From Wikipedia, the free encyclopedia
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2019 మే 3 - 2019 మే 23
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
← పాత చర్చ 65 | పాత చర్చ 66 | పాత చర్చ 67 →
వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు పేజీ చూసి స్పందించండి. --అర్జున (చర్చ) 05:16, 29 ఏప్రిల్ 2019 (UTC)
వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు/ప్రకాశం_జిల్లా_మండల_కేంద్రాలు లో మండల కేంద్రాలు నొక్కి చూడండి. దీని అనుభవాల ఫలితంగా సూచనలు చర్చించాల్సినవి, ప్రాజెక్టు పేజీలో తాజాపరచబడింది. వికీడేటా_పని_పూర్తికాకుండా_బాట్_తో_సమాచారపెట్టెను_మార్చటం పై చర్చాపేజీలో స్పందనలు కోరుతున్నాను.అర్జున (చర్చ) 03:54, 24 జూలై 2019 (UTC)
I have created a hangout to improve collaboration and coordination among editors of various wiki projects. I would like to invite you as well. Please share your email to pankajjainmr@gmail.com to join. Thanks Capankajsmilyo (చర్చ) 16:39, 29 ఏప్రిల్ 2019 (UTC)
విజయవాడలోని ఆంధ్ర లొయోలా కళాశాలలో సీఐఎస్-ఎ2కె గతంలో భాగస్వామ్యం వహించి కార్యక్రమాలు (ప్రధానంగా 2014-2017 సంవత్సరాల్లో) నిర్వహించిన సంగతి సముదాయ సభ్యులు కొందరికి తెలిసిందే. కళాశాల నిర్వహణ విషయంలో జరుగుతున్న కొన్ని మార్పులను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఏయే కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నది చర్చించడానికి మే 3న కళాశాలలో సమావేశం జరుగనుంది. దీనిలో కళాశాల ప్రతినిధులు, సీఐఎస్-ఎ2కె ప్రతినిధులు, తెలుగు వికీపీడియన్ రహ్మానుద్దీన్ పాల్గొంటారు. తెలుగు వికీపీడియా, సోదర ప్రాజెక్టుల మెరుగుదల కోణంలో వచ్చే ప్రతిపాదనలను సముదాయంతో ఈ పోస్టు కింద పంచుకుంటాము. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:15, 2 మే 2019 (UTC)
పవన్ సంతోష్ సీఐఎస్-ఏటుకె కార్యక్రమం ద్వారా సాధారణ వికీపీడియన్ గా కాకుండా ప్రత్యేకంగా చేసిన పనుల గురించిన నివేదిక చేర్చాలని మనవి. ఒక ఔత్సాహికుడిగా చేసిన పనులను, ఒక వికీపీడియా ద్వారా పరోక్షంగా జీతం తీసుకుంటున్న వ్యక్తిగా చేస్తున్న కార్యక్రమాలను అనుకున్న ప్రణాళిక ప్రకారం నివేదించమని మనవి. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:09, 2 మే 2019 (UTC)
టైటిల్ సాంగ్ గురించిన వ్యాసం రాద్దామని అనుకొంటున్నాను. సరైన పేరు ప్రతిపాదించమని సభ్యులను కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 12:35, 3 మే 2019 (UTC)
ఈ చర్చ పైనున్న #ప్రముఖుల వర్గాలు అనే విభాగంలోని చర్చకు కొనసాగింపు. AWB ద్వారా చెయ్యాల్సిన వర్గాల మార్పులు అయిపోయాయి. ఇక ఒక్కొక్క వ్యాసాన్ని తీసుకుని వర్గాలను మార్చాలి. వర్గం:తెలుగు ప్రముఖులు, వర్గం:తెలుగు వ్యక్తులు, వర్గం:తెలుగు ప్రముఖులు లాంటి స్థూల వర్గాల్లోని ఒక్కో వ్యాసాన్ని తీసుకుని సముచితమైన సూక్ష్మ వర్గంలోకి చేర్చాలి. అ సూక్ష్మ వర్గాన్ని దాని పైనున్న వర్గం లోకి, దాన్ని మరింత పై వర్గంలోకి.. ఇలా చేర్చుకుంటూ పోవాలి. పెద్ద పనే.. కానీ చెయ్యాల్సిన పని. ఆవశ్యయకమైన చర్చను లేవనెత్తిన Rajasekhar1961 గారికి అభినందనలు. ఆయనే ఈ పనికి నాయకత్వం వహించి ముందుకు తీసుకు పోవాలని కోరుతున్నాను. రాజశేఖర్ గారూ, దీన్ని ఒక ప్రాజెక్టుగా రూపొందించండి. నేనూ పాల్గొంటాను.__చదువరి (చర్చ • రచనలు) 02:14, 6 మే 2019 (UTC)
ఈ మధ్య స్వంత పేజీల సృష్టి పెరిగిందేమో నని నాకు అనుమానంగా ఉంది. గత రెండు రోజుల్లో నేను రెండు పేజీలను తొలగించాను. కొందరు వ్యక్తులు తమను తాము గొప్పవారిగా భావించుకోవడం, వికీపీడియాలో తమకు ఒక పేజీ ఉండకపోవడం లోపంగా భావించడం జరుగుతూండవచ్చు. అందుచేత ఒక కొత్త ఖాతాను సృష్టించుకుని వెంటనే తమ పేజీని రాసేసుకుంటున్నారు. (గతంలో అజ్ఞాతంగా- ఐపీ అడ్రసు నుండి - ఈ పని చేసేవారు; ఇప్పుడు కాస్త పురోగతి సాధించి ఉండవచ్చు). అలాంటి రెండు పేజీలను గత రెండు రోజుల్లో నేను తొలగించాను. అయితే సముదాయం దృష్టికి తెచ్చి, దీన్ని ఒక మార్గదర్శకంగా ఏర్పరచాలని భావించాను.
