From Wikipedia, the free encyclopedia
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2014 ఫిబ్రవరి 1 - 2014 ఫిబ్రవరి 28
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
← పాత చర్చ 31 | పాత చర్చ 32 | పాత చర్చ 33 →
తెలుగు వికీపీడియా తన పదేళ్ళ నడకలో ఎన్నో సంచలనాలకు వేదికగా నిలచిందనడం అతిశయోక్తి కాదు. 'విజయ' ఉగాది విజయోత్సవాలు అందుకు ప్రధమ నిదర్శనమైతే, కొత్తవ్యాసాలచేరికలో, కొత్త వాడుకరుల ప్రవేశం, కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మరో నిదర్శనం. సహా సభ్యులను పురోగమన దిశలో నడిపించడంలో అధికారులు, నిర్వాహకులు చూపిస్తున్న చొరవ- సమయస్ఫూర్తి- సంయమనం రేపటి మన విజయ పరంపరకు ఆలంబనగా నిలుస్తాయనడం సత్యదూరం కాదు. ఇదే సందర్భంలో... మనం వికీపీడియా:తెలుగు వికీ జైత్రయాత్ర - ఫిబ్రవరి 17-20 నిర్వహిస్తే సహసభ్యులకు ఉత్సాహంగానూ, స్ఫూర్తి దాయకంగానూ ఉంటుందన్నది నా ఆలోచన. అందుకే.. ఫిబ్రవరి 15,16 తేదీలలో విజయవాడ కే.బి.యెన్. కాలేజీలో తెవికీ దశాబ్ది ఉత్సవాలు ముగిసిన తరువాత ఆ మర్నాటి నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహసభ్యులందరం కలసి జైత్రయాత్ర చేస్తూ... కాకినాడ, రాజమండ్రి, తణుకు, భీమవరం,- (కుదిరితే మరో రెండు ఊళ్ళు కూడా) లలో అకాడమీలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తే బావుంటుంది. సాధారణంగా అకాడెమీ ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరో,ముగ్గురో వెళ్లి అకాడెమీ నిర్వహించడం సహజం. కానీ ఇప్పుడు- ఆసక్తి వున్న మిత్రులందరం కలసి ప్రత్యేకంగా బస్సులో వెళ్ళడం మనలో కొత్త ఉత్సాహం నింపుతుందని నా భావన. ఈ క్రమంలోనే మార్గ మధ్యంలో చూడదగిన కొన్ని కొత్త పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. తద్వారా విజ్ఞాన విహారయాత్ర గా ఈ జైత్రయాత్ర రూపొందుతుంది. సహసభ్యులు అనుమతిస్తే కార్యక్రమ రూపకల్పన నేను నిర్వర్తించగలను. రవాణా, వసతి, భోజన తదితర ఏర్పాట్లకు సంబంధించి Cis-A2k వారిని అభ్యర్ధించ వచ్చు. సమయాభావం అతి స్వల్పమైనందున మిత్రులు త్వరితగతిన స్పందించవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను. ....మల్లాది కామేశ్వర రావు (చర్చ) 08:17, 1 ఫిబ్రవరి 2014 (UTC)
← పాత చర్చ 31 | పాత చర్చ 32 | పాత చర్చ 33 →
ను.జైత్రయాత్రలో పాల్గొను సభ్యులు ఇక్కడ మీ పేరును నమోదు చెయ్యండి. Palagiri (చర్చ) 06:39, 7 ఫిబ్రవరి 2014 (UTC)
ఈ క్రింది అనువాదకులు తమ అనువాదాల టెక్స్ట్ సాఫ్ట్ కాపీని ఇవ్వడానికి అంగీకరించారు. 2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్(ఫోన్ః 9000227264 ,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు 2010-అబ్దుల్ జలీల్(ఫోన్ః 9948151159),పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ. 2012-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ ఫహీముద్దీన్ అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్ 2013 - ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్,హైదరాబాద్ ముందుగా ఫోన్ లో సంప్రదించి డి.టి.పి. టెక్స్ట్ ను అనుమతి పత్రాలను వారినుండి తీసుకోవలసినదిగా మనవి.
