వికీపీడియా:విజువల్ ఎడిటర్/యూజర్ గైడ్
From Wikipedia, the free encyclopedia
విజువల్ ఎడిటరు అనేది తెలుగు వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేందుకు అందుబాటులో ఉన్న రెండు ఉపకరణాల్లో ఒకటి. వికీటెక్స్ట్ ఎడిటరు అనేది రెండవది. వికీటెక్స్ట్ ఎడిటరు కంటే విజువల్ ఎడిటరు కొత్తది, ఆధునికమైనది, వాడటానికి తేలికైనది. వికీటెక్స్ట్ ఎడిటరును వాడాలంటే వికీటెక్స్ట్ మార్కప్ నేర్చుకోవాల్సి ఉంటుంది. విజువల్ ఎడిటరును వాడేందుకు వికీటెక్స్ట్ మార్కప్ నేర్చుకోవలసిన అవసరం లేదు. దిద్దుబాటు చేసిన వచనాన్ని విజువల్ ఎడిటరు ఉన్నదున్నట్టుగా చూపిస్తుంది. ప్రచురించాక ఎలా ఉంటుందో, దిద్దుబాటు చేస్తూండగానే అలా చూపిస్తుంది. ఈ గైడు, విజువల్ ఎడిటరు విశేషాలను బొమ్మలతో, ఒక్కో అడుగే వేస్తూ చూపిస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో, ఉపకరణం లోకి తాజాగా చేర్చిన సరికొత్త అంశాలను చూపించక పోవచ్చు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/12/VisualEditor-logo.svg/640px-VisualEditor-logo.svg.png)
- Main page
- Feedback page (or at MediaWiki)
- Sandbox (no account required)
- Introductory tutorial
- Why are the developers building this?
- User Test Data
- Documentation:
- User guide
- Keyboard shortcuts
- Frequently Asked Questions (or at MediaWiki)
- Development:
- Roadmap
- Updates
- Weekly status reports
- Workshops:
- Update the help pages
- Add TemplateData (Tutorial)
- Customization
- Known problems
- Requests for Comments (RfCs): Jul 2013 a, Jul 2013 b, Jul 2015, Sep 2015
ప్రచురితమై ఉన్న వ్యాసాలను చెడగొట్టకుండా విజువల్ ఎడిటరు పనితీరును చూడాలనుకుంటే, ఈ ప్రయోగశాలలో దాన్ని పరీక్షించవచ్చు. ఆ పేజీలో విజువల్ ఎడిటరు ఉపయోగించడానికి మీకు ఖాతా అవసరం లేదు.
పరిచయ పాఠాలు కూడా అందుబాటులో ఉన్నాయి.విజువల్ ఎడిటరు ఇంకా అభివృద్ధి దశ లోనే ఉంది. అందువల్ల దీనిలో కొన్ని పరిమితులు, దోషాలూ ఉండవచ్చు. ఉదాహరణకు, పెద్ద పేజీలను దిద్దుబాటు చేసే విషయంలో విజువల్ ఎడిటరు, వికీటెక్స్ట్ కంటే నెమ్మదిగా ఉంటుంది. విజువల్ ఎడిటరు అభివృద్ధిలో ఉండగా, అది చేసిన దిద్దుబాట్లు మీరు ఉద్దేశించిన విధంగానే ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మీ మార్పులను సమీక్షించుకుంటూ ఉండాలి.
విజువల్ ఎడిటరు వాడకంలో మీకు ఎదురైన సమస్యలు, వ్యాఖ్యలు, సలహాలను మీ అభిప్రాయాలు పేజీలో స్వాగతిస్తున్నాము. (ఒక గమనిక: 2017 చివరలో అన్ని మార్పులను సేవ్ చేయండి, పేజీని సేవ్ చేయండి అనే రెండు బొత్తాల పేర్లను మార్పులను ప్రచురించండి, పేజీని ప్రచురించండి అని మార్చాం. )