From Wikipedia, the free encyclopedia
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2019 జూన్ 7 - 2019 ఆగస్టు 30
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
← పాత చర్చ 66 | పాత చర్చ 67 | పాత చర్చ 68 →
కొన్ని రాజాకీయ కారణాల వలన వై.వి.సుబ్బారెడ్డి వ్యాసాన్ని, ముఖ్యంగా మతం భాగాన్ని మార్చాలని పలువురు అజ్ఞాత వాడుకరులు ప్రయత్నించారు. వారు చేసిన మార్పుల్లో అనవసరపు మార్పులను తొలగించి పేజీని రెండు వారాల పాటు, నమోదైన వాడుకరులు మాత్రమే మార్చే విధంగా సంరక్షణలో చేర్చాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:00, 6 జూన్ 2019 (UTC)
వ్యక్తుల పేజీల వర్గాలను క్రమబద్ధీకరించే ప్రాజెక్టులో భాగంగా కొంత పని జరిగింది. ఒక పాతిక శాతం పనిగా దీన్ని చెప్పుకోవచ్చు. దీని గురించి ప్రాజెక్టు చర్చా పేజీలో ఒక చర్చ మొదలైంది. వాడుకరులు ఈ చర్చలో పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలను చెప్పవలసినదిగా మనవి. __చదువరి (చర్చ • రచనలు) 05:19, 7 జూన్ 2019 (UTC)
వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు ప్రాజెక్టు తొలిసారిగా చేపట్టి చేసిన తొలి దశ పనులు కొలిక్కి చేరుకుంటున్నాయి. ప్రాజెక్టు పేజీలో ఇచ్చిన ఉదాహరణలననుసరించి, మీరు పనిచేసే వ్యాసాలలో తగు పటములు చేర్చి తెవికీలో OSM పటముల విస్తరణకు సహకరించమని కోరుతున్నాను.
ఈ ప్రాజెక్టు పై మీ స్పందనలు, ముందు కృషికి సూచనలు ఇక్కడ కానీ, ప్రాజెక్టు చర్చా పేజీలో కానీ చేర్చమని మనవి. --అర్జున (చర్చ) 04:49, 13 జూన్ 2019 (UTC)
గత ఏడాది నేను సీఐఎస్-ఎ2కె కమ్యూనిటీ అడ్వొకేట్ హోదాలో చేసిన పనులను వివరిస్తూ, స్వచ్ఛందంగా చేసిన పనులను విడిగా చూపుతూ నేను ఇక్కడ రాశాను. దయచేసి గమనించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:56, 13 జూన్ 2019 (UTC)
తెవికీలో మిగతా అన్ని రంగాల వ్యాసాలకన్నా ఎక్కువుగా వ్యక్తుల జీవిత చరిత్ర వ్యాసాలు సృష్టింపు జరుగుచున్నసంగతి మనందరికి తెలుసు. నాకు తెలిసినంతవరకు వీటికి సరియైన సూచనలుగాని, మార్గదర్శకాలుకాని తెవికీలో ఏమి లేవనుకుంటున్నాను. ముఖ్యంగా కొన్ని జీవితచరిత్ర వ్యాసాలలో నేను గమనించిన ప్రకారం ఉండవలసినన కనీస సమాచారం అనగా జన్మస్థలం, జన్మించిన తేది, చనిపోయిన పక్షంలో మరణించిన తేది వివరాలు, మరికొన్ని అసంపుర్తిగా ఉంటున్నాయి.జన్మించిన తేది కొంత మందికి లభ్యం కాకపోనచ్చు.కనీసం సంవత్సరం కూడా ఉండుటలేదు.కొన్ని వ్యాసాలకు జిల్లా మాత్రమే తెలుపుచున్నారు. కొన్ని వ్యాసాలకు ఆసలు ఆవివరాలు ఏమీ ఉండుటలేదు. గ్రామం వివరం లేకపోతే పునర్య్వస్థీకరణ జరిగినప్పుడు ఆ జిల్లా సరియైన జిల్లా కాకపోవచ్చు. గ్రామం పేరు లేకపోతే జిల్లా తెలుసుకోవటం సాధ్యపడేపనికాదు. గ్రామం, మండలం, జిల్లా వివరాలు పూర్తిగా రాస్తేనే ఆ వ్యాసం ఏ వర్గంలోకి చేరాలి అనేది తెలుస్తుంది. ”హమ్మయ్య రాసాం” అనే పద్దతిలో కాకుండా, ఉండవలసిన కనీస వివరాలతో వ్యాసాలు రాయాలని మన గౌరవ వికీపీడియన్లను కోరుచున్నాను. అందులో మచ్చుకు కొన్ని వ్యాసాలు
ఇదే సమయంలో జీవిత చరిత్ర వ్యాసాలకు సృష్టింపు, అభివృద్ధికి అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు తయారుచేయుటకు గౌరవ వికీపీడియన్స్ వారి వారి అబిప్రాయాలు, సూచనలుపై స్పందించవలసినదిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 18:57, 14 జూన్ 2019 (UTC)
తొలిసారిగా వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు ప్రాజెక్టు రూపంలో నిర్వహించి 2019, 2018 ఎన్నికలకు సంబంధించిన పేజీలను అభివృద్ధి చేయటానికి ప్రయత్నించడం జరిగింది. కేవలం ఇద్దరూ మాత్రమే నమోదు చేసుకోని పనిచేయటంతో ఇంకా కొంత పని చేయవలసివుంది. దానిని పూర్తి చేయడానికి సహకరించండి. ఆలాగే ఈ ప్రాజెక్టు పై సూచనలు, అభిప్రాయాలు ఇక్కడ కాని, ప్రాజెక్టు చర్చాపేజీ లో కాని చేర్చమని మనవి. --అర్జున (చర్చ) 06:31, 15 జూన్ 2019 (UTC)
Hello fellow Wikimedians,
Apologies for writing in English. Please help me in translating this message to your language.
