![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b6/Wardha_river_at_Pulgaon.jpg/640px-Wardha_river_at_Pulgaon.jpg&w=640&q=50)
వార్ధా నది
From Wikipedia, the free encyclopedia
వార్ధా నది గోదావరి నదికి ఉపనది. ఇది మహారాష్ట్ర లోని వార్ధా జిల్లాలో ప్రవహిస్తుంది. విదర్భ ప్రాంతంలోకెల్లా పెద్ద నది. ఈ నది మధ్య ప్రదేశ్, బేతుల్ జిల్లా, ఖైర్వానీ గ్రామం వద్ద సాత్పురా పర్వతాలలో ఉద్భవిస్తుంది. ఇది సముద్ర మట్టానికి 777 మీ. ఎత్తున ఉంది. మధ్య ప్రదేశ్ లో 32 కి.మీ. ప్రవహించి మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది. మహారాష్ట్రలో 528 కి.మీ. ప్రయాణించి, గడ్చిరోలి జిల్లా చాప్రాల వద్ద వైన్‌గంగ నదిలో కలుస్తుంది. ఆ తరువాత వైన్‌గంగ ద్వారా ప్రాణహిత నది లోను, అంతిమంగా గోదావరి నదిలోనూ కలుస్తుంది.[1] ఈ నదిమీద ఎగువ వార్ధా ఆనకట్ట నిర్మించారు.
త్వరిత వాస్తవాలు వార్ధా, స్థానం ...
వార్ధా | |
---|---|
![]() పుల్గావ్ వద్ద వార్ధా నది | |
స్థానం | |
దేశం | భారత దేశం |
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | ముల్టాయ్ |
సముద్రాన్ని చేరే ప్రదేశం | |
• స్థానం | ప్రాణహిత |
పొడవు | 528 కి.మీ. (328 మై.) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
Progression | మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ |
ఉపనదులు | |
• ఎడమ | కార్, వేనా, జాం, ఎరాయ్ |
• కుడి | మాడూ, బెంబాలా, పెన్‌గంగ |
మూసివేయి