బోర్లా పడుకొని రెండు కాళ్ళను దగ్గరగా రెండు చేతులను తొడల క్రింద ఉంచాలి.
గడ్డం నేలపై ఆనించి, కొద్దిగా శ్వాస పీల్చి మొదట కుడికాలును మోకాలు వంచకుండా పైకి ఎత్తాలి.
ఈ స్థితిలో కొన్ని క్షణాలున్న తర్వాత మెల్లగా కాలు నేలపై ఆనించాలి.
ఇదే విధంగా ఎడమకాలితో చేయాలి.
మూడేసి సార్లు ఒక్కొక్క కాలితో చేసిన తర్వాత, రెండు కాళ్ళను కలిపి ఒకేసారి పైకి ఎత్తి కొద్ది క్షణాలు ఆగాలి. తర్వాత మెల్లగా క్రిందికి దించాలి. ఈ రకంగా మూడుసార్లు చేయాలి.
శలభాసనం పొట్టకు, తుంటి భాగానికి, కాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. నడుము సన్నబడుతుంది. ఈ శలభాసనం అభ్యసనం చేయడం వల్ల క్రమంగా నడుముల్లో పేరుకు పోయిన చేడువాయువులు, కొవ్వు కరిగి పోయి నడుమునొప్పి తగ్గిపోతుంది, నడుములోని వెన్నుపూసలు బలపడతాయి, స్లిప్ డిస్క్ సమస్యలు తీరిపోతాయి, గ్రధ్రసీ వాతపు(సియటికా)నొప్పులు తగ్గుతాయి. తోడలలోని కొవ్వు కూడా కరుగుతుంది, స్త్రీలకు ప్రసవించిన తరువాత జారిపోయిన పొట్టలోని కొవ్వు కరిగిపోయి తిరిగి పొట్ట నడుము సన్నగా తాయారు అవుతాయి.[3]