I am delighted to share a survey that will help us in the building a comprehensive list of campaigns and contests organized by the Indic communities on various Wikimedia projects like Wikimedia Commons, Wikisource, Wikipedia, Wikidata etc. We also want to learn what's working in them and what are the areas that needs more support.
If you have organized or participated in any campaign or contest (such as Wiki Loves Monuments type Commons contest, Wikisource Proofreading Contest, Wikidata labelathons, 1lib1ref campaigns etc.), we would like to hear from you.
You can read the Privacy Policy for the Survey here
Please find the link to the Survey at: https://forms. gle/eDWQN5UxTBC9TYB1A
P.S. If you have been involved in multiple campaigns/contests, feel free to submit the form multiple times.
Looking forward to hearing and learning from you.
-- SGill (WMF) sent using MediaWiki message delivery (చర్చ) 06:09, 25 జూన్ 2019 (UTC)
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణ ప్రకారం జరిగిన మార్పుల చేర్పుల ప్రాజెక్టు పనిలో 2017 నవంబరు నుండి 2019 జూన్ వరకు చేసిన మార్పులు, చేర్పుల స్థితి వివరాలు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు ప్రాజెక్టు పేజీలోని "ప్రాజెక్టు పనిలో 2017 నవంబరు నుండి 2019 జూన్ వరకు చేసిన మార్పులు, చేర్పుల స్థితి వివరాలు విభాగం"లో పొందుపర్చబడినవి.గౌరవ వికీపీడియన్స్ పరిశీలించి తగిన సూచనలతో స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:03, 30 జూన్ 2019 (UTC)
ఈ ప్రాజెక్టు పనిభాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాల వ్యాసాల పేజీలలో భారత జననగణన సెమీడేటా ఎక్కించే పనిని 2017 నవంబరులో చేపట్టి పూర్తిచేయబడింది.తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలపై స్థితి వివరాల నివేదిక, గణాంకాల తెలుపు పట్టిక వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం పేజీలో "ఈ ప్రాజెక్టుపనిలో తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామవ్యాసాల నందు జరిగిన కార్యక్రమం ప్రగతి నివేదిక 2019 జూన్ నాటికి స్థితి వివరాలు" అనే విభాగంలో తగిన వివరాలతో పొందుపర్చబడినది.గౌరవ వికీపీడియన్స్ దీనిపై తగుసూచనలతో స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:26, 30 జూన్ 2019 (UTC)
వ్యక్తిగత పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల కొన్ని వారాలపాటు మీకు తెలుసా వాక్యాలు చేర్చలేకున్నాను. ఖాళీ దొరికిన వెంటనే ఈ పనిలో పాలు పంచుకోగలను. ఈ లోపున ఈ పనికి పూనుకునే వారెవరైనా ఉంటే వారికి నా ముందస్తు కృతజ్ఞతలు. రవిచంద్ర (చర్చ) 05:58, 1 జూలై 2019 (UTC)
వ్యక్తులు పుట్టిన ఊరి వివరాలు సరిగా తెలియని పేజీలు వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు వర్గంలో ఉన్నాయి. ఆ వివరాలు తెలిసిన వారు వాటిని చేర్చి, ఆ పేజీని తదనుగుణమైన వర్గం లోకి చేర్చాలని వాడుకరులను కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 07:00, 1 జూలై 2019 (UTC)
కొంతమంది వాడుకరులు రెవెన్యూ గ్రామాలపై అవగాహనలేక అనగా శివారు గ్రామాలు, గ్రామ పంచాయితీ హోదా కలిగియుండి రెవెన్యూ గ్రామం కాని గ్రామాలు, గ్రామ పంచాయితీ పరిధిలోని నివాసప్రాంతాలకు వ్యాసాల పేజీలు సృష్టించుట జరుగుతుంది.వీటికి జనన గణన లెక్కలలో ప్రత్యేకంగా ఎటువంటి డేటా ఉండదు.డేటా వివరాలు ఏమీ లేనందున లోగడ సృష్టించిన ఇలాంటి అన్ని గ్రామవ్యాసాలు దాదాపుగా ఏక వాక్యంతో ఉన్నవి.అలాంటి గ్రామాలు వికీపీడియా నియమాలకు లోబడి రెవెన్యూ హోదా లేని గ్రామాలు, వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ-భౌగోళికం/జిల్లాలు మండలాల మార్పుచేర్పులు, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం ప్రాజెక్టు పనులలో గుర్తించి, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/గ్రామ వ్యాసం మార్గదర్శకాలు ననుసరించి తొలగించబడ్డవి.