మెటా వద్ద అభ్యర్థన ను WMF వారు ఫండ్ చేస్తామని తెలిపారు. ఇది అందరికీ శుభవార్త. ఇందుకు సహకరించిన వారందరికీ ముఖ్యంగా విష్ణు, ప్రణయ్ మరియు అర్జున గార్లకు ధన్యవాదాలు. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:33, 2 ఫిబ్రవరి 2014 (UTC)
కొత్త పేజీలు సృష్టించడం కొత్త సభ్యులకు అంత తేలిగ్గా ఉన్నట్టు లేదు. "కొత్త పేజీని సృష్టించు" అని ఒక లింకును ఎడం పక్క లింకుల్లో చేరిస్తే ఎలా ఉంటుంది? -చదువరి (చర్చ • రచనలు) 07:18, 2 ఫిబ్రవరి 2014 (UTC)
నా స్వీయ అభిప్రాయం ప్రకారం కొత్తసభ్యులు కొత్త పేజీలను సృష్ఠించ దానికి ప్రయత్నం చేయ కూడదు. ముందుగా ప్రస్తుతం వున్న వ్యాసాలేవో తెలిస్తే కదా..... తాము సృష్టించ బోయేది కొత్తదో పాతదో తెలియడానికి?? అంచేత వారు వ్రాసేదేదో వ్రాయనీయండి. వారు వ్రాసేదేది క్రొత్తదైతే క్రొత్తగా సృష్టించ బడుతుంది. పాత దైతే ఇదివరకు ఉన్న దానిలో విలీన మౌతుంది. ప్రప్రధమంగా వికీపీడియా గురించి వారికి అవగాహన ముఖ్యం. క్రొత్తవారు వికీపీడియాలో వ్రాయడమే గొప్ప. అది క్రొత్తదా పాతదా.... అనే విషయం తర్వాత వారే చూసుకుంటారు. లేదా నిర్వహకులు తగు సూచనలిస్తారు. ప్రప్రథమంగా ..... వారు వ్రాయడమే ప్రధాన అంశం. క్రొత్త వారికి నా వ్వక్తి గత సూచన ఏమంటే.....???..... క్రొత్తవారు మొదటగా.... విక్షనరీలోను.... మరియు వికీ సోర్సు లో గాని తమ రచనలు ప్రారంబిస్తే.... వారికే కొంత కాలంలో తగు అవగాహన వస్తుంది. ఆ తర్వాత వారిష్టం ఏది వ్రాస్తారో... అదే వ్రాస్తారు. నా వ్వక్తి గత అభిప్రాయం ప్రకారం ..... వికీపీడియా అంటే ఒకటే అనే అభిప్రాయము కొత్తవారిలో నాటుకుని వున్నది. అందులో అనేక విభాగాలున్నవని క్రొత్త వారికి తెలియ చెప్పడం మన ప్రధమ కర్థవ్యం. విక్షనరీ, వికీ సోర్సు , వికీ కామన్సు వంటి విభాగాలలో వారి ప్రథమంగా పాల్గొంటే మంచిదని నా అభిప్రాయం. ఎండు చేతనంటే ఆయా విభాగాలలో వున్న సరళ పద్దతే కారణం. వికీ పీడియా ఐతే..... అందులో వ్రాసిన విషయానికి మూల ఆధారమేమిటి? అది ఎక్కడినుండి తీసుకున్నారు? వారు తీసుకున్న మూలం నమ్మసక్యమైనదేనా..? ఆ మూలం శాస్వతమైనదా? నమ్మసక్యమైనదా? లాంటి సవా లక్ష ప్రశ్నలు ఎదురౌతాయి. క్రొత్తవారు వికీ పీడియాలో వారి ఉత్సాహం కొద్దీ వ్రాయడం ప్రారంబించడానికి మొదలు పెట్టగానే.... నిర్వహకులు... తమ విధి నిర్వహణ లో భాగంలో .... వారు వ్రాసిని వ్యాసానికి మూలం ఏమిటి?... అది నమ్మశక్యమేనా..? అనే సందేహాలు వెలుబుచ్చితే..... క్రొత్తవారు బెదిరి పోయి తమ వ్యాసంగాన్ని విరమించుకునే ప్రమాదమున్నది. కనుక క్రొత్తవారిని ముందుగా.... విక్షనరీ... వికీ సోర్స్ వంటి విభాగాలలో ప్రవేశం అయితే మంచిది. వాటిలో అయితే నకల హక్కులు అంతగా వుండవు. తర్వాత వారికి కొంత కాలంలో అసలు విషయం పూర్తిగా అవగాహన అవుతుంది. క్రొత్త వారు కొంత కాలం ఇందులో నిలబడతారు....... లేదంటే.... ???? ఇది నా వ్యక్తి గత అభిప్రాయము మరియు అనుభవము సుమా..... Bhaskaranaidu (చర్చ) 17:32, 2 ఫిబ్రవరి 2014 (UTC)