కొన్ని సందర్భాల్లో సదరు వ్యక్తులు నిజంగానే వికీపేజీకి అర్హులై ఉండవచ్చు కూడా. వారికి పేజీ తయారు చెయ్యకపోవడం లోపమే కావచ్చు. అంత మాత్రాన ఎవరి పేజీని వాళ్ళు తయారు చేసుకోవడం సరి అయిపోదు అని నా ఉద్దేశం. అలాంటి పేజీలను కూడా తొలగించాలని నా అభిప్రాయం.
తోటి వాడుకరుల అభిప్రాయాలు కోరుతున్నాను__చదువరి (చర్చ • రచనలు) 02:28, 6 మే 2019 (UTC)
ఈ మధ్య Bonadea అనే ఎన్వికీ్ వాడుకరిని వేధిస్తూ ఉన్న అనేక ఖాతాలను స్టీవార్డులకు నివేదించగా, అవన్నీ సాక్ పప్పెట్లేనని తేలింది. అంటే అవన్నీఒక దురాలోచనతో బహుశా ఒకే వ్యక్తి సృష్టించినవన్నమాట.వాళ్ళు ఆ ఖాతాలను పరిశోధించి, లాక్ చేసారు.
ఈ విషయంపై నిర్వాహకుల నోటీసు బోర్డులో జరిగిన చర్చ చూడవచ్చు. అక్కడ ఈ పప్పెట్లు చేసిన హడావుడి కూడా చూడొచ్చు. రవిచంద్ర గారు, Pranayraj Vangari గారు, నేను ఈ పనిలో పాల్గొన్నాం. అయితే ఇక ముందు ఈ పప్పెట్ల ఆగడాలు కొనసాగే అవకాశం, పెచ్చు మీరే అవకాశమూ లేకపోలేదు. మన మందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీటి ప్రస్తుత ప్రవర్తన ఇలా ఉంది:
వాడుకరులు గమనించవలసినదిగా మనవి. __చదువరి (చర్చ • రచనలు) 02:51, 8 మే 2019 (UTC)
Apologies for writing in English, please consider translating
Greetings from CIS-A2K,
The Wikimedia Education SAARC conference will take place on 20-22 June 2019. Wikimedians from Indian, Sri Lanka, Bhutan, Nepal, Bangladesh and Afghanistan can apply for the scholarship. This event will take place at Christ University, Bangalore.
Who should apply?
Please know more about this program and apply to participate or encourage the deserving candidates from your community to do so. Regards.Ananth (CIS-A2K) using MediaWiki message delivery (చర్చ) 13:54, 11 మే 2019 (UTC)
వ్యక్తుల పేజీలను వివిధ వర్గాల్లోకి చేర్చేటపుడు వారి లింగాన్ని బట్టి వర్గీకరించాలా అనే సందేహం వచ్చింది, నాకు. అంటే గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు అనే వర్గం లోకి ఆడ మగ అందరినీ చేర్చవచ్చా, లేక స్త్రీలకు ప్రత్యేకంగా గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు /గుంటూరు జిల్లా మహిళా స్వాతంత్ర్య సమర యోధులు అని వేరే వర్గం ఉండాలా? రచయితలు/రచయిత్రులు, నటులు/మహిళా నటులు, ఉపాధ్యాయులు/ఉపాధ్యాయురాళ్ళు (మహిళా ఉపాధ్యాయులు) - ఇలా లింగ విచక్షణ (వివక్ష కాదు) చూపించాలా? అలా విడివిడిగా వర్గాలు ఈసరికే ఉన్నాయి. అయినా నాకో సందేహం వాడుకరుల స్పందన కోసం చూస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 07:22, 17 మే 2019 (UTC)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమంలో 42 రోజులపాటు తెలంగాణకు చెందిన సకలుజనుల సమ్మె జరిగిన సంగతి మనందరికి తెలుసు.ఇది ముఖ్యమైన సంఘటన అని అందరం ఒప్పుకోవలసినమాట, యదార్థం.ఇది ఏ ఒక్క జిల్లాకు, మండలానికి సంభందించిన విషయం కాదు.తెలంగాణ రాష్ట్రానికి సంభందించిన విషయం. తెలంగాణలోని మండలాలకు ప్రత్యేక వ్యాసం సృష్టించకముందు గ్రామ వ్యాసానికి మండల వ్యాసానికి ఒకే వ్యాసం పేజి ఉంది.ఆ వ్యాసాలలో పరిశీలించగా ప్రతి మండల వ్యాసంలో......
“ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.”
అని కూర్పు చేయబడింది.మన గౌరవ వికీపీడియన్స్ ఎవరు కూర్పుచేసారో ప్రస్తుతం అప్రస్తుతం.అయినా నాకు తెలియదు,అంతలోతుకుకూడా పోదల్చుకోలేదు. వాస్తవానికి ఇది తెలంగాణ ఉద్యమానికి సంభందించిన విషయం.పోనీ ఈ విషయం తెలంగాణ ఉద్యమం వ్యాసంలో ఉందా లేదా అని నేను పరిశీలించగా, లేకపోతే అక్కడ "సకలజనుల సమ్మె" అని విభాగం పెట్టి తగిన మార్పులుతో సవరించాను.పెద్ద మనసుతో ఆలోచిస్తే ప్రతి మండల వ్యాసంలో ఉండవలసిన ఆవశ్యకతలేదని నేను భావిస్తున్నాను.ఇక్కడ మీకు ఒక విషయం ఉదాహరణగా వివరిస్తాను.స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన సంగతి గురించి మనందరకు తెలిసిందే.ఇది దేశానికి,మనందరకు సంభందించిన విషయం.1942 ఆగస్టు నెలలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలంలోని పెంటపాడు గ్రామంలో పోస్టాఫీసు మీద, టెలిగ్రాఫ్ శాఖకు చెందిన ఆస్తులపై ఆంగ్లేయుల పాలనకు నిరసనగా దాడిచేసి, స్థానిక స్వాతంత్ర సమర యోధులు జాతీయ స్థాయి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.గాంధీజీ అరెస్టు వార్త తెలుసుకుని ఆగస్టు 15 నుంచి ఎస్టివిఎన్ హిందూ పాఠశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించారు. కొద్దిరోజుల్లోనే సమీపంలోని భీమవరంలో ఉద్యమకారులపై కాల్పుల దుర్ఘటన జరిగిందని తెలిసిన విద్యార్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు సత్యనారాయణరెడ్డి విద్యార్థులను సమావేశపరిచి ప్రసంగిస్తూ బొంబాయిలో జాతీయ నాయకులను అరెస్టుచేయడం, భీమవరంలో ప్రజలపై కాల్పులు జరపడం వంటివి చెప్పి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసి వారికి గుణపాఠం నేర్పాలని సూచించాడు. సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో 300 మంది విద్యార్థులు ఊరేగింపుగా వెళ్ళి పీడబ్ల్యుడి ఆఫీసు మీద, పోస్టాఫీసు మీద దాడిచేశారు. తాళం వేసివున్న పోస్టాఫీసును బద్దలుకొట్టి లోపలి వస్తువులు నాశనం చేసి, రికార్డులు తగలబెట్టారు.ఆ సందర్బంగా 12 మంది యువకులను అరెస్టు చేశారు.ఆ ఉద్యమంలో కోర్టు 11 మంది విద్యార్థులుకు 25 కొరాడా దెబ్బలు, స్వాతంత్రసమరయోధుడు సత్యనారాయణరెడ్డికి 25 కొరాడా దెబ్బలుతోపాటు,జైలు శిక్ష,జరిమానా విధించి ఖరారు చేయగా అనుభవించారు.ఈ ఘటన ఆ గ్రామంలో జరిగింది.ఆ గ్రామానికి సంబందించిన ఘటన కాబట్టి పెంటపాడు గ్రామవ్యాసంలో తగిన మూలాలుతో ఒక్క పెంటపాడు గ్రామ వ్యాసంలోనే రాయబడింది.కనీసం ఆ మండలంలోని గామాల వ్యాసాలలోగానీ , పశ్చమ గోదావరి జిల్లా వ్యాసంలో గానీ రాయబడలేదు. మన దేశానికి స్వాతంత్ర్యం ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చింది.అలాగని ప్రతి రాష్ట్ర వ్యాసం పేజీలో గానీ, జిల్లా వ్యాసం పేజీలలోగానీ రాసామా? రాయలేదు. భారత స్వాతంత్ర్యోద్యమం, భారతదేశ చరిత్ర వ్యాసాలలో మాత్రమే రాయబడింది.ఇటువంటి విషయాలు మన గౌరవ వికీపీడియన్స్ ఎవరికివారు ఆలోచించగలరని భావిస్తున్నాను.గ్రామ మండల వ్యాసాల మార్గదర్శకాలులోని 21,22 నియమాలు కూడా అవే చెపుతున్నాయి.
పైవాటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఉద్యమం వ్యాసంలో కూర్పు అయినందున ప్రతి పూర్వపు మండలవ్యాసంలో ఉన్న ఆ వ్యాక్యాలు తొలగించటానికి సముదాయం నిర్ణయం కోసం రచ్చబండలో చర్చనిమిత్తం తీసుకురావడమైనది.దీనిపై గౌరవ వికీపీడియన్స్ వారి వారి అభిప్రాయాలుపై స్పందించవలసినదిగా కోరడమైనది.--యర్రా రామారావు (చర్చ) 02:38, 19 మే 2019 (UTC)
Hello,
Greetings for CIS-A2K. We want to inform you that 3 new positions are open at this moment.
For details about these opportunities please see here. -- Tito (CIS-A2K), sent using MediaWiki message delivery (చర్చ) 10:02, 22 మే 2019 (UTC)
కొత్తవారికి సహాయం వంటి ప్రయత్నం - కొత్తగా వస్తున్నవారికి శిక్షణనిచ్చి, ఇక్కడ కాలునిలదొక్కుకుని, చక్కని సముదాయ సభ్యులుగా నిలుపుకోవడంలో ఆసక్తికల వికీపీడియన్లు పనిచేయాలన్న ఆలోచనతో మొదలైంది. కొందరు వికీపీడియన్లు ప్రయత్నించారు. అలానే సముదాయంలో ఉన్న చాలామందికి సముదాయాన్ని విస్తరించడంలో సహకరించడంపై ఆసక్తి ఉన్నదని మనకు గతంలో జరిగిన కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం చెప్తోంది. ఈ నేపథ్యంలో కొత్తవారిని నిలుపుకోవడానికి (Retention of Newbies) ఏర్పాటుచేసుకోవాల్సిన వనరులు, సంతరించుకోవాల్సిన నైపుణ్యాలను అందిస్తూ మిని ట్రైన్-ద-ట్రైనర్ కార్యక్రమాన్ని ఇప్పటికే ఉన్న సభ్యులకు చేయాలని సంకల్పం. జూన్ 15, 16 తేదీల్లో నిర్వహించాలన్నది ప్రతిపాదన. వికీపీడియా, వికీసోర్సు ప్రాజెక్టుల విషయంలో మనకు తెలిసిన అంశాలు మనకు వీలుచిక్కినంత సమయంలో మరో కొత్తవ్యక్తికి నేర్పి, మనకి ఇందులో పనిచేయడానికి కలిగే ఉత్సాహాన్ని వారికి కూడా ఏర్పరిచి సముదాయాన్ని విస్తరించాలని, అందుకోసం అవసరమైన నైపుణ్యాలు సంతరించుకోవాలని ఆసక్తి కలిగిన తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులు దీనిలో ఆహ్వానితులు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం. దీనిపై సముదాయం స్పందించాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:02, 23 మే 2019 (UTC)
ఈ పేజీలో , , అనే చర్చలు వ్యక్తుల పేజీల వర్గీకరణను క్రమబద్ధీకరించాలనే ఆవశ్యకత గురించి మనల్ని తట్టి లేపాయి. తదనుగుణంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/వ్యక్తుల వర్గాల క్రమబద్ధీకరణ అనే ప్రాజెక్టును మొదలుపెట్టాను. ప్రాజెక్టు పేజీ రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు. ముందుగా ప్రాజెక్టు స్వరూప స్వభావాలను, చెయ్యాల్సిన పనులను, చెయ్యల్సిన విధానాలనూ రూపొందించుకుని, ఆ తరువాత పేజీల్లో చెయ్యాల్సిన మార్పులను చేద్దామని నా ఉద్దేశం. వాడుకరులు ఈ పేజీని చూసి, ఆ ప్రాజెక్టులో భాగం పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 10:48, 23 మే 2019 (UTC)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.