అయినప్పటికీ కొంతమంది వాడుకరులు, అజ్ఞాత వాడుకరులు వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు వర్గంలో " ఒకవేళ మీరు వెతుకుతున్న గ్రామం పేరు సంబంధిత మండలంలో లేదనుకోండి". లేకపోతే ఏమి చేయాలో రాసిన దాని ప్రకారంగానీ, వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/వికీలో మీవూరు ప్రాజెక్టు పేజీలోని సూచనలు ఆధారంగా గానీ, వారి స్వంత ఊరు గురించి లేదా వారికి తెలిసిన, అభిమానం ఉన్న గ్రామం గురించి వికీపీడియాలో వ్యాసం లేదని భావించి, రాయాలనే ఉద్ధేశ్యంతో కొత్తగా వ్యాసం పేజీలు సృష్టించుట జరుగుతుంది.ఇది తప్పుగాదు.సహజం. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది.గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగిన తరువాత కొత్త సర్పంచి, పంచాయితీ సభ్యుల, యం.పి.టి.సి.సభ్యుల వివరాలు, వారి ఊరి అందాలు, గ్రామ చరిత్ర. దేవాలయాలు గురించి రాసుకోవాలనే ఉత్సాహం కూడా ఒక కారణం.ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను.ఖమ్మం జిల్లాలో ఒక అజ్ఞాత వాడకరి జిల్లాలోని అన్ని మండలాలలో రెవెన్యూ హోదాలేని గ్రామ పంచాయితీ వివరాలు పొందుపర్చుట జరిగినది.వాటిని ప్రస్తుతం “మండలంలోని గ్రామ పంచాయితీలు” అనే విభాగంలో ఉండేలాగున సవరించుట జరిగింది.
రెవెన్యూ గ్రామాలు కాని అలాంటి కొన్ని మాదిరి గ్రామాలు
అనుకూలానికి ఉన్న ఇబ్బందులు
వ్యతిరేఖతకు ఉన్న నష్టాలు
గతంలో వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 61 లో "రెవెన్యూ గ్రామాలు కాని ఇతర గ్రామాలు" అనే విభాగంలో చర్చకు పెట్టబడినప్పటికీ పూర్తి చర్చ జరగలేదని భావించి తగిన వివరణలతో తిరిగి చర్చకు ప్రవేశపెట్టటమైనది.అందరికీ అవగాహన కల్పించటం కష్టమైన పనిగా అనిపిస్తున్నందున, దీనికి ప్రత్యామ్నాయంగా సముదాయ సభ్యులు చర్చించి ఒక నిర్నయం తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 15:45, 2 జూలై 2019 (UTC)
చర్చపై నిర్ణయాల ప్రకటనకు ముందుగా వివరణ
ప్రకటించిన నిర్ణయాలు
ఈ నిర్ణయాలను గౌరవ వికీపీడియన్స్ స్వాగతించగలరని ఆశిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 16:47, 27 జూలై 2019 (UTC)
@యర్రా రామారావు గారికి, మీరు నిర్ణయం తెలిపినందులకు ధన్యవాదాలు. కాని ఇది వికీమీడియా విధానంగా రూపుదిద్దడంలో మనం వోటు పద్ధతి మరచాము. అది పూర్తయ్యేవరకు ఇది ఒక మంచి సలహాగా మాత్రమే స్వీకరించాలని నా అభిప్రాయం.