మిత్రులకు ------------- Hmtv లో “విజయవాడలో వికీపీడియా’’ ఫిబ్రవరి 8వతేదీ శనివారం సాయంత్రం 4-30 గంటల నుంచి 5-00 గంటల వరకు ప్రసారమవుతుంది. ___________Malladi kameswara rao (చర్చ) 17:43, 7 ఫిబ్రవరి 2014 (UTC)
‘ఆకాశవాణి హైదరాబాద్’ మెయిన్ స్టేషన్ లో తెలుగు వికీపీడియా చర్చా వేదిక కార్యక్రమం – 2014 ఫిబ్రవరి 13 వ తేదీ ఉదయం 7-20 గంటల నుంచి 7-45 గంటల వరకు ప్రసారం అవుతుంది. అలాగే - ‘ఆకాశవాణి హైదరాబాద్’ FM – ‘రెయిన్ బో’ లో అదే రోజు అంటే (2014 ఫిబ్రవరి 13 వ తేదీ) ఉదయం 8-00 గంటల నుంచి 8-25 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో నాతో బాటు విష్ణు, రాజశేఖర్, రహమానుద్దీన్ గార్లు పాల్గొన్నారు. _____________మల్లాది కామేశ్వర రావు (చర్చ) 11:56, 10 ఫిబ్రవరి 2014 (UTC)
పార్లమెంటులోనూ, రాష్ట్రంలోనూ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, తెవికీ దశాబ్ది ఉత్సవాలు యధావిధిగా జరుగుతాయా? లేదా మార్పులేమైనా ఉంటాయా? నిర్వాహక కమిటీ తెలిపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 12:07, 13 ఫిబ్రవరి 2014 (UTC)
దశాబ్ది ఉత్సవాల సంబరాలు అధికారికంగా విజయవాడలో ముగిసాయి. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. --రహ్మానుద్దీన్ (చర్చ) 21:11, 16 ఫిబ్రవరి 2014 (UTC)
గ్రామానికి కొద్దిమంది మూస:Infobox Settlement వాడటం గమనించాను. మనకు ఇదివరకే మూస:గ్రామం అనే తెలుగు మూస ఉంది. ఆంగ్ల మూసలో మనకు అవసరం లేని సమాచారం అంతా ఉంది. అవి ఇవ్వకపోతే అది దోషభూయిష్టంగా కనిపిస్తోంది. కాబట్టి తెలుగు మూస వాడండి.--రవిచంద్ర (చర్చ) 09:41, 18 ఫిబ్రవరి 2014 (UTC)
తెలుగు వికీ పది సంవత్సరాల వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు. నిర్వహణాపరమైన లోపాల ద్వారా కాని, ఏర్పాట్ల ద్వారాకాని ఎవరికైనా ఏవిదమైన కష్టం కలిగినా, ఎవరినైనా పలుకరింపులలో విస్మరించినా, అలాంటి లోపాలు పనుల ద్యాసలో వత్తిడి వలన జరిగినవే తప్ప మాకు ఎవరియందు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, అలాంటివి జరిగి ఉంటే తెలిసి చేసినవి కావని గమనించి మమ్ము మన్నించాలని, మీరంతా మీయొక్క సేవలను తెలుగువికీకి మరింతగా అందిస్తూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు జరుపుకునేందుకు ప్రోత్సాహం ఇస్తూతెలుగు వీకీపీడియాను రాబోయే రోజులల్లో లక్ష వ్యాసాల దిశగా వేగంగా తీసుకువెళ్ళాలని మా కార్య నిర్వహక వర్గం తరుపున కోరుతున్నాను....విశ్వనాధ్ (చర్చ) 14:48, 18 ఫిబ్రవరి 2014 (UTC)
