అనంతసాగర్ గ్రామా శివారు కొండలో కలదు.హైదరాబాదా - కరీంనగర్ రాజీవ్ రహదారిపై  సిద్ధిపేటకు 20 కి .మీ దూరమునగల శనిగరం బస్ స్టేజి 2 కి. మీ దూరముగా పడమరగా గల రాగిదోనెలు అనుచోట గలదు ఇచ్చటి ప్రకృతి అందమైన చెట్లుతో అడవితో కూడిన సుందరమైన కొండ పరిసరాలు,లోయ ,చెరువు ప్రక్కన యుండి ఉభయ సంద్యలయందు  కాశ్మిర్ ప్రకృతిని తలపించును .ఇక్కడ రాగిదోనెలు అనుపేరులు 8 గుహలు అష్ట తీర్ధములుగానున్నవి. కొన్నిప్రకృతి వైపరీత్యాములతో కూలిపోగా రాగిదోన,పాలడోనా , చీకటిదొన పేరుతో ౩ గుహలు మాత్రం అక్షయ జలముతో నున్నవి.ఇక్కడ స్నామ్మోచన దీర్గ్ రోగములు పోవుట మాటలురానిచిన్నపిల్లలకు మాటలు వస్తాయని ఈ క్కడ వచ్చిన కొంతమంది భోక్తులు విశ్వాసం ఆలయావరణం విశాలమైన పచ్చటి వాతావరణం చేకూడిఉంటుంది  ఆలయ ముఖ విమాన దొరము చేలా ఎత్తయిన గాలిగోపురం సుందరముగా ఉంటుంది చదువులమ్మ తల్లి ఈ క్కడకివచ్చి అక్షరాభ్యాసం కోసం చేలా దూర ప్రాంతాలుంనుండు ఈ క్కడకివస్తుంటాలు అమ్మవారి విశిష్టత చాల అద్భుతంగ ఉంటుంది ఈ ఆలయం ఒక్కసారి దర్శిచితేచాలు సకలసుఖాలు కలుగుతాయని ఈ ప్రాంతంవారి ప్రగాఢ విశ్వాసం 

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.