ఇకపై ఈ అంశంపై చర్చను ఆపేసి, రామారావు గారు ప్రకటించిన నిర్ణయాన్ని మార్గదర్శకంగా భావించి అనుసరిద్దాం అని నేను అందరినీ అభ్యర్ధిస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 12:27, 11 ఆగస్టు 2019 (UTC)
(ఈ చర్చ ముగిసింది కాబట్టి ఇప్పుడు నా అభిప్రాయాలేమీ చెప్పదల్చుకోలేను. ఫలితంపై మాత్రమే చర్చ జరుగుతోంది కాబట్టి ఫలితం కొరకు చర్చను పరిశీలించి ఒక నిర్ణయం ప్రకటిస్తాను). సుధీర్ఘంగా జరిగిన ఈ చర్చను పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఒక్కటే విషయం తెలుస్తుంది- మొలకలుగా ఉన్న రెవెన్యూయేతర గ్రామాలను ఉంచాలా, తుంచాలా అనేది మాత్రమే. ఇప్పటివరకు తెవికీలో అత్యధిక / సుధీర్ఘచర్చలు జరిగినవి గ్రామవ్యాసాలపైనే. ఈ చర్చకంటే కొంతకాలం ముందే ఇదేవిషయంపై చర్చ జరిగింది. కాబట్టి విభాగం టైటిల్లో ఉన్నట్టుగా, పైన చెప్పినట్లుగా ఒక్క విషయంపైనే ఓటింగ్ నిర్వహిస్తే బాగుండేది. సరే చర్చ ప్రారంభమైంది, అంతమైంది కూడా. తరుచుగా ఒకే విషయంపై చర్చను చేయడానికి ఇష్టపడకో, సెలవులో ఉండటం వల్లనో, మరే కారణాలో తెలియవు కాని ఈ చర్చలో కొద్దిమంది సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. చివరికి నిర్ణయం కూడా ఎవరూ ప్రకటించకపోయేసరికి రామారావు గారే చొరవ తీసుకొని నిర్ణయం ప్రకటించారు. స్వయంగా ముందుకు వచ్చి నిర్ణయం ప్రకటించినందుకు అభినందనలు, అదే సమయంలో చర్చలో వెల్లడైన సభ్యుల అభిప్రాయాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాను. చర్చ ముగిసేనాటికి ఇందులో పాల్గొన్నది కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే. అందులో ఒక సభ్యుడు (పవన్) ప్రత్యక్షంగా చర్చా విషయంపై ఎలాంటి అభిప్రాయం చెప్పలేరు. చర్చను ప్రతిపాదించిన సభ్యుడు (రామారావు) ప్రతిపాదనకు, ఫలితానికి మద్యలో చర్చలో ఎలాంటి అభిప్రాయం చెప్పలేరు. ఇద్దరు సభ్యులు (అర్జున మరియు ప్రణయ్రాజ్లు) పంచాయతీ గ్రామాలు తెవికీలో ఉండుట అవసరమేనని అభిప్రాయపడ్డారు. ఒక సభ్యుడు (చదువరి) మొలకలుగా ఉండే పంచాయతీ గ్రామవ్యాసాలను వ్యతిరేకించారు. అంటే చర్చ ఎటువైపు మొగ్గిందో స్పష్టంగానే ఉంది. ఇది ఓటింగ్ కాదు కాబట్టి చర్చను ప్రకటించిన సభ్యుడు తన స్వంత అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం ప్రకటించియుంటే ఫలితం అర్జున మరియు ప్రణయ్రాజ్ల అభిప్రాయాలను అనుగుణంగా ఉండేది. కాని నిర్ణయం అలా జరుగలేదు. స్వంతాభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకున్నా ఫలితం ఇప్పుడు ప్రకటించినవిధంగా ఉండాల్సింది కాదు. కాని ఇక్కడే పొరపాటు జరిగింది. మొలకలుగా ఉన్న రెవెన్యూయేతర గ్రామవ్యాసాలను తొలగించాలనే బలమైన ప్రతిపాదనలు కూడా చర్చలో రాలేవు. అభిప్రాయాలు (ప్రతిపాదించిన సభ్యుడి అభిప్రాయం కూడా లెక్కిస్తే) సరిసమానంగా ఉన్నాయి కాబట్టి ఈ చర్చ ఎలాంటి ఫలితం ఇవ్వని విఫలచర్చగా నిర్ణయిస్తున్నాను. చర్చ విఫలమైననూ చర్చలో పాల్గొన్న సభ్యుల సమయం, పని వృధా అయినట్లు ఏమీకాదు. ఈ చర్చ శాశ్వతంగా రచ్చబండలో ఉంటుంది. చర్చలో సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే పలువురి దృష్టిలో రావడమే కాకుండా తదుపరి చర్చాసమయంలో కూడా సభ్యులకు ఈ అభిప్రాయాలు అవగాహనకై పనికి రావచ్చు. కొంత విరామం తర్వాత ఈ విషయంపై మళ్ళీ చర్చ / ఓటింగ్ జరిగేవరకు ఈ చర్చతో సంబంధం లేకుండా ఇదివరకు ఉన్న నియమాలే (మొలకలుగా ఉన్న రెవెన్యూయేతర గ్రామవ్యాసాలకు సంబంధించి మాత్రమే) అమలులో ఉండగలవు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:04, 12 ఆగస్టు 2019 (UTC)
ఏదైనా వ్యాసాన్ని తొలగించాలని ప్రతిపాదించాలంటే, {{తొలగించు}} అనే మూసను ఆ వ్యాసంలో పైన చేరుస్తున్నాం. ఈ మూసను వాడినపుడు మూసలో "మరింత సమాచారాన్ని చేర్చండి" అనే లింకు కనిపిస్తుంది. 1 అనే అంకెను "ఫీల్డు" గా ఎంచుకుని, ఆ ఫీల్డులో తొలగింపుకు కారణం రాయాలి. పేజీని భద్రపరచాక, మూస పాఠ్యం పేజీలో పైన కనిపిస్తుంది. అందులో ఒక ఎర్రలింకు కూడా కనిపిస్తుంది. తొలగింపుపై చర్చ కోసం సృష్టించే పేజీకి లింకు అది. ఆ లింకును నొక్కి, ఎందుకు తొలగించదలచామనే కారణాన్ని ఆ పేజీలో రాయాలి. దానిపై ఒక వారం పాటు చర్చ జరిగాక, సముదాయ నిర్ణయం మేరకు చర్య తీసుకోవాలి. ఇది తొలగింపు పద్ధతి.
