![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fe/Ananta_padmanabhaswamy_temple.jpg/640px-Ananta_padmanabhaswamy_temple.jpg&w=640&q=50)
వికారాబాద్
తెలంగాణ, వికారాబాదు జిల్లా, వికారాబాదు మండలం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
వికారాబాద్, తెలంగాణ రాష్ట్రములోని వికారాబాదు జిల్లా, వికారాబాద్ మండలానికి చెందిన పట్టణం.[1] 1987లో వికారాబాదు పురపాలకసంఘంగా ఏర్పడింది.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.336675784544482°N 77.90473948771782°E /, రాష్ట్రం ...
వికారాబాద్ | |
— పట్టణం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 17.336675784544482°N 77.90473948771782°E / 17.336675784544482; 77.90473948771782 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాదు జిల్లా |
మండలం | వికారాబాద్ |
ప్రభుత్వం | |
- పురపాలక సంఘం | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి
ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు రోడ్డు, రైలుమార్గంలో ఈ పట్టణం ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కి.మీ. దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కి.మీ. దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని వాడి మార్గంలో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా మహారాష్ట్రలోని పర్బనికి రైలుమార్గం ఉంది.