From Wikipedia, the free encyclopedia
శోభనా సమర్థ్ (1916 నవంబరు 17 - 2000 ఫిబ్రవరి 9) భారతీయ నటి, దర్శకురాలు, నిర్మాత. ఆమె టాకీ సినిమాల రోజులలో తన కెరీర్ ని ప్రారంభించింది. 1950లలో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రధాన పాత్రలతో ఆమె మెప్పించింది.
శోభన సమర్థ్ | |
---|---|
జననం | సరోజ్ శిలోత్రి 1916 నవంబరు 17 |
మరణం | 2000 ఫిబ్రవరి 9 83) | (వయసు
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటి, దర్శకురాలు, నిర్మాత |
జీవిత భాగస్వామి | కుమార్‌సేన్ సమర్థ్ |
భాగస్వామి | మోతీలాల్ |
పిల్లలు | 4; నూతన్, తనూజ సహా |
తల్లిదండ్రులు |
|
బంధువులు | ముఖర్జీ-సమర్థ్ కుటుంబం |
ఆమె మొదటగా మరాఠీ చిత్రసీమలో అడుగుపెట్టింది. తన మొదటి హిందీ చిత్రం నిగహెన్ నఫ్రత్ 1935లో విడుదలైంది. 1943లో రామ్ రాజ్య చిత్రంలో సీత పాత్ర పోషించి అందరికి చిరకాలం గుర్తుండిపోయింది. ఆమె కళలకు చేసిన కృషికి 1997లో ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డుతో సత్కరించింది.
ఆమె కుమార్తెలు నూతన్, తనూజ కెరీర్‌ను ప్రారంభించిన జంట చిత్రాలకు స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించింది శోభన సమర్థ్.[1]
ముంబైకి చెందిన దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కుమార్‌సేన్ సమర్థ్‌ను శోభన వివాహం చేసుకుంది. వారికి నూతన్, తనూజ, చతుర అనే ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు జైదీప్ ఉన్నారు. అయితే ఈ జంట స్నేహపూర్వకంగా విడిపోయారు. ఆ తరువాత నటుడు మోతీలాల్ రాజ్‌వంశ్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడింది.[2][3]
ఆమె ఇద్దరు కుమార్తెలు నూతన్, తనూజ కూడా నటీమణులు అయ్యారు. ఆమె మరో కుమార్తె చతుర కళాకారిణి. ఆమె కుమారుడు జైదీప్ ప్రకటనల చిత్ర నిర్మాత.
నూతన్ కుమారుడు మోహ్నీష్ బహల్ కూడా నటుడే, అలాగే తనూజా కుమార్తెలు కాజోల్, తనీషా ముఖర్జీ కూడా నటనారంగంలోనే ఉన్నారు. నటుడు అజయ్ దేవగన్‌ను కాజోల్ వివాహం చేసుకుంది. తనూజ భారతీయ దర్శకుడు, రచయిత, నిర్మాత కూడా అయిన షోము ముఖర్జీని వివాహం చేసుకుంది.[4] 2000లో క్యాన్సర్‌తో శోభన సమర్థ్ మరణించింది.[5]
విలాసి ఈశ్వర్ (1935) |
నిగా-ఎ-నఫ్రత్ (1935) |
దో దివానే (1936) |
కోకిల (1937) |
పతి పత్ని (1939) |
అప్ని నగరియ (1940) |
సవేరా (1942) |
విజయ లక్ష్మి (1943) |
రామరాజ్య (1943) |
నౌకర్ (1943) |
మహాసతి అనసూయ (1943) |
వీర్ కునాల్ (1945) |
తారామతి (1945) |
షాకర్ (1947) |
సతి తోరల్ (1947) |
మాలిక (1947) |
రాంబన్ (1948) |
నరసింహ అవతార్ (1949) |
హమారీ బేటీ (1950) |
రామజన్మ (1951) |
ఇన్సానియత్ (1955) |
లవ్ ఇన్ సిమ్లా (1960) |
ఛలియా (1960) |
చిత్రలేఖ (1964) |
నై ఉమర్ కీ నై ఫసల్ (1965) |
వహన్ కే లాగ్ (1967) |
ఏక్ బార్ మూస్కురా దో (1972) |
దో చోర్ (1972) |
పాణితీరత వీడు (1973) |
ఘర్ ద్వార్ (1985) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.