From Wikipedia, the free encyclopedia
← పాత చర్చ 1 | పాత చర్చ 2 | పాత చర్చ 3 →
1, 2, 3 |
తెవికిలో ఉన్న Transliteratorని ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కూడా enable/disale చేసుకోవచ్చు. ఇంతకుమునుపు ఉన్న javascriptలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరుకు ఆ సదుపాయాన్ని నిరోధించారు, ఇప్పుడు దానిని సరి చేసాను. ie-6లో పరీక్షించాను బాగానే పని చేస్తుంది. ie-7లో ఎవరయినా ఒక సారి పరీక్షించగలరు. పరీక్షించే ముందు మీ బ్రౌజరు కాషేను ఒక సారి తొలగించి, వికీపీడియా పేజీని ctrl+f5 ఉపయోగించి refresh చేయగలరు. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 10:14, 22 జూన్ 2007 (UTC)
వికీపీడియాలో సెర్చ్ఎలా పని చేస్తుందో అయోమయంగా ఉంది. మొన్నొక రోజు ఈమాట కోసం గుంటూరు శేషేంద్ర శర్మ ని వెతకడానికి 'గుంటూరు కోసం వెతికితే తిన్నగా గుంటూరు పేజీ వచ్చింది. వికీ సెర్చి బహుశా title లో ఉన్నదానికి ప్రాధాన్యత ఇస్తుంది అనుకుంటాను. కానీ 'గుంటూరు' search రిజల్ట్స్ పేజీ చూపి ఉంటే అందులోంచి శేషేంద్ర శర్మ పేజీకి వెళ్ళచ్చు. శేషేంద్ర కోసం వెతికినా వచ్చే రిజల్ట్స్ పేజీలో గుంటూరు శేషేంద్ర శర్మ పేజీ ఉండదు. శేషేంద్ర శర్మ పేరు ఉండే మరొక పేజీని చూపుతుంది. 'ముత్యాల ముగ్గు' వగైరా. అక్కడి నించి శేషేంద్ర శర్మ పేజీకి వెళ్ళాలి.ఇంగ్లీషు వికీ లో Bush కోసం వెతికితే తిన్నగా President Bush పేజీకి వెళ్ళదు. ఒక అయోమయ నివృత్తి పేజీ లాంటి దానికి వెళుతుంది. ఇలా తెలుగు వికీపీడియాలో ఎందుకు జరగదు? దీనిని వికీకారులు ఎవరైనా వివరించగలరా? లేదా బాగు చేయదగినది, చేయవలసినది అయితే బాగు చెయ్యగలరా? ధన్యవాదాలు. -- పద్మ ఇం. తా.కా. అన్ని టెక్ష్ట్స్ బాక్సుల్లోనూ తెలుగు లో టైపు చేయగలిగే సౌకర్యం ఎందుకు లేదు? ఉదాహరణకి దీనిపైన ఉన్న 'విషయం/శీర్షిక బాక్సులో తెలుగు సౌకర్యం లేదు. ఇది బగ్గా? ఫీచరా? :-)
ఇంగ్లీషు తెలుగు మార్పు చేసే చెక్ బాక్సు పక్కన ఉండే టెక్స్ట్ ని label tagలో wrap చేస్తే క్లిక్ చేయడం తెలిక. ఈ పేజీలో 'విషయం/శీర్షిక' అన్న మాటలని label tag లో wrap చేసినందువల్ల టెక్స్ట్ బాక్స్ లోనే కాక లేబులు మీద క్లిక్ ఛేసినా టెక్స్ట్ బాక్స్ కి ఫోకస్ వస్తోంది. ఇలా ముఖ్యంగా checkboxes, radio buttons ఉన్నచోట్ల చేస్తే బావుంటుంది. -- పద్మ ఇం.
