వికీపీడియా:సంరక్షణ విధానం
From Wikipedia, the free encyclopedia
కొన్ని సందర్భాల్లో పేజీలలో మార్పులు జరగకుండా సంరక్షించాల్సి ఉంటుంది. వికీపీడియా సూత్రమేమిటంటే ఎవరైనా ఏ విషయం గురించైనా మార్పులూ, చేర్పులూ చేసే అవకాశాన్ని కల్పించడం. దానికనుగుణంగా వీలైనన్ని పేజీలను వాడుకరులందరికీ దిద్దుబాట్లు చేసే అవకాశాన్నివ్వడం వికీ లక్ష్యం. ఐతే కొన్నిసార్లు పేజీలు చెడగొట్టబడుతూ ఉండి, నిరోధం వంటి చర్యలతో కూడా వాటిని సంతృప్తికరంగా నిర్వహించడం కుదరకుంటే, వాటిని సంరక్షించవలసి ఉంటుంది. ఈ విధాన వ్యాసంలో వివిధ సంరక్షణా స్థాయులూ, పద్ధతులూ, ఎప్పుడు సంరక్షించాలనే విషయాలూ వివరించడమైనది.
తెలుగు వికీపీడియా విధానాల్లో ఒకదాన్ని ఈ పేజీ అక్షరబద్ధం చేస్తోంది. వాడుకరులందరూ అనుసరించి తీరాల్సిన విధానాన్ని ఇది వివరిస్తుంది. దీనిలో మార్పులేమైనా చెయ్యాలంటే, వాటికి విస్తృత ఆమోదం (కన్సెన్సస్) ఆవశ్యకం. |
ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: అందరూ సవరించేందుకు వీలయ్యేలా ఉండడం వికీపీడియా సూత్రమైనప్పటికీ కొన్నిసార్లు దుశ్చర్యలనూ, సవరణల పోరాటాలనూ, మరికొన్ని అనవసరపు సవరణలనూ ఆపడానికి కొన్ని పేజీలలో జరగగల దిద్దుబాట్లపై పరిమితులు విధించాల్సి ఉంటుంది. |
పేజీలో దిద్దుబాట్లు చెయ్యకుండా, బొమ్మలను మార్చకుండా, లేదా తరలించకుండా సంరక్షించే అధికారం నిర్వాహకులకు ఉంది. ఈ అధికారాలను పరిమితంగా వాడాలి; ఎందుకంటే సంరక్షిత పేజీలు హానికారకము కనుక.
సంరక్షణ సంబంధిత పరిమితులను శాశ్వతంగా అమలుచేయవచ్చు లేదా పరిమిత కాలం పాటు అమలు చేయవచ్చు. ఒక పేజీ సంరక్షించబడుతున్నప్పటికీ, దాని సోర్సు కోడ్ను ఎవరైనా చూడొచ్చూ, వాడుకోవచ్చూ.
సంరక్షించబడ్డ పేజీ పైన కుడి పక్కన ఒక చిన్న తాళంకప్ప కనిపిస్తుంది. దీన్ని {{pp-protected}}
మూస వాడి చేర్చవచ్చు.
నిర్వాహకులు కానివారు సంరక్షిత పేజీలలో మార్పులు చెయ్యదలిస్తే, ఆ మార్పులను సంబంధిత చర్చ పేజీలో ప్రతిపాదించాలి.