![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d1/Wargaltemplegopuram.jpg/640px-Wargaltemplegopuram.jpg&w=640&q=50)
వర్గల్ సరస్వతి దేవాలయం
హిందూ దేవాలయం / From Wikipedia, the free encyclopedia
శ్రీ విద్యా సరస్వతి దేవాలయం లేదా వర్గల్ సరస్వతి దేవాలయం భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం, వర్గల్ గ్రామ పరిధిలో గల హిందూ దేవాలయం.
త్వరిత వాస్తవాలు వర్గల్ సరస్వతి దేవాలయం, స్థానం ...
వర్గల్ సరస్వతి దేవాలయం | |
---|---|
![]() వర్గల్ సరస్వతి దేవాలయం | |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | మెదక్ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
నిర్మాణ శైలి: | దక్షిణ భారతీయ |
మూసివేయి
ఈ దేవాలయ అధిష్టాన దేవత సరస్వతీ దేవి. తెలంగాణ రాష్ట్రంలో గల అతి కొద్ది సరస్వతీ దేవాలయాలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం కంచి శంకర మఠం ద్వారా నిర్వహింపబడుతున్నది. ఈ ఆలయ ప్రాంగణ నిర్మాణం సరస్వతీ ఆరాధకుడైన యాయవరం చంద్రశేఖర శర్మ ఆలోచన ఫలితంగా నిర్మితమైనది.