From Wikipedia, the free encyclopedia
లవంగపట్ట నూనె లేదా చీనా దాల్చిన నూనె ఒక ఆవశ్యక నూనె.లవంగపట్ట లేదా చైనా/చీనా దాల్చినను ఆంగ్లంలో cinnamomum cassia అంటారు.అంతేకాదు లవంగపట్ట నూనె సుగంధ తైలం కూడా. లవంగ పట్ట నూనె ఓషధ గుణాలులు పుష్కలంగా వున్న ఆవశ్యక నూనె.లవంగ పట్టను నకిలీ దాల్చిన అనికూడా అంటారు. చీనా దాల్చిన నూనెను వొంటికి రాసిన చర్మాన్ని రేగించే/ప్రేరేపించే/irritant గుణం కల్గి వున్నను జ్వరాన్ని తగ్గించుట, జీర్ణవృద్ధి కావించుట వంటి ఇతర పలు ఓషధ గుణాలు దండిగా కల్గి ఉంది.ఛీనా దాల్చిన/లవంగ పట్ట లారేసి కుటుంబానికి చెందినది.ఈ చెట్టు వృక్షశాస్త్ర పేరు సిన్నమోముమ్ కాస్సియ (Cinnamomum cassia).అంతేకాదు సిన్నమోముమ్ ఆరోమాటికం, లారస్ కాస్సియా అనికూడా అంటారు.[1]
లవంగ పట్ట /కాస్సియా జన్మస్థానం చైనా/చీనా దేశం, బర్మా. అందుకే లవంగ పట్టను చీనీస్ సిన్నమోన్ లేదా కాస్సియా బెరడు (cassia bark) అంటారు.సన్నగా వుండీ, సతత హరితమైన ఈ చెట్టు 20 మీటర్ల (65 అడుగుల వరకు) ఎత్తువరకు పెరుగును. చెట్టుకు మందమైన నునుపైన ఆకులు వుండి, చిన్నని పూలను పుష్పించును.పూలు తెల్లగా వుండును.లవంగ పట్టను/బెరడును కూరలలో, బేకరీ ఆహారపదార్థాలలో, క్యాండిస్లలో, మృదు పానీయాలలో సువాసన మంచి రుచి ఇచ్చుటకై చేర్చుతారు.[1]
లవంగపట్ట చెట్టు యొక్క ఆకులు, బెరడు చిన్నకోమ్మలు, రెమ్మలనుండి ఆవశ్యక నూనెను నీటి ఆవిరిస్వేదన /స్టీము డిస్టీలేసను పద్ధతిలో సంగ్రహిస్తారు.
లవంగ పట్ట నూనె ఘాటైన వాసన వున్న ఆవశ్యక, సుగంధ తైలం. చెట్టు యొక్క ఆకులు, రెమ్మలు, బెరడు నుండి ఆవశ్యక నూనెను ఉత్పత్తి చేస్తారు
నూనెలో దాదాపు 16 రకాల రసాయనాలు వున్నవి [2] చీనీస్ దాల్చిన /లవంగ పట్ట నూనెలో చాలా రకాల రసాయన సంయోగ పదార్థాలు (అల్డిహైడులు, ఆల్కహాలులు, పైనేనులు, టేర్పేనులు తదితరాలు) వున్నప్పటికి వాటిలో సిన్నమిక్ అల్డిహైడ్, సిన్నమైల్ ఆసిటెట్, బెంజాల్డిహైడ్, లినలూల్,, చావికోల్ ప్రధానమైనవి.[1] నూనెలో సిన్నమల్దిహైడ్ 75 నుండి90% వరకు వుండును.నూనెలోని మరికొన్ని రసయనాలు మెథోక్సిసినమల్డిహైడ్, ఇథైల్ సిన్నమేట్, సలిసైఅల్డిహైడ్ లు.[3] నూనెలోని కొన్ని ప్రధాన రసాయ్నాల శాతం పట్టిక[3]
వరుస సంఖ్య | రసాయన పదార్థం | శాతం |
1 | సిన్నమాల్డిహైడ్ | 70-85 |
2 | మెథోక్షి సిన్నమాల్డిహైడ్ | 11%వరకు |
3 | సిన్నమైల్ అసిటేట్ | 6%వరకు |
4 | బెంజాల్డిహైడ్ | 1%వరకు |
5 | ఇథైల్ సిన్నమేట్ | 0.4 |
6 | కౌమరిన్ | 0.2 |
నూనె బ్రౌన్ రంగులో వుండును.రిపైండ్ చేసిన నూనె వర్ణరహితంగా వుండును.నూనె సాంద్రత నీటి కన్న కొంచెం ఎక్కువ[3]
వరుస సంఖ్య | భౌతిక గుణం | మితి |
1 | రంగు | బ్రౌన్ రంగు |
2 | వక్రీభవన సూచిక | 1.609[4] |
3 | సాంద్రత | 1.014 – 1.040.[3] |
4 | ఫ్లాష్ పాయింట్ | 91 °C[4] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.