దశాబ్ది ఉత్సవాల డిటైల్డ్ రిపోర్ట్ వ్రాసి, అందులో పాల్గొన్న ముఖ్య అతిధులు, భాషా ప్రముఖులు, మరీ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన తెలుగేతర వికీపీడియన్ల గురించి (ఓడిషీ, మలయాళీ మరియు కొంకణి ) నూ వ్రాస్తే సమగ్రంగా వుంటుంది. అహ్మద్ నిసార్ (చర్చ) 13:47, 19 ఫిబ్రవరి 2014 (UTC)
దశాబ్ది ఉత్సవాలను విజయంతం చేసిన వారినందరికీ అభినందనలు, ఒక సూచన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పురస్కార విజేతలకు 3టైరు ఏసి ప్రయాణ ఖర్చు స్కాలర్షిప్పులు ఇస్తాము అని కార్యవర్గం వారు తెలియచేసారు అని ఈ రోజు నాదృస్టికి వచ్చినది, దూరప్రాంతాల నుండి వచ్చేవారికి మేము ఇచ్చిన వెయ్యిరూపాయలు కంటే ఎక్కువ ఖర్చు అయి వుండవచ్చు కావున దయచేసి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పురస్కార విజేతలు వెయ్యిరూపాయలకన్నా ఎక్కువ టిక్కెట్ల ఖరీదు ఉంటే దయచేసి 28 ఫిబ్రవరి లోగా నాకు kasyap.p@జీమేల్.com పంపగలరు మిగిలిన మొత్తం మీ ఖాతాలో జమచేయగలను,ఇంకా స్కాలర్షిప్పులు తీసుకొని వారు కూడా నన్ను 28 ఫిబ్రవరి లోగా సంప్రదించగలరు.కశ్యప్ --కశ్యప్ 12:22, 25 ఫిబ్రవరి 2014 (UTC)
On January 21 2014 the MediaWiki extension Universal Language Selector (ULS) was disabled on this wiki. A new preference was added for logged-in users to turn on ULS. This was done to prevent slow loading of pages due to ULS webfonts, a behaviour that had been observed by the Wikimedia Technical Operations team on some wikis.
We are now ready to enable ULS again. The temporary preference to enable ULS will be removed. A new checkbox has been added to the Language Panel to enable/disable font delivery. This will be unchecked by default for this wiki, but can be selected at any time by the users to enable webfonts. This is an interim solution while we improve the feature of webfonts delivery.
You can read the announcement and the development plan for more information. Apologies for writing this message only in English. Thank you. Runa
ఇంతకు ముందు చర్చలలో ఎన్నో సార్లు ఈ విషయం ముందుకొచ్చి సరియయిన చర్చ జరగకుండా సభ్యులందరికీ సరిగా అర్ధమయ్యేలా చెప్పుకోకముందే చర్చ పాతబడిపోవటం జరుగుతుంది.
