సియాచెన్ గ్లేసియరులో భారత పాకిస్తాన్ల మధ్య ఉండే విభజన రేఖ From Wikipedia, the free encyclopedia
సియాచెన్ హిమానీనదం ప్రాంతంలో భారత పాకిస్తాన్ దళాల ప్రస్తుత స్థానాలను వేరుచేసే రేఖను వాస్తవ క్షేత్రస్థితి రేఖ - యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (AGPL) అంటారు.[1][2] ఈ రేఖ నియంత్రణ రేఖఉత్తర కొన నుండి మొదలై ఇందిరా కల్ వరకూ ఉంటుంది. ఈ రేఖ సుమారు 110 కి.మీ. పొడవు ఉంటుంది.[3][4]
1949 లో చేసుకున్న కరాచీ ఒప్పందం గాని, 1972 నటి సిమ్లా ఒప్పందం గానీ నియంత్రణ రేఖను ఎన్జె9842 వరకే నిర్వచించాయి. అక్కడి నుండి తూర్పుగా చైనా సరిహద్దు వరకూ ఉన్న ప్రాంతంలో ఈ రేఖను గుర్తించలేదు. ఇది సియాచెన్ ఘర్షణకు దారితీసింది. 1984 ఏప్రిల్లో మొదలైన ఈ ఘర్షణలో భారత్, ఆపరేషన్ మేఘదూత్ జరిపి సియాచెన్ హిమానీనాన్ని నియంత్రణ లోకి తెచ్చుకుంది.
ఈ రేఖ సాల్టోరో రిడ్జి మీదుగా వెళ్తుంది. ఈ ప్రాంతం 7000 మీ. ఎత్తున్న శిఖరాలతో కూడిన పర్వత ప్రాంత పీఠభూమి. భారత సైన్యం ఈ శిఖరాల మీద ఉండి పాకిస్తాను సైన్యం సాల్టోరో శ్రేణి శిఖరాలను ఎక్కకుండా నిరోధిస్తుంది. ఈ రేఖ ప్రస్తుతం కింది మార్గాన్ని అనుసరించి ఉంటుంది:
ఇందిరా కల్ - సియా లా కనుమ - సాల్టోరో కాంగ్రి 1 - బిలాఫోల్డ్ లా కనుమ - కె12 - గ్యోంగ్ లా కనుమ - NJ9842[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.