అయితే, మన సముదాయంలో చర్చల పట్ల వాడుకరులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు కాబట్టి, చర్చ కోసం ఆగకుండా తొలగిస్తున్నాం. దీనిపై అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 05:25, 12 జూలై 2019 (UTC)
InternetArchiveBot వికీపీడియా వ్యాసాలలో పనిచేయని లింకులను వెదకి, వాటిని ఆర్కీవ్ లో గల లింకులతో మార్చటానికి ప్రయత్నిస్తుంది. అలాగే పనిచేస్తున్న లింకులు ఆర్కీవ్ లో లేకపోతే ఆర్కీవ్ లో చేర్చి, ఆర్కీవ్ లింకులు చేరుస్తుంది. ఈ బాటును వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_65#తెలుగు_వికీపీడియా_కొరకు_ఇంటర్నెట్_ఆర్కైవ్_బాటు_-సముదాయ_స్పందన ద్వారా చర్చ జరిపి ఆహ్వానించడమైనది. (https://phabricator.wikimedia.org/T219962). ఇప్పుడు తెలుగువికీపీడియాలో బాట్ ఫ్లాగ్ కొరకు అభ్యర్ధన చేర్చడమైనది. సభ్యులు స్పందనలు 21 జులై 2019 లోగా కోరడమైనది.--అర్జున (చర్చ) 05:07, 15 జూలై 2019 (UTC)
అనేక పేజీల్లో గ్రామాల లింకులు తప్పుగా ఉండటం గమనించాను. అసలు గ్రామానికి కాకుండా వేరే ఏదో గ్రామానికి లింకు ఇవ్వటం, గ్రామానికి నేరుగా లింకు ఇవ్వకుండా దారిమార్పు పేజీకి ఇవ్వటం, అయోమయ నివృత్తి పేజీకి ఇవ్వటం లాంటివి కొన్ని వందల పేజీల్లో చూసాను. గ్రామాలకే కాదు ఇతర లింకుల్లోనూ ఇలాంటివి జరుగుతాయి. ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఈ పొరపాట్లు జరుగుతున్నాయని నాకు అనిపిస్తోంది. దారిమార్పు పేజీకో, అయోమయ నివృత్తి పేజీకో లింకు ఇస్తే తప్పేంటి, ఆ పేజీ నుండే అసలు పేజీకి వెళ్తారు కదా అని అనుకోవచ్చు. అది చుట్టు తిరుగుడు అవుతుంది. పైగా, ఈ అయోమయ నివృత్తి పేజీలో అసలుపేజీకి లింకు లేనే లేకపోతే..!?
పనిగట్టుకుని దారిమార్పు పేజీలకు, అయోమయ నివృత్తి పేజీలకూ లింకులు ఇవ్వరాదు. ఈ సరికే ఇచ్చిన లింకుల గమ్యాల్లో మార్పులు జరిగినపుడు లింకు తెగిపోకుండా, దారిమార్పు అనే ఏర్పాటు జరిగింది. కొత్తగా ఇచ్చే లింకులను మాత్రం నేరుగా అసలు పేజీకే ఇవ్వాలి. ఇలా చుట్టు తిరుగుడు లింకులు ఇవ్వటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే.. నాకు తట్టిన కారణం ఇది: లింకు ఇచ్చేందుకు, ఎడిటరు మెనూను కాకుండా నేరుగా వికీ మార్కప్ - అంటే, [[ ]] లను - వాడటం వలన ఈ తప్పులు జరుగుతాయి. ఇంకా కారణాలుండవచ్చు (సరైన లింకు వెతికి, ఇచ్చేందుకు బద్ధకించడం మరో కారణం కావచ్చు). ఖానాపూర్ అని రాసి దానికి ఇలా - [[ఖానాపూర్]] - అని ఒక లింకు తగిలిస్తే అది అయోమయ నివృత్తి పేజీకి పోతుంది. ఏ ఖానాపూరో రాసినవారు సరిగ్గా చెప్పకపోతే, చదివే వారికి ఏం తెలుస్తుంది? ఆ అయోమయ నివృత్తి పేజీలో అసలు ఖానాపూర్కు లింకు లేనే లేదనుకోండి, ఇక పాఠకుడు ఆ పేజీకి వెళ్లనే లేడు. అందుచేత మనం కొత్తవారికి నేర్పేటపుడు విజువల్ ఎడిటరును వాడమని, అభిరుచుల్లో దాన్ని సెట్ చేసుకోమనీ చెప్పాలి. అది ఇలాంటి తప్పులను నివారిస్తుంది. కొన్ని తప్పులనైతే పనిగట్టుకుని చెయ్యాలన్నా చెయ్యలేం. ఉదా: అసలు ఉనికిలోనే లేని పేజీకి లింకు ఇవ్వటం.
