అప్పు తీసుకున్న మొత్తం పై అదనంగా చెల్లించాల్సిన మొత్తం From Wikipedia, the free encyclopedia
వడ్డీ : (ఆంగ్లం : Interest లేదా Usury )
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వడ్డీ ఒక రుసుం లేదా ఫీజు లాంటిది, అప్పు తీసుకుని ఆ అసలుకు కొంత ఫీజు లేదా కాంపెన్జేషన్ లేదా ప్రతిఫలం చెల్లించునటువంటిది. వెరసి, అప్పు తీసుకున్న రొక్కానికి ప్రతిఫలంగా కొంత సొమ్ము ముట్టజెప్పడం.[1] లేదా, డిపాజిట్టు చేసిన రొక్కములకు ప్రతిగా పొందే ఫలము.[2] కొన్ని అసళ్ళు అయిన రొక్కము, షేర్లు, కోనుగోలుదార్ల సరకులు, అడమాణము, తాకట్టు (hire purchase), ఫైనాన్సు లీజులు వగైరాలు కూడా ఈ వడ్డీని కలిగివుంటాయి. మనమేదైనా బ్యాంకు నుండి రుణసహాయం పొందాలంటే, వాటికి అసలు, వడ్డీ చెల్లించవలసినదే. పోలీసులుగుర్తించిన తొమ్మిది ప్రధానమైన ఆర్థిక నేరాలలో వడ్డీ వ్యాపారం ఒకటి.
రోజుకు ఇంత అని చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ అసలును మించి పోతుంది.రోడ్డు పక్కన తోపుడు బండ్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు తమ వ్యాపారానికో, ఇంటి అవసరాలకో రోజువారి వడ్డీ తీసుకుంటున్నారు. రోజంతా రెక్కలు, ముక్కలు చేసుకొని సంపాదించిన దాంట్లో అధిక మొత్తం సాయంత్రానికి వడ్డీ వ్యాపారికి ముట్ట చెప్పుకుంటున్నారు.పరిస్థితులు బాగోలేక సెలవు తీసుకుంటేనో, వ్యాపారం జరగకపోతేనో ఆరోజు వారు వణికిపోవాల్సిందే. ఆ తరువాతిరోజు రెండు రోజుల మొత్తం కలిపి చెల్లించాల్సి ఉంటుంది. రూ.10వేలు రోజువారి వడ్డీకి తీసుకుంటే రూ.వెయ్యి మినహాయించుకొని రూ.9000 చేతిలో పెడతారు. రోజుకు రూ.100 చొప్పున 100 రోజుల్లో రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం రూ.800 ఇస్తే సాయంత్రం రూ. వెయ్యి ఇవ్వాలి
ఈ సంస్థలు పోటీపడి గ్రామీణ ప్రాంతాల్లో పేదవర్గాలకు రుణాలు ఇస్తున్నాయి. గ్రూపులను ఏర్పాటుచేసి లీడర్‌ను బాధ్యురాలిగా చేస్తున్నారు. ఆయా గ్రూపుల పనితీరు ఆధారంగా రూ. 10 వేలు నుంచి రూ. 50 వేలు, లక్ష వరకు రుణాలు ఇస్తున్నారు. వారు తీసుకున్న మొత్తాన్ని బట్టి వారానికి ఒకసారి కిస్తీ చెల్లించాలి.చెల్లించని పక్షంలో సంస్థ ప్రతినిధుల రౌడీయిజంతో మహిళలను వ్యభిచారంలో దించుతున్నారు.కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ అంతర్జాతీయ సమాజం నుంచి తక్కువ వడ్డీకి నిధుల్ని లేదా గ్రాంటుల్ని తెచ్చి నిరుపేదలకు నామమాత్రపు వడ్డీకి అందించి పేదరికం నుంచి వారిని బయటపడేయడానికి సూక్ష్మరుణ వ్యవస్థ ఏర్పాటు చేశారు.మన రాష్ట్రంలో కూడా పొదుపును బృందాల నుంచే సేకరించి, వాళ్లకే తక్కువ వడ్డీకి ఒక్కో అవసరానికి ఒక్కో రేటుతో అప్పులిచ్చి, వచ్చిన లాభాలను తిరిగి ఆ బృందాలలోని సభ్యులకే పంచే ఆరోగ్యకరమైన సహకార రుణ వ్యవస్థ ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం మైక్రో ఫైనాన్స్ విధానం పేదల్ని పీల్చి పిప్పిచేసే భయంకరమైన వ్యాపారంగా మారింది.బ్యాంకులనుండి సాధారణ వడ్డీకి తెచ్చిన సొమ్మును పేదలకు అప్పులిచ్చి 40 - 50 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు.
తనఖా పేరుతో ఇళ్లు, స్థలాలతో పాటు ఆభరణాలు, ఇతర ఆస్తులను వడ్డీ వ్యాపారులు మింగేస్తున్నారు.వడ్డీకి తీసుకునే వారు తమ ఇల్లు లేదా స్థలం లేదా బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు.ఆ మొత్తం చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారులు బలవంతంగా ఆయా స్థలాలు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. రౌడీషీటర్లు, గూండాలు ఏం చేస్తారో అనే భయంతో బాధితులు పోలీసు స్టేషను వరకు రాలేకపోతున్నారు. ఒకరికి వడ్డీ చెల్లించడానికి మరొకరి వద్ద అప్పు చేయడం, వారి వడ్డీ చెల్లించడానికి వేరొకరి వద్ద అప్పులు చేస్తూ కష్టాలలో మునిగి పోతున్నారు.
ప్రపంచంలో వడ్డీల వలన కోట్లకొలది కుటుంబాలు ఆర్థిక బంధనాల్లో చిక్కుకున్నాయి. మానవులలో వుండవలసిన కనీస నైతిక విలువలు, ఇతర సోదర మానవుల పట్ల వుండవలసిన కనీస జాలి, కరుణ, దయ లాంటి మానవతా విలువలు ఈ వడ్డీ వ్యవస్థ వలన నశించాయి, నశిస్తున్నాయి.
క్రైస్తవం, హైందవం, ఇస్లాం, ఈ సమాజాలలో ధార్మిక నిర్వచాల ఆధారంగా వడ్డీ నిషేధం. వడ్డీని నీతిబాహ్యమైనదనీ, అనైతికమనీ, అధర్మమనీ పేర్కొంటారు, కానీ, వడ్డీ చక్ర బంధనాల నుండి విముక్తి కాలేని సమాజ సముదాయాలు.
యూదసమాజం, జైన సమాజం, ఈ రెండు సమాజాలు వడ్డీని ధర్మమేనని భావిస్తాయి. ప్రపంచంలో యూద వడ్డీ వ్యవస్థ సుపరిచితమే. అలాగే భారత్ లో జైనులు సాధారణంగా కష్ట జీవులు కారు. వీరు చిన్నా చితకా వ్యాపారాలూ చేయరు. వీరి వ్యాపారాలు స్థితిమంతమైనవి, వీటికి మూలాధారం వడ్డీయే.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.