this is giving lot of problems now a days as i type in edit boxes in wikipedia, i dont know about other members regarding this , may be it would not be problem if type in lekhini and paste here i am giving example here what is happenning, this problem is new not there few days back... example:
నేను కొన్ని SVG ఫైళ్ళలో ఆంగ్లములో ఉండే టెక్స్ట్‌ను తొలగించి దాని స్థానములో ఇంక్స్పేసు ఉపయోగించి తెలుగు టెక్స్ట్ చేర్చి సేవ్ చేస్తే ఇంక్స్పేసు వరకు బాగానే కనిపిస్తుంది కానీ ఇక్కడ అప్లోడ్ చేస్తే తెలుగు టెక్స్ట్ ఉన్న స్థానములో ఖాళీగా కనిపిస్తున్నాయి ఆ బొమ్మలు. ఎందుకిలా జరుగుతుంది. నేనేదైనా తప్పు చేస్తున్నానా లేకపోతే మీడియావికీలో తెలుగుకు ఎస్వీజీ మద్దతు లేదా? నా దగ్గర ఫ్రీహాండ్ ఉంది కాని అది యూనీకోడ్ కు మద్దతునివ్వట్లేదు. ఇంకా ఏమైనా వెక్టర్ గ్రాఫిక్స్‌లో తెలుగును సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్లు ఉన్నాయా? నేను ప్రయత్నించిన కొన్ని బొమ్మలలో ఇది ఒకటి బొమ్మ:Distancedisplacement-te.svg. --వైజాసత్య 00:46, 6 ఆగష్టు 2007 (UTC)
ఎడిట్ పెట్టెలో ఉన్న లిప్యాంతరీకరణ సౌకర్యంలో ఒక చిన్న లోపం కనబడింది.. భృ (bhR భృతి లో) ని రాయలేకపోతున్నాం. ఒకసారి పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 15:31, 27 అక్టోబర్ 2007 (UTC)
రసాయనశాస్త్రం లో రెండు రకాల formuals వాడతాం కదా. Methane ని CH4 అని రాయవచ్చు లేదా C కి నాలుగు పక్కలా నాలుగు చిన్న గీతలు గీసి ఆ గీతల పక్కని ఒకొక్క H రాయ వచ్చు. ఈ రెండో పద్దతిని నిర్మాణక్రమం అంటారు. యూనీకోడ్లో రాసేటప్పుడు ఈ నిర్మాణక్రమాలు రాయటం ఎలాగో తెలిస్తే రసాయన శాస్త్రపు విషయాలు కొన్ని నేను రాయగలను. తెలిసిన వారు చెప్పగలరు. Vemurione 01:20, 30 ఏప్రిల్ 2008 (UTC)
ఈ మధ్య sidebarలో తరచుగా "సహాయము" డబ్బా ఎగిరిపోవటం గమనించాను. అలాగే "మార్గదర్శకము" డబ్బాలో "విరాళములు"కు బదులుగా Donate అని వచ్చేస్తుంది. మీడియావికీ:Sidebar అనే పేజీని purge చేస్తుంటే మళ్లీ మామూలుగా వచ్చేస్తుంది. దీనికి కారణం బేటావికీ నుండి మీడియావికీ నేంస్పేసు ట్యాగులు ఎప్పటికప్పుడు తాజాకరించడం వలన అయ్యుండవచ్చని అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ ఉన్న వాక్యాలనే అక్కడ కూడా చేర్చేసాను. కానీ పూర్తి కారణాలు ఇంకా తెలియటం లేదు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 07:58, 2 మే 2008 (UTC)
ఈ మధ్య నేను వికిపీడియా మొదటి పేజీని ముద్రించితే వ్యాసం పేజీ ఒక లైనుకి తరువాత లైనుకి సరిపోయినంత ఖాళీ లేకుండాముద్రించబడింది. స్వాగతం పేజీ సరిగా ముద్రించబడింది. పరికించి చూస్తే తెర పైనకూడా, వత్తు లేక గుణింతం అక్షరాలు రెండు లైనులలో దగ్గరగా వున్నపుడు సరిపోయినంత ఖాళీ లేదనిపించిది. మీరేమంటారు?--అర్జున 17:52, 25 సెప్టెంబర్ 2008 (UTC)
ఇంటర్నెట్ చక్కగా ఉపయొగించుకొవడం గురించి మీరెవరైనా చక్కని వివరంచగలరు
మీకు తెలుసా, ఇప్పుడు దారిమార్పు పేజీలకి #దారిమార్పు
అన్న సంకేతాన్ని వాడవచ్చని? నేను #దారిమార్పుని వాడుతూ రెండు మార్పులు చేసాను. చూడండి. —వీవెన్ 14:41, 22 జూన్ 2009 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
మరొక ప్రకటనను చూపించు లింకు వాడుకరి పేజీలనుండి ఉదా: వాడుకరి: Arjunaraoc రెండు కంటే ఎక్కువ సార్లు పనిచేయటం లేదు.అర్జున 07:21, 27 మే 2010 (UTC)
తెవికి గాలింపు వేరే పద్దతిలో వుంది. ఆంగ్ల వికిలో "Infobox desease" అని వెతికితే ఫలితాలు(results) చాల చూపించింది, అదే తెవికి మాత్రం ఎలాంటి ఫలితాలు లేవు. తెవికి లో "Infobox Desease" పేరుతో వ్యాసము వునప్పటికి, సున్నా ఫలితాలను చూపుతుంది, బహుశ తెవికి గాలింపు పద్దతి Case Sensitive కావచు. ఈ లోటు పురించమని నా మనవి.--Ranjithsutari 11:51, 22 సెప్టెంబర్ 2010 (UTC)
Seamless Wikipedia browsing. On steroids.