ఇంకొకటి, అయోమయ నివృత్తి పుటలకు లంకెలున్న పుటలు అనే ప్రత్యేక పేజీ ఒకటుంది. ఈ పేజీని ఆధారం చేసుకుని, బా టొకదాన్ని నడిపి (ఇంగ్లీషు వికీలో ఉండే ఉంటది) ఇలాంటి లింకులన్నిటినీ సవరించవచ్చేమో సాంకేతికులు పరిశీలించాలి. __చదువరి (చర్చ • రచనలు) 00:14, 19 జూలై 2019 (UTC)
వీకీ పేజీల్లో ఎక్కడో గానీ వాడకూడనివి, జాగ్రత్తగా అచి తూచి వాడాల్సినవీ పదాలు, వాక్యాలూ కొన్ని ఉన్నాయి. కొన్ని భాష పరమైనవి, కొన్ని సందర్భానికి సంబంధించినవీ. నా అభిప్రాయంలో అలాంటివి కొన్ని:
వాడుకరులు అభిప్రాయాలు తెలుపవల్సినదిగా మనవి. కొత్త వాడుకరులకు ఈ విషయాలను చెప్పాలని కూడా కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 05:45, 19 జూలై 2019 (UTC)
Greetings. On behalf of the Community Engagement department at the Wikimedia Foundation, I'd like to request some assistance in getting an important message translated to your language as soon as possible. Really appreciate your attention! --Elitre (WMF) (చర్చ) 12:54, 19 జూలై 2019 (UTC)
అందరికీ నమస్కారం,
వికీపీడియా ప్రాజెక్టులకు బలం - ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వదాన్యులైన స్వచ్ఛంద సేవకులు, సమూహాలు, సంస్థల నెట్వర్కు అయిన మీరే. మీరంతా కలిసి, వికీపీడియా ప్రాజెక్టులను, స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.
వికీమీడియా ఇండియా గుర్తింపును రద్దు చేయాలని అఫిలియేషన్స్ కమిటీ సిఫారసు చేసిన సంగతి మీరు వినే ఉంటారు. దీని వలన భారత్లో వికీమీడియా సమూహాల భవిష్యత్తు ఏమౌతుందని కొందరు సముదాయ సభ్యులు అడిగారు. అఫిలియేషన్స్ కమిటీ నిర్ణయం గురించి మరికొంత సమాచారాన్ని మీకు ఇద్దామని, భారత్ లోని సముదాయాలకు దన్నుగా నిలవడంలో మా నిబద్ధతను మళ్ళీ చాటాలని మేం భావిస్తున్నాం.
వికీపీడియా అనుబంధ సంస్థలకు ప్రతినిధిగా ఉంటూ వాళ్లకు సహాయకంగా ఉండే అఫిలియేషన్స్ కమిటీని స్వచ్ఛంద సేవకులు నడిపిస్తూంటారు. కొన్ని సంవత్సరాల పాటు వికీమీడియా ఇండియా కార్యకలాపాలను చాప్టర్ అవసరాలకు అనుగుణంగా మలచేందుకు కృషి చేసిన తరువాత, దానితో ఉన్న ఒప్పందాన్ని పొడిగించవద్దని 2019 జూన్లో కమిటీ సిఫారసు చేసింది.
2011 లో మొదటిగా వికీమీడియా ఇండియా ఒక చాప్టరుగా గుర్తింపు పొందింది. 2015 లో చాప్టరు ఒప్పందంలోని నిబంధనలను అమలు చెయ్యడంలో అది ఇబ్బందులు ఎదుర్కొంది. అఫిలియేషన్స్ కమిటీతో కలిసి ఒక ప్రణాళికను రూపొందించుకొని, పనిచేసి 2017 నాటికి తిరిగి గాడిలో పడింది. అయితే, మళ్ళీ 2017, 2019 మధ్య కాలంలో లాభాపేక్ష లేని సంస్థగా పని చేసేందుకు చాప్టరు ప్రభుత్వం నుండి లైసెన్సు తెచ్చుకోలేక పోయింది. ఫౌండేషన్ నుండి నిధులు పొందేందుకు వీలుగా దానికి చట్టబద్ధమైన ధార్మిక సంస్థగా కూడా రిజిస్ట్రేషను లేదిప్పుడు. ఈ లైసెన్సు, రిజిస్ట్రేషను రెండూ పొందగలిగేవే నని ఫౌండేషన్, అఫిలియేషన్స్ కమిటీ రెండూ భావిస్తున్నాయి. గుర్తింపు పొందేందుకు అవసరమైన చర్యలను చాప్టరు తీసుకుంటుందని కూడా అవి భావిస్తున్నాయి.