ఇంతకు ముందు చెప్పిన వాదనలు :
మొ॥
ఇందుకు భిన్నంగా వ్యతిరేకులు చెప్పిన వాదనలు :
ఇక కొత్తగా ఆంగ్ల దారిమార్పులకు అనుగుణంగా మరొక వాదన :
అలా కాకుండా సీడీ పంచి వ్యర్థమవుతుంది. మరొక్కసారి సభ్యులు ఈ విషయమై చర్చించగలరు. సీనీయర్ సభ్యులు ఈ విషయమై పట్టు సడలించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 15:03, 20 ఫిబ్రవరి 2014 (UTC)
మండలంలోని అన్నిగ్రామాలకు పిన్ కోడ్ ఒకటే ఉంటుందా లేక వ్యత్యాసం ఉంటుందా తెలుపగలరు.--శ్రీరామమూర్తి (చర్చ) 02:38, 21 ఫిబ్రవరి 2014 (UTC)
వికీపీడియాలో టెక్నికల్ విషయాల్ని అభివృద్ధి చేయాలంటే ఏం చెయ్యాలి? నేను సాఫ్ట్వేర్ స్టూడెంటుని. ఇప్పటివరకూ కొంత హెచ్.టి.ఎం.ఎల్. నేర్చుకున్నాను. జేఎస్పీ, ఎక్స్.ఎం.ఎల్. లాంగ్వేజుల్ని కూడా బేసిక్స్ వరకూ నేర్చుకున్నాను. వికీపీడియాలో వాడుతోంది హెచ్టీఎమ్మెల్ ఏనా? ఒకవేళ ఐతే ఉన్న టాగులే వాడుతున్నారా? కొన్ని యూజర్ డిఫైండ్ టాగులు ఉన్నట్టుగా అనిపిస్తోంది? యూజర్ డిఫైండ్ టాగ్స్ ఎలా తెలుసుకుని వాడాలి?--Meena gayathri.s (చర్చ) 06:39, 21 ఫిబ్రవరి 2014 (UTC)
ఆంధ్రప్రదేశ్ వ్యాసము ఇంకనూ పాత రాష్ట్ర పటమునే చూపిస్తున్నది. దీనిని కొత్త పటముతో మార్చే అవసరం ఉన్నది. సభ్యులు తమ అభిప్రాయాలు తలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:01, 21 ఫిబ్రవరి 2014 (UTC)
Hello all,
Please join a discussion about a proposed amendment to the Wikimedia Terms of Use regarding undisclosed paid editing and we encourage you to voice your thoughts there. Please translate this statement if you can, and we welcome you to translate the proposed amendment and introduction. Please see the discussion on Meta Wiki for more information. Thank you! Slaporte (WMF) 22:00, 21 ఫిబ్రవరి 2014 (UTC)
పట్టికలు సరిగా ఫార్మాట్ లేని పేజీలకు వర్గం:సరిలేని_పట్టిక ను చేర్చగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:50, 24 ఫిబ్రవరి 2014 (UTC)
సి. చంద్ర కాంత రావుగారు వికీపీడియాలో మీ రచనలు చాలా రాజ్యంగ విరుద్ధంగా ఉన్నాయి. కేవలం మీ గురించి, రచనలు గురించి ఇదివరకు ఎవరయినా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఎవైనా చర్చలు ఉంటే లింకులు, మీరైనా, తెలిసిన వారు ఎవరైనా లింకులు ఇవ్వగలరు. మీతో వ్యక్తిగతంగా, చట్టపరంగా, న్యాయపరంగా, వికీపీడియా పరంగా, రాజ్యాంగా పరంగా, ఏవిధంగా నయినయిననూ చర్చలు తప్పకుండా చేయాలి. మీరు చదువరులను మీ కొన్ని రచనల ద్వారా చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఎందుకూ పనికి రాని వారిగా తయారు చేస్తున్నారు. ఇంకా రాస్తాను. మీరు ఏం రాస్తారో రాయండి. తగిన విధంగా చర్యలు అవసరమయితే తీసుకుని స్పందిస్తారు. JVRKPRASAD (చర్చ) 02:58, 27 ఫిబ్రవరి 2014 (UTC)
ఆంధ్ర వికీపీడియా, తెలంగాణా వికీపీడియా అని రెండు విభాగాలుగా తెలుగు వికీపీడియాను విభజిస్తే చాలా మంది సంతోషిస్తారని ప్రస్తుత సమాచారం వల్ల అనిపిస్తోంది. తెలుగు వారము ఇక్కడ కూడా రెండు రాష్ట్రాలకు సేవలు చేసుకుందాము. ఏ రాష్ట్రానికి ఎవరి సేవలు ఏ విధంగా ఉంటాయో చాలా బాగా తెలుస్తుంది. ఈ పని త్వరగా చేస్తే మంచిది. నేను రెండు రాష్ట్రాలకు సేవలు చేసుకుంటాను. JVRKPRASAD (చర్చ) 03:49, 27 ఫిబ్రవరి 2014 (UTC)
ఇది కేవలము తెలుగువారి వికీపీడీయా. తెలుగు వారికి ఒకే వికీపీడీయా ఉంచుట చాల అవుసరము. గుళ్లపల్లి నాగేశ్వర రావు.
