![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f4/0175_Lomo_LCA_%25285136382110%2529.jpg/640px-0175_Lomo_LCA_%25285136382110%2529.jpg&w=640&q=50)
లోమో ఎల్ సి-ఏ
రష్యా కు చెందిన ఒక కాంపాక్ట్ ఆటోమాటిక్ కెమెరా / From Wikipedia, the free encyclopedia
లోమో ఎల్ సి-ఏ (ఆంగ్లం: Lomo LC-A) 1984 లో పరిచయం చేయబడిన ఒక స్థిర కటకం, లీఫ్ షట్టర్ గల, 135 ఫిల్మ్ ను వాడే ఒక (కాంపాక్ట్) టాయ్ కెమెరా. సోవియట్ ప్రభుత్వం ఆజ్ఙ మేరకు అప్పట్లో మంచి ఆదరణ గల కోసినా సి ఎక్స్-2 కెమెరా స్ఫూర్తిగా లోమో సంస్థ దీనిని నిర్మించింది. LC-A అనగా Lomo Compact Automat [1] (పేరు లోనే ఇది కాంపాక్ట్, ఆటోమేటిక్ కెమెరా అని స్పష్టమతుంది.)
![]() | |
ఉత్పాదకుడు | Lomography |
---|---|
రకం | టాయ్ కెమెరా |
సెన్సార్ రకం | ఫిలిం |
సెన్సార్ పరిమాణం | 36 ఎంఎం x 24 ఎంఎం |
రికార్డింగ్ యానకం | 135 ఫిల్మ్ |
1994 లో లోమో ఎల్ సి-ఏ ఉత్పత్తి ఆగిపోయింది. 1990వ దశకం లో వియన్నాకు చెందిన కొందరు విద్యార్థులు ఈ కెమెరాతో ఫోటోలు తీసి, వాటికి ముగ్ధులయ్యారు. దీంతో ఉత్పత్తిని పున:ప్రారంభించవలసిందిగా వారు కోరారు. మరల దీని తయారీ 2005 వరకు సాగింది.
2006 నుండి లోమో ఎల్ సి-ఏ+ పరిచయం చేయబడినది. దీని ఉత్పత్తి చైనాకు తరలించడమైనది. 2007 వరకు రష్యాకు చెందిన లోమో పీఎల్ సీ రూపొందించిన కటకాన్నే ఈ కెమెరా వాడగా, దాని తర్వాత ఈ కటకం చైనాలో తయారవుతోంది.
ఒక ప్రత్యేకమైన శైలిలో ఫోటోలను తీయటం, కనుమరుగైపోతోన్న అనలాగ్ ఫోటోగ్రఫీ కి ప్రాణవాయువు ఊదటమే కాక, లోమోగ్రఫీ అనే ప్రత్యేక కళా ఉద్యమాన్ని కూడా సృష్టించటం తో లోమో ఎల్ సి-ఏ కెమెరా అంతర్జాతీయ స్థాయిలో ఎనలేని ప్రాధాన్యం సంపాదించుకొంది.