మా ప్రపంచవ్యాప్త ఉద్యమంలో తమదైన ముద్ర వేస్తూ, గొప్ప నాయకత్వాన్ని అందిస్తున్న భారత సముదాయం పట్ల మాకు కృతజ్ఞతా భావం ఉంది. ప్రస్తుతం 8 భారతీయ భాషల్లోని సముదాయాలకు ఫౌండేషన్ మద్దతు నిస్తోంది. రాబోయే కొద్ది వారాల్లో కొత్తగా మరో రెంటిని అఫిలియేషన్స్ కమిటీ ప్రకటించబోతోంది. భారత్ పాఠకుల నుండి నెలకు మాకు 70 కోట్ల పైచిలుకు పేజీవ్యూలు వస్తాయి. భారత సముదాయం అభివృద్ధి చెందడం వికీపీడియా భవిష్యత్తుకు, వికీమీడియా ప్రాజెక్టుల భవిష్యత్తుకూ చాలా ప్రధానం.
వికీపీడియా ఉద్యమానికి భారత గణతంత్ర రాజ్యం ఎంతో ముఖ్యమైనది. భారత్లో స్వచ్ఛందంగా పని చేస్తున్న ఎడిటర్లు, సమర్పకులు, పాఠకులు, దాతల పట్ల మా నిబద్ధత కొనసాగుతూనే ఉంటుంది. వికీమీడియా ప్రాజెక్టులు, స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమంలో మీరు చేస్తున్న కృషి పట్ల మేము కృతజ్ఞులమై ఉంటాం. మీతో కలిసి చేసే కృషిని కొనసాగించేందుకు మేం ఎదురు చూస్తున్నాం.
వికీమీడియా ఫౌండేషన్ తరఫున,
వాలెరీ డి కోస్టా
ఛీఫ్ ఆఫ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్
వికీమీడియా ఫౌండేషన్
తోటి తెలుగు వికీపీడియన్లతో నేను కొన్ని మెయిలింగు లిస్టుల వివరాలు పంచుకోవాలనుకుంటున్నాను.
ఈ కింద ఇస్తున్న జాబితాలోని వివిధ మెయిలింగ్ లిస్టుల్లో చేరడం వికీపీడియన్లుగా మనకు రకరకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు:
మీలో చాలామందికి మెయిలింగు లిస్టుల గురించి వ్యక్తిగతంగానూ, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగానూ తెలిసివుండొచ్చు. అయితే తెలియని వారి కోసం వివరిస్తున్నాను. తెలిసినవారు ఈ భాగం వదిలి ముందుకు వెళ్ళండి.
మెయిలింగ్ లిస్టు కొన్ని మెయిలైడీల సంకలనంగా ఉంటుంది. అది థీమ్ ప్రకారం కానీ (ఉదాహరణకు వికీడేటాలో భారతదేశానికి సంబంధించిన అంశాల పట్ల ఆసక్తి ఉన్నవారు), ప్రాజెక్టు ప్రకారం కానీ (తెలుగు వికీపీడియా గురించి చర్చించేందుకు ఒక మెయిలైడీ ఉంది), ప్రాంతం ఆధారంగా కానీ (బెంగళూరు వికీపీడియన్లు), జాతీయ స్థాయిలో కానీ (వికీమీడియా ఇండియా) ఉండొచ్చు. మెయిలింగ్ లిస్టు ఓపెన్ అయితే ఆ థీమ్ పట్ల ఆసక్తి ఉన్నవారంతా చేరవచ్చు, అలానే ఆర్కైవ్స్ పేజీలో గతంలో జరిగిన చర్చలను చదువుకోవచ్చు. ఐతే మెయిల్ రాసేప్పుడు ఆ థీమ్ కి సరిపోతోందా? లేదా? చదివే వారు ఎవరు లాంటి ప్రశ్నలు వేసుకుని రాయండి. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమం గురించి బెంగళూరు మెయిలింగ్ లిస్టులో రాస్తే ప్రయోజనం లేకపోగా ఆ మెయిలింగ్ లిస్టును స్పామ్ చేసినట్టు అవుతుంది.
ఈ కింద ఇస్తున్న లింకులోనే వాటిలో చేరడానికి (subscribe) వీలు, గత చర్చలు చదవడానికి (Visit the Archives) లింకులు ఉంటాయి. ఈ కింద ఇచ్చినవి కేవలం ఉదాహరణ ప్రాయమే. ఇంకా మరెన్నో ఉన్నాయి లిస్టులు.
తెలుగు వారికి సంబంధించినవి:
మీకు ఆసక్తి ఉన్న మెయిలింగ్ లిస్టులో చేరడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అలానే @Chaduvari: గారు నన్ను ఇలాంటి జాబితా కావాలని కోరారు. ఈ సందర్భంగా ఈ అంశాన్ని ముందుకు తెచ్చినందుకు వారికి ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 09:02, 21 జూలై 2019 (UTC)
Read this in another language • Subscription list for this multilingual newsletter
Did you know?
Welcome back to the Editing newsletter.
Since the last newsletter, the team has released two new features for the mobile visual editor and has started developing three more. All of this work is part of the team's goal to make editing on mobile web simpler.
Before talking about the team's recent releases, we have a question for you:
Are you willing to try a new way to add and change links?
If you are interested, we would value your input! You can try this new link tool in the mobile visual editor on a separate wiki.