కొన్ని వ్యాసాలు చూసాక, వికీపీడియనులు కూడా కీర్తిశేషులు (కొంతమంది) కాబోతున్నారు. వీరి గురించి ఇప్పటినుంచే వ్యాసాలు మొదలు (బాగా వ్యాసాలు రాశాడు అని) పెడితే మంచిదేమో అనిపిస్తోంది. ఎలాగూ అందరూ పోయే వారు. అటువంటి వారి గురించి లేదా అతని కుటుంబం గురించి కూడా వివరాలు ముందుగానే పొందు పరచుకుంటే మంచిది. JVRKPRASAD (చర్చ) 05:27, 27 ఫిబ్రవరి 2014 (UTC)
దశాబ్ది ఉత్సవాలలో వికీపీడియా సభ్యుల అభ్యర్ధన మేరకు తుర్లపాటి కుటుంబరావు గారు తన ఆత్మకథను స్వేచ్ఛానకలుహక్కుల క్రింద విడుదల చేసిన సంగతి మీకు తెలిసినదే. దాని మూలకృతి మరియు పిడిఎఫ్ కృతి క్రిందటి ఫిభ్రవరి22 న పొందడం మరియు సహసభ్యుల సహకారంతో యూనికోడ్ రూపం తయారుచేయడం పూర్తయిందని తెలపటానికి సంతోషిస్తున్నాను. ఈ పుస్తకపేజీలలో యూనికోడ్ మార్చడంలో భాగంగా జరిగినఅచ్చుతప్పులు ఏమైనా మిగిలి వుంటే సభ్యులు తనిఖీచేసి పుస్తకాన్ని పూర్తిసిద్ధం చేయడానికి (పేజీ సవరణలో భాగంగా పుటస్థితిని పసుపురంగులోకి లేక ఆకుపచ్చరంగు కనబడితే ఆకుపచ్చరంగులోకి మార్చి భద్రపరచడం)సహకరించవలసినదిగా కోరుతున్నాను. --అర్జున (చర్చ) 10:59, 27 ఫిబ్రవరి 2014 (UTC)
తెలంగాణా ఇంకా అధికారికంగా ఎర్పడలేదు, కావున దయచేసి సంయమనం పాటించి రాష్ట్రం అధికారంగా జన్మించేదాకా ఆయా మార్పులు చేయవద్దు. ఆధికారికంగా రాష్ట్రం ఏర్పడగానే క్రమబధ్దంగా చేయవలసిన మార్పులన్నీ చేద్దాము. --వైజాసత్య (చర్చ) 09:29, 28 ఫిబ్రవరి 2014 (UTC)
I apologize if this message is not in your language. Please help translate it.
Do you have an idea for a project that could improve your community? Individual Engagement Grants from the Wikimedia Foundation help support individuals and small teams to organize experiments for 6 months. You can get funding to try out your idea for online community organizing, outreach, tool-building, or research to help make వికీపీడియా better. In March, we’re looking for new project proposals.
Examples of past Individual Engagement Grant projects:
Proposals are due by 31 March 2014. There are a number of ways to get involved!
Hope to have your participation,
--Siko Bouterse, Head of Individual Engagement Grants, Wikimedia Foundation 19:44, 28 ఫిబ్రవరి 2014 (UTC)
Seamless Wikipedia browsing. On steroids.