Follow these instructions and share your experience:
The mobile visual editor is a simpler editing tool, for smartphones and tablets using the mobile site. The Editing team recently launched two new features to improve the mobile visual editor:
Section editing and the new loading overlay are now available to everyone using the mobile visual editor.
This is a list of our most active projects. Watch these pages to learn about project updates and to share your input on new designs, prototypes and research findings.
The VisualEditor on mobile is a good place to learn more about the projects we are working on. The team wants to talk with you about anything related to editing. If you have something to say or ask, please leave a message at Talk:VisualEditor on mobile.
18:32, 23 జూలై 2019 (UTC)
పైనున్న భారత దేశంలో సముదాయాలకు మద్దతు అనే విభాగం గమనించండి. వికీమీడియా ఫౌండేషనుకు భారతదేశంలో అధికారికంగా వికీమీడియా ఇండియా అనే ఒక అనుబంధ చాప్టరు ఉంది అని తెలుస్తోంది. అది ఫౌండేషను విధానాలకు అనుగుణంగా పని చేయనందున ప్రస్తుతం దాని గుర్తింపును రద్దు చేస్తున్నారు. పై నోటీసును అనువదిస్తూంటే నాక్కొన్ని సందేహాలొచ్చాయి. ఫౌండేషను ఇచ్చిన నోటీసుకు చాప్టరు ఇచ్చిన బహిరంగ సమాధానం కూడా ఈ లింకులో చూసాను. ఇవి చూసాక, బయటికి కనబడేదాని కంటే మించి వెనక కొంచెమేదో ఉందని నాకు అనిపించింది. నేను గమనించినవి:
ఇదంతా చూస్తూంటే - బయటిక్కనబడే దాని కంటే కనబడనిది ఇంకా ఏమైనా వీళ్ళ మధ్య ఉందేమో ననిపిస్తోంది! ఫౌండేషను, చాప్టరు రెండూ కూడా మరిన్ని వివరాలను చెప్పాల్సి ఉందేమో..!? ఫౌండేషను మరింత పారదర్శకంగా ఉండాలేమో (ముఖ్యంగా మూడు, నాలుగు పాయింట్లలో చూపిన విషయాల పట్ల)..!? వాడుకరు లేమంటారో చూడాలి.__చదువరి (చర్చ • రచనలు) 05:47, 27 జూలై 2019 (UTC)
వికీపీడియా_చర్చ:వికీప్రాజెక్టు#2019-07-30_న_వికీప్రాజెక్టు_పేజీల(వాటి_చర్చాపేజీలతోసహా)_సంవత్సరంవారీ_సవరణలు చూడండి. దాదాపు 14 ఏళ్ల తెవికీ చరిత్రను సులువుగా తెలుసుకోవచ్చు.అర్జున (చర్చ) 12:02, 30 జూలై 2019 (UTC)
గ్రామ వ్యాసాలపై చాలమంది సభ్యులు, చాలా ఏళ్లుగా కృషి చేశారు. గత నాలుగేళ్లలో కేవలం ఆంధ్రప్రదేశ్ గ్రామాలకే అన్ని రకాల వాడుకరుల సవరణలు మొత్తము సవరణలలో సుమారు మూడవ వంతుగా వున్నాయి. 2018 డిసెంబరులో 0.81 శాతం వీక్షణలు మాత్రమే వున్నాయి (సవరణలు, వీక్షణల విశ్లేషణ). అయితే పొరబాటు వలనో ఇతరత్రా కారణాల వలన చాలా గ్రామ వ్యాసాలకు శుద్ధి అవసరమైన స్థితిలో వున్నాయి. వాటిని సవరించుటకు మరియు ముందు సంవత్సరాలలో వాటిలో గణాంకాల నిర్వహణకు వికీడేటా వాడుతూ కొత్త సమాచారపెట్టె నమూనాలు, వికీడేటాలో సవరణలు చేయుటకు ఉపకరణాలు గుర్తించి, ప్రకాశం జిల్లా పైలట్ ప్రాజెక్టులో వాడడమైనది. ఆ వ్యాసాలలో దోషాలు దిద్దుటకు మరియు ఇతర సలహాలు, సూచనలకు సోదర, సోదరీ సభ్యుల సహకారం కోరుతున్నాను. వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర_ప్రదేశ్_గ్రామాలు/సమాచారపెట్టె_మెరుగు/వికీడేటా చూసి, ఇక్కడగాని లేక చర్చా పేజీలో (ప్రతిక్రియ_అభ్యర్ధన విభాగం, దానిలోని లింకులు చూసి) ప్రతిస్పందించండి. ధన్యవాదాలు.అర్జున (చర్చ) 12:16, 30 జూలై 2019 (UTC)
పైలట్ ప్రాజెక్టు పూర్తయింది. సమీక్ష చూడండి. మీ స్పందనలు ఇక్కడ గాని, ప్రాజెక్టు చర్చాపేజీలోగాని చేర్చండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 16:02, 30 ఆగస్టు 2019 (UTC)
Seamless Wikipedia browsing. On steroids.